రివ్యూ

గురి తప్పిన కహానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు..మదారీ
**
తారాగణం: ఇర్ఫాన్ ఖాన్, జెమీ షేర్‌గిల్, తుషార్ దాల్వీ,
విశేష్ బన్సాల్ తదితరులు
సంగీతం: విశాల్ భరద్వాజ్
కథ: శైలజా కేజ్రీవాల్
సినిమాటోగ్రఫీ: అవినాష్ అరుణ్
స్క్రీన్‌ప్లే: రితేష్ షా
నిర్మాతలు: ఇర్ఫాన్ ఖాన్, శైలేష్ సింగ్
దర్శకత్వం: నిశికాంత్ కామత్
**
వ్యవస్థని నిలదీసే కథలూ.. వ్యవస్థతో పోరాటం చేసే కథలూ చూశాం. తిరుగుబాటు కథలూ విన్నాం. ఇంకెన్నాళ్లైనా వింటూనే ఉంటాం. చూస్తూనే ఉంటాం. కానీ -ఆయా కథలన్నీ రొటీన్‌కి భిన్నంగానూ.. మాటల గారడీతోనూ సక్సెస్ అయితే అయి ఉండొచ్చు. ఆ మాటకొస్తే.. ఆ కథలకి ‘లైఫ్’ ఉంటుందన్నది ఇండస్ట్రీ మాట. ఓ అసమాన నటుడూ.. చక్కటి స్క్రీన్‌ప్లే.. కథలో బిగి ఉంటే -ఇక ఢోకా ఉండదు. పెచ్చుమీరిన ధరలూ.. పోలీస్ వ్యవస్థ.. అవినీతి రాజకీయం.. రైతుల ఆత్మహత్యలు.. వ్యవస్థలోని లొసుగులతో ప్రతి సామాన్యుడూ నిత్య జీవితంలో పోరాటం సలుపుతూనే ఉన్నాడు. ఎవరికీ తెలీని ‘రహస్యం’ కాదు. ఐతే- ఆయా యధార్థ సంఘటనల సమాహారాన్ని తెర కెక్కించాలంటే.. కథ, స్క్రీన్‌ప్లే సరిగ్గా వొనగూడాలి. లేకుంటే.. ‘మదారీ’లా ఏదీ తేల్చుకోలేని విధంగా మారుతుంది.
‘... కహానీ సచ్చీ లగ్తీ హై.. మగర్ లగ్తీ హై..’ అన్న ఇర్ఫాన్‌ఖాన్ వాయిస్ ఓవర్‌కి న్యాయం జరిగిందా? లేదా? అన్నది చూడాలంటే.. కథేంటో చూడాలి. ఒక సామాన్య వ్యక్తి నిర్మల్ కుమార్ (ఇర్ఫాన్). ప్రభుత్వ యంత్రాంగంలోని లంచగొండితనం వల్ల.. వ్యవస్థలోని లోపాల వల్ల తన కొడుకుని పోగొట్టుకుంటాడు. తనకి న్యాయం చేయమని ఎవరిని అర్థించినా.. ప్రయోజనం శూన్యం కావటంతో - హోం మినిస్టర్ (తుషార్ దాల్వీ) కొడుకుని కిడ్నాప్ చేసి.. వ్యవస్థపై పోరాటాన్ని చేస్తాడు. ఇదీ టూకీగా కథ. ఈ సినిమాలో ఇంతకు మించి చెప్పుకోదగ్గది ఏమీ లేదు. కిడ్నాపైన హోంమినిస్టర్ కుమారుణ్ని పోలీసులకు దొరక్కుండా ఇర్ఫాన్ ఏం చేశాడు? టెక్నికల్ సెటప్‌ని ఏ విధంగా నెలకొల్పుకున్నాడు? అన్న ఎత్తుకు పైఎత్తుల మధ్య సినిమా అంతా టెన్షన్‌గా నడుస్తుంది.
‘ఎ వెన్స్‌డే’ (2008) చిత్రానికీ ఈ చిత్రానికీ చూచాయగా ఏవైనా పోలికలు కనిపిస్తే కనిపించి ఉండొచ్చు. కానీ- సినిమా చూస్తున్నంత సేపూ ‘వెన్స్‌డే’ సినిమా మదిలో మెదిలితే మాత్రం క్షమించరాని నేరమే. కళ్లెదుట ఇర్ఫాన్ ఖాన్ లాంటి ఉద్ధండుడు ఉన్నప్పటికీ.. అతగాడితో సరిసమానంగా నటించగల సత్తా ఉన్న నటులు ఉన్నప్పటికీ.. ‘మదారీ’ మదిలోకి జొరబడదు. అందుకు కథ ఒక మైనస్ పాయింట్. వ్యవస్థ మీద తిరుగుబాటు చేసిన వ్యక్తుల తాలూకు గాథలు ఇప్పటికే తెరపై చూసి ఉండటంవల్ల వాటన్నింటితోనూ ప్రేక్షకుడు సతమతమై.. ఎటూ తేల్చుకోలేక పోతాడు.
శైలజా కేజ్రీవాల్.. ఈ సినిమాని సోషల్ థ్రిల్లర్‌గా మలిచి.. వ్యవస్థలోని తప్పొప్పులను వేలెత్తి చూపిద్దామనుకొన్నప్పటికీ.. ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా కాకండానూ.. సస్పెన్స్ పరంగా అలరించేదిగానూ లేకపోవటం.. సగటు ఎంటర్‌టైన్‌మెంట్ ‘మిస్’ కావటంతో ఈ సినిమా చతికిలపడింది. ఆఖరికి ఇర్ఫాన్ కూడా ఏమీ చేయలేక పోయాడు. దాదాపు అన్ని సన్నివేశాల్లోనూ పవర్ ఫుల్ డైలాగ్స్ పడినప్పటికీ.. ప్రేక్షకుడు అందులో ఇన్వాల్వ్ కాలేకపోయాడు. ఆస్పత్రి సన్నివేశంకానీ.. ప్రభుత్వ ఆఫీసులోని సన్నివేశం.. ఇలా ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం ధీటైనదిగా రూపొందింది. కానీ- హృదయాన్ని ఆర్ద్రతతో నింపలేక పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే- ‘మదారీ’ ప్రేక్షకుడికి ‘కనెక్ట్’ కాలేకపోయింది.
నటనాపరంగా - ఇర్ఫాన్‌కి ఎవరూ సాటిరారు. రాలేరు. ఆయా పాత్రధారులు తమ వంతు కృషి చేశారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ చేసింది.

-అనిల్