రివ్యూ

వినేసిన సందేశమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు.. ట్వంటీఫస్ట్ సెంచరీ లవ్
**
తారాగణం:
గోపీనాథ్, విష్ణుప్రియ, సూర్య, గౌతంరాజు, పృధ్వీ, సుమన్‌శెట్టి, జబర్దస్త్ వేణు, జూ.రేలంగి కెమెరా: జిఎల్ బాబు
సంగీతం: కనిష్క
నిర్మాత: పిఎన్‌ఆర్ నరేంద్ర
దర్శకత్వం: గోపీనాథ్
**
ప్రేమ నేపథ్యంలో ఇప్పటి వరకూ అనేక వందల చిత్రాలు తయారయ్యాయి. అదేంటో కనిపించని ప్రేమ ఇతివృత్తంగా వందల కోట్ల వ్యాపారమూ జరుగుతుంది. అంటే ప్రేమలో ఏదో ఉంది. ఏం ఉందో ఎవరు చెప్పాలి? అసలు ప్రేమ గూర్చి యువతకు ప్రత్యేకంగా చెప్పాలా? ఔను, ప్రేమను నేర్పించాలనే అంటున్నాడు ఈ చిత్ర దర్శకుడు. ప్రేమంటే ఆకర్షణ మాత్రమే కాదని, అదొక అద్వితీయమైన అనుభూతి అన్న విషయాన్ని యువతకు నేర్పించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మరోసారి వైవిధ్యంగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
కథేంటి?
బాలు (గోపీనాథ్) తండ్రి సూర్యం చిన్నప్పటినుండి కొడుకును తన అదుపు ఆజ్ఞలతో పెంచుతాడు. మనసులో ఏ భావన కలిగినా తనకు చెప్పమని చెబుతాడు. సిగరెట్ తాగాలనిపించినపుడు, ఏదైనా నచ్చినది దొంగతనం చేయాలనిపించినా తండ్రికి చెప్పేవాడు. తండ్రి ఇచ్చిన శిక్షణతో బాలు ఉన్నతమైన నైతిక విలువలతో పెరిగి పెద్దవాడవుతాడు. ప్రేమ అనేది కేవలం శారీరక ఆకర్షణ తప్ప మానసిక ఆనందం లేనిదని గుర్తిస్తాడు. తనతోపాటు వున్న స్నేహితులకు ఇదే విషయం చెబుతాడు. కాలేజీలోకొచ్చాక ప్రియ (విష్ణుప్రియ) పరిచయమవుతుంది. వారిద్దరిమధ్య ఆకర్షణ మొదలవుతుంది. అది ప్రేమో ఆకర్షణో ఇద్దరూ ఆలోచించి ఓ నిర్ణయానికి వస్తారు. తమది నిజమైన ప్రేమ అయితే, ఓ ఆరేళ్లపాటు ఎటువంటి తొందరపాటు పనులు చేయకుండా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి, తరువాతే పెళ్లిపీటలు ఎక్కాలని నిర్ణయించుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రేమ పేరుతో సమిథలవుతున్న అనేకమంది యువతీ యువకుల జీవితాలను గమనించి, ప్రేమ అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని తయారు చేస్తారు ఇద్దరూ. యూనివర్సిటీ ఈ గ్రంథానికి పిహెచ్‌డి ప్రదానం చేస్తుంది. ఆ గ్రంథంతో ప్రేమికులకు ఆ జంట ఇచ్చిన సందేశమేమిటి? అనేది తెరపై చూడాలి.
ఎలా వుంది?
సినిమాలో చెప్పిన అంశం అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకునేదే. కథలో కథనంలో పట్టు సాధించడానికి ప్రయత్నం బాగానే జరిగింది. కథ గొప్పగా ఉన్నంత మాత్రాన కథనం అదే స్థాయిలో ఉందనుకుంటే పొరపాటు. కథ ఎంత గొప్పదో నటించిన నటీనటులు ఆ స్థాయికి తగ్గట్టు లేకపోవడంతో పూర్తిగా కథలో లీనం కాలేకపోతాం. తెలుగు టీచర్ చెప్పే పద్యాలను ఏవగించుకున్న తీరు ఆహ్వానించదగినది కాదు. మన సంస్కృతి ఏమిటో చెప్పేముందు అందులో భాగమైన తెలుగు పద్యాలను ఈసడించుకోవడంతో ప్రేక్షకుడికి సరైన క్లారిటీ రాదు. పనిలేనివాళ్ళు చేసే పని ప్రేమించుకోవడం అన్న మాట ఒప్పుకున్నా, మొదటి సగమంతా హీరో స్నేహితులు చేసింది అదే! బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ ఇచ్చిన బహుమతులు చాలా కొత్తగా ఉంటాయట. ప్రేమలో వున్న బెనిఫిట్స్, డ్రాబ్యాక్స్ గురించి చర్చించిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రేమించాక దాని పర్యవసానంగా ఎదురయ్యే పరిణామాలను ఒక్కసారి గుర్తుకు చేసుకుంటే, ప్రేమలో హద్దులు తెలుస్తాయి. మన తల్లిదండ్రుల కష్టాన్ని గురించి ఆలోచించినప్పుడు కూడా ప్రేమలోవున్న నిజమైన అనుభూతి చిన్నదనిపిస్తుంది. ఈ రోజుల్లో అబ్బాయిలు తేనెటీగల్లాగా పువ్వు పువ్వుకూ తిరుగుతున్నారు. అదేవిధంగా ఇప్పటి అమ్మాయిలు కూడా సినిమాలకు తీసుకెళ్లడానికి ఐసుక్రీమ్‌లు తినిపించడానికి, సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ వేయించడానికి అబ్బాయిలు చుట్టూ తిరుగుతున్నారని చెప్పడం బాగానే వుంది. ఆరేళ్ల తరువాత మనం పెళ్లిచేసుకుందాం అని అబ్బాయి అంటే, అందుకు ఓ అమ్మాయి ఇలా అంటుంది. ‘ఆరు నిమిషాలకు ఓ బాయ్‌ఫ్రెండ్ రెడీగా ఉన్నాడు, నువ్వెందుకు’ అని ప్రశ్నిస్తుంది. ముఖ్యంగా ప్రేమ అంటే ఇవ్వడం అన్న విషయాన్ని చెప్పాలనుకున్నాడు. ప్రేమలో పడి తమ జీవితాశయాలను, గోల్స్‌ను మర్చిపోవడం సరైన పద్ధతి కాదు. శరీరాలు దగ్గరైతే ఆకర్షణ. మనసులు కలిస్తే అది ప్రేమ. దీన్నిబట్టే ఏది నిజమైనదో అర్థం చేసుకోమనడం సినిమాకు ఓ అర్థాన్నిచ్చింది.
ఇక నటీనటుల్లో విష్ణుప్రియ స్క్రీన్ ప్రెజెంటేషన్ ఆకట్టుకుంటుంది. సినిమా మొత్తం ఆమెపైనే సాగింది. గోపీనాథ్ ఉన్నంతలో ఫర్వాలేదనిపించినా ఆ పాత్రకు తూగలేదు. పృధ్వీ, వేణు చేసిన కామెడీలో అర్థంలేదు. సంగీతపరంగా బాటలన్నీ సోసోగా సాగాయి. కెమెరా పనితనం ఫర్వాలేదు. దర్శకత్వపరంగా ఓవైపు హీరోగా, మరోవైపు నిర్దేశకుడిగా కథనాన్ని మొదటి సగమంతా సోసోగా లాగించినా, రెండో సగంలో ప్రేక్షకులను ఆకట్టుకునే కథనంతో ఓకె అనిపిస్తాడు.

-సరయు