రివ్యూ

వింతల్లో వింత! ( బాగోలేదు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*కవ్వింత

తారాగణం:
విజయ్ దాట్లా, దీక్షాపంత్, ఎల్‌బి శ్రీరాం, సుభాషిణి, ధన్‌రాజ్, అంబటి శ్రీను తదితరులు
సంగీతం: సునీల్ కాశ్యప్
నిర్మాత:
పువ్వల శ్రీనివాసరావు
దర్శకత్వం:
విజయ్ చౌదరి త్రిపురనేని

అస్సలు విషయమనేది లేకండా రెండు గంటలు అనర్గళంగా సొల్లు కబుర్లు చెప్పాలన్నా.. దానికీ ఎంతో కొంత ‘బుర్ర’ కావాలి. ఎక్కడో ఓ మూల మొదలెట్టి.. ఆ ఊరూ ఈ ఊరూ తిరిగి ఆఖరికి ‘క్లైమాక్స్’ అనే శుభం కార్డు దగ్గరికి చేరటం చూశాం. ఒక అరడజను లవ్ సీన్లతోనూ - వెర్రిమొర్రి కామెడీ సన్నివేశాలతోనూ -ముగించటం ఇంకో ప్రక్రియ. హారర్ అనే బూచిని చూపెట్టే ‘ఆత్మ’లేని కథల్నీ పరికించాం. పది కథల్లోంచి అక్కడో సన్నివేశాన్నీ ఇక్కడో సన్నివేశాన్నీ చుట్టేసి.. మరో సినీ ‘ముడి’ పదార్థాల్నీ చూసి తరించాం. ఎట్టకేలకు ‘న భూతే న భవిష్యత్’ అంటూ ‘కవ్వించబోయిన’ ఈ సినిమా ఆనుపానులేమిటో చూద్దాం.
కథ
-సాలూరు కుర్రాడు శీను (విజయ్ దాట్లా). అల్లరి చిల్లరిగా తిరగటం.. స్నేహితులతో కాలక్షేపం చేయటం వినా మరేదీ చేయని సగటు పల్లెటూరి అబ్బాయి. శీనులాంటి కుర్రాళ్లకు ‘ప్రేమ’ అనే దోమ కుట్టడం సహజాతి సహజం. వీడికీ ‘రాణి’ దోమ కుట్టింది. దాంతో పొలం గట్లవెంట.. పుట్టలెంట.. పల్లెటూళ్లో ఇక తిరగని ప్రదేశం లేనంతగా తిరిగేస్తూంటే.. ఏ పనీ చేయనివాడికి నా కూతుర్ని ఎట్లా ఇస్తానంటాడు పిల్ల తండ్రి. ఇదీ నేచురల్. ఇక అప్పట్నుంచీ రాణి ప్రేమని దక్కించుకోవటానికి.. పెళ్లి అనే ‘శుభం’ కోసం తాపత్రయపడే ప్రక్రియలో ‘శీను’ ‘నకిలీ’ ప్రేమలో పడతాడు. పాకిస్తాన్ నుంచీ ఇండియాలో దొంగనోట్లు చెలామణి చేసేందుకు ‘సర్కార్’ అనే మాఫియా లీడర్ ‘సాలూరు’లో రంగం సిద్ధం చేస్తాడు. ఓ గోడౌన్‌లో నకిలీ కరెన్సీని భద్రం చేయటం.. ఇత్యాది అసాంఘిక కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న సర్కార్‌కీ.. ఆ నకిలీ కరెన్సీతో శీనుకి సంబంధం ఏమిటన్నది మొదటి రీల్ నుంచీ ప్రేక్షకులకు తెలిసిపోతూనే ఉంటుంది.
కథ ముందే తెలిసిపోయేట్టు చెప్పటం ఓ టెక్నిక్. అదీగాక -ఓవైపు శీను లవ్వాయణం.. మరోవైపు నకిలీ కరెన్సీ జొరబాటుతనం.. అనే కథల్ని ఎక్కడో ‘లింక్’ కలపటానికి దర్శకుడు ప్రయత్నించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే- ఇదొక క్రైమ్, లవ్ విత్ కామెడీ సినిమా.
సింగిల్ లైన్ స్టోరీని ఎటెటో తిప్పి ‘కవ్వింత’గా మలచినప్పటికీ -అంతగా కవ్వింపు లేదు. కవ్వింత అన్న టైటిల్ కాబట్టి ‘బూతు’ని ఆశ్రయిస్తే బోలెడంత క్రెడిట్ కొట్టేయ్యొచ్చునని ఆ దిశగా వెళ్లినప్పటికీ ప్రయోజనం శూన్యం. ఏవో కొన్ని కామెడీ పంచ్ డైలాగ్స్ పెట్టేస్తే సరి అనుకుని -ఆ దిశగానూ ప్రయత్నించారు. దీంతో -శీను ప్రేమకథ -నకిలీ కరెన్సీ బాగోతం మధ్యలో కామెడీతో క్లైమాక్స్ వరకూ లాక్కొచ్చారు. కొద్దిలో కొద్దిగా ప్రీ క్లైమాక్స్ మెప్పించి.. దర్శకుడి టేస్ట్‌ని తెలిపింది. ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ -పాటల్ని మరింత రొమాంటిక్‌గా చిత్రీకరించటం. సినిమాటోగ్రఫీ -సునీల్ కశ్యప్ సంగీతం - పల్లెటూరి వాతావరణం చక్కటి అనుభూతిని కలిగిస్తుంది. అంతమాత్రాన ‘న భూతో న భవిష్యతి’ కాదు.
సినిమాలో మైనస్‌ల గురించి చెప్పాలంటే- స్థలాభావం వల్ల కుదర్దు. ఏ పాత్రకి స్థిరమైన లక్ష్యంలేదు. హీరోయిన్ కేవలం పాటల కోసమే వచ్చి వెళ్తూంటుంది. ఇలా ఒక్కో అంశం గురించి విడమర్చి చెప్పటం కష్టం. కాబట్టి -టోటల్‌గా ఎవరి శాఖలో వారు గిరి గీసుకొని తమవంతు కృషి చేశారు. శీనుకి లారీ డ్రైవర్ అనే చిన్నపాటి పని ఇచ్చి.. దానికి ‘పెన్ డ్రైవ్’ అనే అంశాన్ని జోడించటంతో -సినిమా అంతా పెన్‌‘డ్రైవర్’ చుట్టూ తిరుగుతుందని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. కాబట్టి -అంతకుమించి ‘వెరైటీ’ని ఈ సినిమా నుంచి ఆశించటం శుద్ధ వేస్ట్. ‘బూతు’ ఉందని చెప్పారుగా.. ఆ దిశగా మేం వెళ్తామన్న ప్రేక్షకులకు చెప్పేదేం లేదు. కాకపోతే- పల్లెటూరి వాతావరణం ‘బూడిదలో పోసిన పన్నీరు’ అయింది. కవ్వింతలో ఇదొక ‘వింత’.

-ప్రనీల్