రివ్యూ

రజనీ.. మిస్‌ఫైర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు .. కబాలి
**
తారాగణం:
రజనీకాంత్, రాధికా ఆప్టే, ధన్సిక, నాజర్ తదితరులు
సంగీతం:
సంతోష్ నారాయణ్
నిర్మాత:
కలైపులి థాను
దర్శకత్వం:
పా రంజిత్
**
కబాలి.. గత కొన్ని రోజులుగా సినిమా వర్గాల్లో అలజడి క్రియేట్ చేసిన చిత్రం. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రంలో ఆయన మెకోవర్ గెటప్ ఫ్యాన్స్‌కే కాదు, రజనీని ఫాలో అయ్యేవాళ్లకూ షాక్ ఇచ్చింది. కబాలి టైటిల్ ప్రకటించిన దగ్గర్నంచీ చిత్రం సెనే్సషన్ క్రియేట్ చేసింది. చిత్రం విడుదలయ్యే సమయానికి అంచనాలు ఆకాశాన్ని అందేశాయి. భారీ అంచనాలు.. భారీ బడ్జెట్.. భారీ బిజినెస్‌తో సంచలనం క్రియేట్ చేసిన కబాలి ఎవరు? ఏం చేశాడో తెలుసుకుందాం.
కథ
కబాలి (రజనీకాంత్) మలేషియాలో పెద్ద గ్యాంగ్‌స్టర్. హత్య కేసులో పోలీసుల చేతికి చిక్కి 25 ఏళ్ళపాటు జైలు జీవితం గడిపిన అతనికి వయసు మీద పడింది కాబట్టి విడుదల చేయాలని అధికారులు నిర్ణయం తీసుకుంటారు. అలా తిరిగి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టడంతో కథ మొదలవుతుంది. కబాలి బయటకు రావడంతోనే అతడ్ని చంపాలని ఏన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న వాళ్ళంతా తిరిగి దాడికి ఉపక్రమిస్తారు. ఇక 25 ఏళ్ళ క్రితం తాను దేనికోసమైతే పోరాడాడో, ఆ సమస్య ఇంకా అలాగే ఉందని గమనించిన కబాలి, మళ్లీ తన గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని కొనసాగిస్తాడు. ఈక్రమంలో అతడికి ఎదురయ్యే సవాళ్ళు ఏమిటి? ఒక గొడవలో చనిపోయిన అతడి భార్య కుందనవల్లి (రాధికా ఆప్టే) నిజంగా చనిపోయిందా? చనిపోకపోతే ఆమె ఎక్కడుంది? కబాలికి ఒక కూతురు కూడా ఉంది. ఉంటే ఆమె ఎవరు? మలేషియాలో ఏళ్ళుగా అలాగేవున్న సమస్యపై కబాలి ఎలా పోరాడాడు? అసలు కబాలిని మొదట్లో గ్యాంగ్‌స్టర్‌గా మార్చిన పరిస్థితులేంటి? లాంటి ప్రశ్నలకు సమాధానమే సినిమా.
సినిమాకు సూపర్‌స్టార్‌గా రజనీ చరిష్మానే ప్రధానమైన ఆయుధం. వయసైపోయిన గ్యాంగ్‌స్టర్‌గా కబాలి అనే పాత్రలో రజనీ స్టయిల్, నటన అన్నీ టాప్ క్లాస్ అనేలా ఉన్నాయి. ఇక ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో ఓ ఆవేశపరుడైన యువకుడిగానూ రజనీ బాగా ఆకట్టుకున్నాడు. రజనీ స్టైల్ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఆయన మ్యానరిజమ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక దర్శకుడు పా.రంజిత్ మలేషియాలో జీవించే భారతీయుల బాగుకోసం పోరాడే సన్నివేశాలను, ఆ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లోని ప్రధానమైన ఎమోషన్‌ను బాగానే చూపించాడు. అనుకున్న కథను ఎక్కడా ఇమేజ్‌కి తగ్గకుండా వీలైనంత వాస్తవికంగానే ఉండేలా చూసుకోవడంలో పా.రంజిత్ సాహసాన్ని మెచ్చుకోవచ్చు. 25 ఏళ్ళ తర్వాత జైలునుంచి రజనీ తన ఇంటికి తిరిగి రావడం, ఎన్నో ఏళ్ళకు కనబడిన కూతురితో అతడి ప్రయాణం.. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలన్నీ బలమైన ముద్రవేశాయి. ఇక రజనీ భార్యగా నటించిన రాధికా ఆప్టే తన నటనతో కట్టిపడేశారు. ధన్సిక తన పాత్రలో ఒదిగిపోయి నటించింది. విలన్స్‌గా నటించిన విన్‌స్టర్ చౌ, కిషోర్.. ఇద్దరూ మంచి ప్రతిభ కనబరిచారు.
దర్శకుడు పా.రంజిత్‌కు రజనీలాంటి సూపర్‌స్టార్ వెపన్ దొరికినా కథను సహజత్వంగానే చెప్పాలనే ప్రయత్నం చేశాడు. ఇక్కడివరకూ మెచ్చుకోదగిందే. అయితే ఒక బలమైన కథాంశాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకూ కనెక్టయ్యేలా చెప్పడంలో మాత్రం దర్శక, రచయితగా రంజిత్ విఫలమయ్యాడు. రజనీస్థాయి ఇమేజ్‌ని అందుకోవడంలో దర్శకుడి ఆలోచనా విధానం తేలిపోయింది. ఇవన్నీ అలా ఉంచితే మేకింగ్ పరంగా రంజిత్ చేసిన మ్యాజిక్‌ని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం. సౌండ్, కలర్, లైట్.. వీటన్నింటినీ కథ ఎమోషన్‌లో భాగంగా సరిగ్గా వాడటంలో రంజిత్ కొన్నిచోట్ల ఆకట్టుకున్నాడు. అయితే ఈ మేకింగ్ సినిమాకు కమర్షియల్‌గా ఉపయోగపడకపోవడమే నిరాశపర్చే అంశం. సంతోష్ నారాయణ్ అందించిన ఆడియోలో ‘నిప్పు రా’ ఇట్టే ఎక్కేస్తుంది. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో సంతోష్ నారాయణ్ ప్రతిభను ఈ సాంకేతిక అంశాల పరంగా మేజర్ హైలెట్‌గా చెప్పుకోవాలి. జి.మురళి సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన సినిమాటోగ్రఫీ స్టైల్‌తో దర్శకుడి ఆలోచన, కథ మూడ్‌కు మురళి సరికొత్త రూపాన్నిచ్చాడు. యాక్షన్ ఎపిసోడ్స్ ఓకే. ఎడిటింగ్ ఫర్వాలేదు. కలైపులి థాను నిర్మాణ విలువలకు ఎక్కడా వంక పెట్టలేం.
రజనీకాంత్‌లాంటి సూపర్‌స్టార్‌తో వాస్తవిక కథతో సినిమా తీయాలన్న దర్శకుడి ఆలోచన మెచ్చుకోదగినదే అయినా, అలాంటి వాస్తవిక కథలోనూ, రజనీ ఇమేజ్‌కు సరిపడేలా సన్నివేశాలు పెట్టుకునే అవకాశం ఉంటుందని తెలిసి, వాటి జోలికి పోకపోవడం ఈ సినిమా విషయంలో జరిగిన తప్పిదం. రజనీ సినిమాలో ఏయే అంశాలు ఉంటాయని ప్రేక్షకుడు ఆశిస్తాడో, అవన్నీ ఈ సినిమాలో అనుకున్న స్థాయిలో లేవు.
రజనీని పూర్తిగా కొత్తగా, ఓ రియలిస్టిక్ సినిమాలో చూడాలని కోరుకునే వారికి ఈ సినిమా నచ్చొచ్చు. అయితే రజనీ మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టకుని వెళితే మాత్రం నిరాశ తప్పదు. కథ వేగం చాలా నెమ్మదిగా నడవడాన్ని ప్రధానమైన ప్రతికూలాంశంగా చెప్పుకోవచ్చు. సెకెండాఫ్‌లో సినిమా మరీ నెమ్మదిగా నడిచి చాలాచోట్ల బోర్ కొట్టించింది. అదేవిధంగా ఓ బలమైన కథాంశానే్న ఎంచుకున్న దర్శకుడు, దాన్ని అందరికీ కనెక్ట్ అయ్యేలా పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో విఫలమయ్యాడు. సాధారణ ప్రేక్షకుడు కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్ అన్నది పెద్దగా లేదనే చెప్పుకోవాలి.

-త్రివేది