రివ్యూ

మూలాలు దొరకని నాగరి‘కథ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు.. మొహెంజొదారో

తారాగణం: హృతిక్ రోషన్, పూజా హెగ్డే, కబీర్ బేడీ, అరుణోదయ్ సింగ్,
సుహాసిని ములే, మనీష్ చౌదరి తదితరులు
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సినిమాటోగ్రఫీ: సికె మురళీధరన్
ఆర్ట్: సంజయ్ కరోలె
నిర్మాత: లారెన్స్ డిసౌజా
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
అశుతోష్ గోవిర్కర్

టెక్స్ట్‌బుక్స్‌లో -చదివిన మొహెంజొదారో నాగరి‘కత’ ఇనే్నళ్లయినా ఎనే్నళ్ళయినా కళ్ల తెరల మీద.. శిథిలాల మధ్య వైభవోపేతంగా అలరారుతూనే ఉంటుంది. క్రీ.పూ.26 వందల ఏళ్ల క్రిందటి సంస్కృతి.. సింధ్ ప్రాంతంలో రేపటి తరాలకు ‘నాగరికత’ను వెల్లడి చేస్తూ.. ఉన్నపళాన అదృశ్యమై పోయి... ఏ పరిస్థితుల కారణంగా ‘శిథిల - అస్తిపంజరాల’ తాలూకు చేదు అనుభవాలు -మిస్టరీగానే ఉండిపోయాయి. సింధులోయ నాగరికత -మొహెంజొదారో, హరప్పా నగరాల గత వైభవం పేజీల్ని తిరగేసినకొద్దీ అనేకానేక ఉత్కంఠభరితమైన వాస్తవాల్ని కళ్ల ముందు ఉంచుతాయి. ఆ నాగరికత నేపథ్యాన్ని సెల్యులాయిడ్ కాన్వాస్‌పై దృశ్యకావ్యంగా మలచటానికి ఎవరూ సాహసించలేదు. ‘లగాన్’ ‘జోధా అక్బర్’లాంటి భారీ బడ్జెట్ చిత్రాలతో వైవిధ్యభరితమైన కథల్ని ఆవిష్కరించి.. ఇటు ఆర్ట్‌పరంగానూ.. అటు కమర్షియల్‌గానూ విజయాన్ని సాధించిన అశుతోష్ గోవిర్కర్ ‘ఎపిక్ ఎడ్వంచర్ - రొమాన్స్ ఫిల్స్’ని 115 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాడు. ఇప్పటి వరకూ ఈ నాగరి‘కత’ అదృశ్యం వెనుక ఉన్న నీలినీడలు స్పష్టం కాలేదు.
ఐతే- మొహెంజొదారో నేపథ్యానికి కాల్పనిక కథని జోడించి.. మూలాల్లోకి వెళ్లకుండానే.. పైపై మెరుగులు దిద్దిన అశుతోష్ ఈ కథ ద్వారా ఏం చెప్పదలచుకున్నాడో ప్రేక్షకులకి వొకింత అర్థం కాలేదు.
అది క్రీ.పూ.2016 అనుకొందాం. శర్మన్ (హృతిక్ రోషన్) అనే రైతు మొహెంజొదారోకి పయనమవుతాడు. అక్కడ చానీ (పూజా హెగ్డే) అనే అమ్మాయి పరిచయమవుతుంది. కానీ- ఆమెకి పెళ్లి నిశ్చయమవుతుంది. ఈ నేపథ్యంలో శరన్ తన ప్రేమలో విజయాన్ని సాధించాడా? జ్యోతిషులు చెప్పిన మాట ప్రకారం నడచుకొన్నాడా? మొహెంజొదారో సంస్కృతి నాగరికతల మూలాల్ని సరికొత్త కోణంలోకి తీసుకెళ్లగలిగాడా? అన్నది క్లైమాక్స్.
స్క్రిప్ట్ రెడీ అయ్యింది మొదలు- అనేకానేక వివాదాల్లో చిక్కుకొని.. ఎప్పటికప్పుడు తాజాగా సన్నివేశాల కూర్పుతో మాటల నేర్పుతో తెరకెక్కిన మొహెంజొదారో కథని అశుతోష్ తాను 1995లో రాసుకొన్న స్క్రిప్ట్‌ని కాపీ కొట్టేశాడని అసిస్టెంట్ డైరెక్టర్, రైటర్ ఆకాశాదిత్య లామా ముంబై హైకోర్టు కెక్కాడు. కోర్టు అతని పిటిషన్‌ని కొట్టేసి లక్షన్నర జరిమానా విధించటంతో.. సినిమా శరవేగంగా పూర్తి చేసుకొందన్నది ఇండస్ట్రీలో వినిపించిన మాట.
భారీ బడ్జెట్‌తో అంటే సుమారు 115 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం వెనుక అశుతోష్ కష్టం ఉంది. యూనిట్ శ్రమ ఉంది. మూడేళ్లపాటు నిర్విరామంగా ఆలోచించి.. మొహెంజొదారో నాగరికతను కళ్ల ముందుకి తెచ్చాడు దర్శకుడు.
కాకపోతే- ఇక్కడ చిన్న లాజిక్ వెంటాడుతోంది. మొహెంజొదారో నాగరికతకూ.. ఆ నాగరికతలో అస్పష్టంగా కనిపించిన శరన్ ప్రేమ కథకూ ‘లింక్’ ఒక్క నేపథ్యం మాత్రమే అనుకొంటే.. ఎందుకో ప్రేక్షకుడు ఆ సంస్కృతిలోకి వెళ్లలేకపోయాడు -అంత ‘్భరీ’గా ఉన్నప్పటికీ. అతి ప్రాచీన నాగరికతని తలకెత్తుకోవటం వల్ల ఈ చిత్రానికి ప్రత్యేకంగా వొనగూడిన ప్రయోజనం ఏమీ లేదు. ‘మొహెంజొదారో’ అన్న టైటిల్‌ని మదిలో తలచుకొని.. ఆలోచనా స్రవంతుల్లోకి వెళ్లిన ప్రేక్షకుడిలో ఆ ‘ఉత్కంఠత’ని కలిగించలేకపోయాడు. ‘లగాన్’ తీసుకుంటే.. అలాంటి సంఘటనల సమాహారం చరిత్ర పుటల్లో నిక్షిప్తమై ఉన్నట్టు.. స్పష్టంగా తెలీకపోయినా.. ఆ కథ తాలూకు ‘మెలోడ్రామా’నీ క్రికెట్ నేపథ్యాన్నీ.. బ్రిటీష్ పాలకుల అరాచకత్వాన్నీ.. కళ్లప్పగించి మరీ చూశాడు ప్రేక్షకుడు. ‘జోధా అక్బర్’ కథనీ టెక్స్ట్‌బుక్స్‌లో కథనీ జోడించి చూసిన సగటు జనం ఏ ఆలోచనా లేకుండా మైమరచిపోగలిగారు. ఐతే -ఇటు మొహెంజొదారో కథనీ.. ఆ నేపథ్యంలోని కాల్పనికతని అన్వయించుకోవటంతోనే ప్రేక్షకుడు గందరగోళంలో పడ్డాడు. అశుతోష్ అసలు ఏం చెప్పదలచుకున్నాడో అర్థంకాక తికమకపడ్డాడు.
కానీ- ప్రతి సన్నివేశాన్నీ భారీగా నిర్మించి.. ఖాళీ స్క్రిప్ట్‌తో కళ్లకి గంతలు కట్టి.. మొహెంజొ ‘దారి’లోకి తీసుకెళ్లాడు దర్శకుడు. భారీ సెట్టింగ్స్.. గాల్లోకి ఎగురుతూ చేసే ఫైట్స్.. పెద్దపెద్ద మొసళ్లు.. పులులు.. దున్నపోతులను వొంటిచేత్తో ఎదుర్కోవటం... వీటికి తోడు హాలీవుడ్ స్టంట్ కోఆర్డినేటర్ గ్లెన్ బోస్వెల్ పనితనం.. కరేన్ గౌలేకస్ గ్రాఫిక్స్‌తో ‘మొహెంజొదారో’ మైమరపింప జేస్తుంది.
ఏది ఏమైనా -మనకి తెలీని ఓ పురాతన నేపథ్యాన్నీ.. ఆ నేపథ్యంలోని కాల్పనిక ప్రేమనీ.. తెరకెక్కించి.. అశుతోష్ సినిమాల పట్ల ‘మోజు’ పెంచేట్టు చేశాడు.
నటనాపరంగా- అందరూ ఉద్ధండులే కాబట్టి ఆ ఊసు అవసరం లేదు. గ్లామర్ డాల్‌గా పూజా హెగ్డే తన పరిధిలో తాను ‘గ్లామర్’ని వొలికించింది. ఎఆర్ రెహమాన్ సంగీతం మళ్లీ పాత రోజుల్ని పాత జ్ఞాపకాల్నీ.. పురాతన సంస్కృతిని గుర్తు చేశాయి.

-అనిల్