రివ్యూ

ఇంకొంచెం చెక్కాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు..జక్కన్న
*
తారాగణం: సునీల్, మన్నారా చోప్రా, కబీర్‌సింగ్, ఆశిష్ విద్యార్థి తదితరులు.
సంగీతం: దినేష్
సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్
నిర్మాత: సుదర్శన్‌రెడ్డి
దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ల
కమెడియన్ క్రేజ్ తెచ్చుకున్న సునీల్ -అందాల రాముడుతో హీరో అయ్యాడు. హీరో కెరీర్‌నే కంటిన్యూ చేస్తూ... ఇటీవలి వరుస ఫ్లాప్‌లతో విసిగిపోయిన సనీల్ -హిట్ కోసం ఎదురుచూసి చేసిన సినిమా జక్కన్న. వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి జక్కన్న సునీల్ కెరీర్‌ను కొత్తగా చెక్కాడా? లేదా తెలియాలంటే కథలోకి వెళ్లాలి.
కథ:
ఒకరినుంచి సాయం పొందితే తిరిగి వాళ్లకు సాయం చేయాలనే కానె్సప్ట్ -జక్కన్నది (సునీల్). అందుకు దేనికైనా సిద్ధపడతాడు, ఎంతైనా కష్టపడతాడు. వైజాగ్ సిటీలో పెద్ద రౌడీ అయిన బైరాగి (కబీర్‌సింగ్) అనుకోకుండా జక్కన్నకు సాయం చేస్తాడు. ఆ సాయానికి బదులు తీర్చుకోవడానికి బైరాగిని వెతుక్కుంటూ వైజాగ్‌లో అడుగు పెడతాడు జక్కన్ ఉరఫ్ గణేష్. అసలు గణేష్‌కి బైరాగి చేసిన సాయమేంటి? సమాజానికి తానెవరో తెలీకుండా రౌడీయిజం నిర్వహిస్తున్న బైరాగిని గణేష్ ఎలా కలిసాడు? తనకు చేసిన సాయానికి బదులుగా బైరాగికి గణేష్ ఏంచేశాడు?లాంటి ప్రశ్నలకు సమాధానం మిగతా సినిమా.
హీరో సునీల్ మొదట్నుంచీ చివరి వరకూ సినిమాను భుజాలపై మోసే ప్రయత్నం చేశాడు. డ్యాన్సులు, ఫైట్లు, కామెడీ.. ఇలా కమర్షియల్ హీరో ప్రయత్నాలన్నీ ఎప్పట్లానే బాగానే చేశాడు. ఇక మన్నారా చోప్రా నటనపరంగా ఫర్వాలేదనిపించింది. పాటల్లో, కొన్ని సన్నివేశాల్లో వీలైనంత అందాల ప్రదర్శన చేసింది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన కామెడీ బాగుంది. సెకండాఫ్‌లో పోలీసాఫీసర్ కట్టప్ప పాత్రలో పృథ్వీ, నందమూరి బాలకృష్ణను ఇమిటేట్ చేస్తూ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. విలన్‌గా నటించిన కబీర్‌సింగ్ కూడా ఓకే. సినిమాపరంగా చూసుకుంటే సెకండాఫ్‌లో ట్విస్ట్ రివీల్ అయ్యాక ఒక ఇరవై నిమిషాల ఎపిసోడ్‌ను ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. సప్తగిరి మాస్ కామెడీ అక్కడక్కడా నవ్వించింది.
సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్ పనితనం బాగుంది. ఫస్ట్ఫాలో విలన్ నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాల్లో రాంప్రసాద్ కెమెరా పనితనం చూడొచ్చు. సంగీత దర్శకుడు దినేష్ సినిమాకు పెద్దగా ఉపయోగపడింది లేదు. ఆయన అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రెండూ ఆకట్టుకునేలా లేవు. ఎడిటింగ్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
ఇక దర్శక, రచయిత ఆకెళ్ళ వంశీకృష్ణ ఒక కామెడీ సినిమాకు సరిపడే పాయింట్‌నే ఎంచుకున్నా దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో విఫలమయ్యాడు. రాసుకున్న స్క్రీన్ ప్లే చెప్పుకోదగ్గదిగా లేదు. హీరోకి, విలన్‌కి లింక్ కుదర్చడం, పృథ్వీ కామెడీ, సునీల్ టైమింగ్‌ని కొన్నిచోట్ల వాడటం...లాంటి విషయాల్లో దర్శకుడిగా ఫర్వాలేదనిపించాడు.
కమర్షియల్ హీరో అంటే ఫైట్స్, డ్యాన్స్, డైలాగ్స్ చెప్పడం, ఎమోషన్ పండించడం, కామెడీ.. ఇలా ఆయా హీరోనిపట్టి ఏయే అంశాలు ఉండాలో అవి మారిపోతూవుంటాయి. కమెడియన్ నుంచి కమర్షియల్ హీరోగా మారిన సునీల్, మొదట్నుంచీ తనకు బలమైన కామెడీనే నమ్ముకుంటూ వస్తున్నాడు. ఇక ఈ సినిమాలోనూ ఆయన అదే తరహా కామెడీతో మెప్పించే ప్రయత్నం చేశాడు. అయితే కథ, కథనాల్లో బలం లేకపోవడం, రొటీన్ సినిమా నెరేషన్‌లోనే పెద్దగా ఎగ్జైటింగ్ అంశాలు లేకపోవడం లాంటివి సినిమాను ముందుకు నడిపించలేకపోయాయి. హీరో పాత్రనుంచి పుట్టే కథలో, అసలు హీరో పాత్రకు స్పష్టమైన అవగాహన లేకుండా చేయడం నచ్చదు. ముఖ్యంగా తనకు సాయంచేసిన వారికి తిరిగి వాళ్ళు వద్దనేవరకూ సాయంచేసే లక్షణాలున్న హీరో పాత్రను స్పష్టంగా డిజైన్ చేయలేకపోయారు. సెకండాఫ్‌లో ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్‌కి వచ్చేసరికి సినిమా అంతా అయోమయంగా మారింది. పాటలు వినడానికి ఏమాత్రం బాగోలేకపోగా, అవి వచ్చే సందర్భాలు అంతకుమించి బాలేవు. ఇక డైలాగ్స్ కూడా మైనస్ పాయింట్. ప్రాసల గోల తప్ప అందులో సందర్భం, కంటెంట్ కనిపించదు. జక్కన్న పేరుకున్నా చెక్కడంలో మాత్రం అంతటి పనితనం కనిపించలేదు.

-త్రివేది