రివ్యూ

కాకి బంగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు.. బాబు బంగారం

తారాగణం: వెంకటేష్, నయనతార, షావుకారు జానకి, పృధ్వీ, బ్రహ్మానందం, వెనె్నల కిషోర్, పోసాని తదితరులు
సంగీతం: జీబ్రాన్
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్
ఎడిటింగ్: ఉద్దవ్
నిర్మాత: నాగవంశీ, పిడివి ప్రసాద్
దర్శకత్వం: మారుతి

సోలో హీరోగా వెంకటేష్‌కి వరుస పరాజయాలు మొదలవడంతో -కాస్త గ్యాప్ తీసుకుని మల్టీస్టారర్ సినిమాలకు తెరలేపాడు. మహేష్‌తో సీతమ్మవాకిట్లో..., పవన్‌తో గోపాలా గోపాలా, రామ్‌తో మసాలా సినిమాలు చేశాడు. సోలో హీరోగా తనను తను ప్రూవ్ చేసుకోవడానికి చేసిన మరో ప్రయత్నం -బాబు బంగారం. ఇక దర్శకుడు మారుతికి భలే భలే మగాడివోయ్ చిత్రానికి ముందు వరకూ భిన్నమైన ఇమేజ్ ఉంది. పైగా తన కెరీర్‌లో పెద్ద కమర్షియల్ సక్సెస్‌లు ఏమీ లేవు. కాబట్టి స్టార్ హీరోలు ఎవరూ మారుతితో సినిమాలు చేయలేదు. నాని నటించిన భలే భలే మగాడివోయ్‌తో తనకున్న ఇమేజ్‌ని పోగొట్టుకోవడమే కాకుండా... కమర్షియల్ హిట్‌ను అందుకున్నాడు. దాంతో వెంకటేష్‌తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘బాబు బంగారం’. వెంకీ మార్క్ టీజర్, ట్రైలర్‌తో మంచి అంచనాలను రేకెత్తించింది. చాలా రోజుల తరువాత తెలుగులో నయనతార హీరోయిన్‌గా నటించిన సినిమా విడుదలైంది. మరి బాబు బంగారం ఎలా మెరిపించాడో, మురిపించాడో చూద్దాం.
కథ:
కృష్ణ (వెంకటేష్) అతి జాలికి అందనంత ఎత్తులోవుండే జాలి మనిషి. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అందులోనూ ఏసీపీ హోదాలోవున్నా, నేరస్తుల్ని చూసీ జాలిపడిపోయే మనస్థత్వం అతనిది. హీరోయిన్ శైలజ (నయనతార) ఎన్నో కష్టాలు పడుతూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. ఆమె పడే కష్టాన్ని చూసి బాధపడతాడు. నెల రోజులు సెలవుపెట్టి ఆమె వెనె్నంటే వుంటాడు. శైలజ కుటుంబానికి మాత్రం ఎమ్మెల్యే పుచ్చప్ప (పోసాని కృష్ణమురళీ), మల్లేష్‌యాదవ్ (సంపత్ రాజ్)ల నుంచి ఆపద ఉంటుంది. శైలజ కుటుంబానికి ఉన్న ఆపద ఏంటి? కృష్ణ, శైలజకు దగ్గర కావడానికి ఏవైనా కారణాలున్నాయా? శైలజ కుటుంబాన్ని కష్టాల బారినుంచి తప్పించి పుచ్చప్ప, మల్లేష్‌ల ఆగడాలకు అతి జాలి మనిషి కృష్ణ ఎలా చెక్ పెట్టాడన్నది తెలియాలంటే సినిమా చూడాలి.
నటన విషయానికి వస్తే హీరో వెంకటేష్‌కి ఇలాంటి క్యారెక్టర్ కొత్తేమీ కాదు. ఇప్పటివరకు చాలా సినిమాల్లో ఆయన ఈ మార్క్ పాత్రలతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా నాటి బొబ్బిలిరాజా ఇంపాక్ట్ తేవడానికి ప్రయత్నించాడు. ఆయన లిమిట్స్‌లో క్యారెక్టర్‌కి న్యాయం చేశాడు. నయన్‌ది కూడా రొటీన్ క్యారెక్టర్. పెర్‌ఫార్మెన్స్‌కు ఎక్కడా స్కోప్‌లేని క్యారెక్టర్ ఆమెది. ఇక ఈ సినిమాలో ఫస్ట్ఫా అంతా పృథ్వీ కోసమే తీసినట్టుంది. బత్తాయి బాబ్జీగా మరోసారి పూర్తిస్థాయిలో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేశాడు. గతంలో అతను చేసిన క్యారెక్టర్లను పోలివున్న క్యారెక్టరే అయినప్పటికీ, కొన్ని డైలాగ్స్ బాగా పేలాయి. కానీ పృథ్వి కూడా కొన్ని సన్నివేశాల్లో బోర్ కొట్టించాడు. ఒక దశలో ఫస్ట్ఫా హీరో పృథ్వీయేనా? అనే డౌట్ ఆడియన్స్‌కి వచ్చేస్తుంది. దీన్నిబట్టి అతని క్యారెక్టర్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారన్నది అర్థమవుతుంది. మిగతా క్యారెక్టర్లతో పోసాని, సంపత్‌రాజ్, వెనె్నల కిషోర్ రొటీన్ పెర్‌ఫార్మెనే్స కనిపిస్తుంది. సెకండాఫ్‌లో మెజీషియన్‌గా కనిపించే బ్రహ్మానందం కామెడీ ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్ష.
ఇక టెక్నికల్‌గా చూస్తే -రిచర్డ్ ప్రసాద్ ఫొటోగ్రఫీ సినిమాకి మంచి రిచ్‌లుక్ తీసుకొచ్చింది. సీన్స్, సాంగ్స్, ఫొటోగ్రఫీ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. జిబ్రాన్ చేసిన పాటల్లో మూడు పాటలు ఒకే అనిపిస్తాయి. ఫారిన్ లొకేషన్స్‌లో తీసిన పాటలు విజువల్‌గా బాగున్నాయి. జిబ్రాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. ఉద్దవ్ ఎడిటింగ్ ఫర్వాలేదు. ఫస్ట్ హాఫ్‌లో పృథ్వీకి మారుతి, డార్లింగ్ స్వామి రాసిన మాటలు బాగా పేలాయి. డైరెక్టర్ మారుతి విషయానికి వస్తే సినిమాకి అతను రాసుకున్న కథ అంత గ్రిప్పింగ్‌గా లేదు. ఈమధ్యకాలంలో వచ్చిన చాలా తెలుగు సినిమాల్లో రొటీన్ కథలాగే అనిపిస్తుంది. మంచితనం, జాలి అనే పాయింట్‌తో ఎంటర్‌టైన్ చేద్దామనుకున్న అతని ఆలోచన వర్కవుట్ అవ్వలేదు సరికదా, చాలా సీన్స్‌లో చిరాకు కూడా తెప్పించింది. ఇక కథ సాగుతున్నప్పుడు ఎక్కడ ప్రేక్షకుడికి నెక్స్‌ట్ సీన్‌లో ఏం జరగబోతోందనే క్యూరియారిసిటీ ఆడియన్స్‌లో ఏమాత్రం కలగదు.
కొంత గ్యాప్ తరువాత వెంకటేష్‌ని, ఆయన ట్రేడ్ మార్క్ కామెడీ టైమింగ్‌తో చూడాలని ఎదురుచూస్తోన్న వారందరినీ సంతృప్తి పరిచే సినిమా ప్రచారం పొందిన ‘బాబు బంగారం’, ఆ ప్రచారానికి తగ్గట్టే వెంకీ కామెడీతో ఉన్నా కూడా ఎక్కడా పెద్దగా మెప్పించే సరుకు లేదు. కన్ఫ్యూజ్ డ్రామాతో ఆడియన్స్‌ని పూర్తిగా కన్ఫ్యూజన్‌కు గురి చేసింది. సినిమాకు అతి పెద్ద మైనస్ -రొటీన్ స్టోరీ. గ్రిప్పింగాలేని నేరేషన్. భలెభలె మగాడివోయ్ చిత్రంలోని ‘మతిమరుపు’ కానె్సప్ట్‌ని -వెంకటేష్‌గా ‘అతి జాలి’గా తగలించి రాసుకున్న కథ అనిపిస్తుంది. స్టోరీకి దూరంగా -సినిమా అంతా కమర్షియల్ సినిమా ఫార్ములాలో సాగిపోయింది. వెంకటేష్ స్టార్‌డమ్‌ను, దాంతోపాటు వచ్చే కామెడీపైనే దృష్టిపెట్టిన దర్శకుడు కథను రొటీన్ చేసి సేఫ్‌గేమ్ ఆడేద్దామనుకున్నాడు. ఫస్ట్ఫా మంచి కామెడీ సన్నివేశాలతో నడిస్తే, సెకండాఫ్‌కి వచ్చేసరికి కథంతా సీరియస్‌గా మారిపోతుంది. కథలో ట్విస్ట్‌లు కూడా ముందే అర్థమయ్యేలా ఉన్నాయి. లాజిక్‌కు సినిమాలో ఎక్కడా చాన్స్ లేదు.

-త్రివేది