రివ్యూ

పసలేని సయ్యాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు*ఆటాడుకుందాం.. రా

తారాగణం: సుశాంత్, సోనమ్, మురళీ శర్మ, వెనె్నల కిషోర్, రఘుబాబు, పృధ్వీరాజ్, బ్రహ్మాజీ, బ్రహ్మానందం
సంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాత: చింతలపూడి శ్రీనివాసరావు,
ఏ నాగసుశీల
దర్శకత్వం: జి నాగేశ్వర్‌రెడ్డి
**

మొదటి సినిమా కాళిదాసుతో అక్కినేని కుటుంబం నుంచి తెరంగేట్రం చేసిన హీరో సుశాంత్. హీరోగా నిలదొక్కుకునేందుకు చాలా ప్రయత్నాల తరువాత -తాజాగా వచ్చిన చిత్రం ‘ఆటాడుకుందాం రా’. ఎంటర్‌టైనర్ చిత్రాల దర్శకుడు జి నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రంలో సుశాంత్ సరసన సోనమ్ భజ్వా హీరోయిన్‌గా చేసింది. ఆటాడుకుందాం రమ్మని పిలిచిన సుశాంత్ -ఎలాంటి ఆట ఆడించాడో చూద్దాం.
కథ:
విజయరామ్ (మురళి శర్మ), ఆనంద్‌ప్రసాద్ (ఆనంద్) మంచి స్నేహితులు. ఆనంద్ సలహాలతో వ్యాపారంలో విజయరామ్ కోట్లు గడిస్తాడు. అయితే విజయరామ్‌కు శత్రువైన శాంతారామ్ అతడి సక్సెస్‌ను చూసి తట్టుకోలేక దొంగ దెబ్బతీస్తాడు. అనుకోని పరిస్థితుల్లో శాంతారామ్ పన్నిన కుట్ర ఆనంద్‌పై పడుతుంది. దీంతో విజయరామ్, ఆనంద్ ఇద్దరూ విడిపోతారు. ఇరవైయేళ్ల తరువాత కూడా కష్టాల్లోవున్న విజయరామ్ కుటుంబాన్ని శాంతారామ్ టార్గెట్ చేస్తూనే ఉంటాడు. ఈ సమయంలోనే విజయరామ్‌కి అల్లుడైన కార్తీక్ (సుశాంత్) అమెరికా నుంచి ఇండియా వస్తాడు. విజయరామ్‌కి అతడి చెల్లెలన్నా, ఆ కుటుంబం అన్నా నచ్చదు. అలాంటి మనిషికి కార్తీక్ ఎలా దగ్గరయ్యాడు? కష్టాల్లోవున్న ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకున్నాడు? అతడు నిజంగానే విజయరామ్‌కి మేనల్లుడా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే సినిమా చూడాల్సిందే.
హీరో సుశాంత్ సరదాగా సాగిపోయే పాత్రలో బాగానే నటించాడు. కమర్షియల్ హీరో చేసే డ్యాన్సులు, ఫైట్స్ చేయగలనని ఈ చిత్రంతో మరోసారి నిరూపించుకున్నాడు. ఇక సోనమ్ భజ్వా నటన అంతంత మాత్రమే అయినా, పాటల్లో అందాలు ప్రదర్శన చేసి షాక్ ఇచ్చింది. ఈ సినిమాకు ఉన్నంతలో మేజర్ ప్లస్ పాయింట్ ఫస్ట్ఫాలో పృథ్వీ, సుశాంత్‌ల మధ్య వచ్చే కామెడీ. కథలో ట్విస్ట్‌గా వచ్చే టైమ్‌మెషీన్ నేపథ్యంలో కామెడీ అక్కడక్కడా నవ్వించింది. పోసాని కృష్ణమురళి కామెడీ ఫర్వాలేదనేలా ఉంది. నాగచైతన్య స్పెషల్ ఎంట్రీ కథకు కనెక్టయ్యేది కావడం కూడా సినిమాకు కాస్త వర్కవుటైంది.
కామెడీ ఎలా పండించాలో స్క్రీన్ తెలిసిన దర్శకుడు జి నాగేశ్వర్‌రెడ్డి. అలాంటిది కామెడీ చిత్రం నుంచి ప్రేక్షకుడు ఏవేం కోరుకుంటాడో అలాంటివి పెద్దగా పట్టించుకోకుండా నీరసమైన కథ, కథనాలతో ఈసారి సినిమా చేసినట్టు అనిపించింది. అనూప్ రూబెన్స్ పాటలు సాదాసీదాగా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఎడిటింగ్ ఆకట్టుకునేలా లేదు. విజువల్ ఎఫెక్ట్స్ చెప్పుకోదగ్గవిలా లేవు. స్క్రీన్‌పై కనిపించే రిచ్‌నెస్ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌ను పట్టిచెబుతుంది. దీనికితోడు సినిమాటోగ్రఫీ పనితనం బావుంది. ముందే తెలిసిన ఒక కథతో, ఎలా ఉంటుందో ముందే ఊహించేయగల సన్నివేశాలతో కామెడీ సినిమా వస్తే ఎలా ఉంటుందో అదే ఆటాడుకుందాం రా అనిపిస్తుంది. సన్నివేశాల మధ్యన వచ్చే కామెడీ ఎక్కడా పూర్తిస్థాయిలో నవ్వించలేదు. సెకండాఫ్‌లో టైమ్‌మెషీన్ నేపథ్యంలో వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలు మినహాయిస్తే సినిమాలో చెప్పుకోదగ్గ స్థాయి అంశాలేవీ లేవు. ఒక్కమాటలో చెప్పాలంటే ఫార్ములా కథ, కథనాలతో ఆడిన బలవంతపు ఆటే ఇది. దానికితోడు ఆ ఫార్ములా కథనైనా సరిగ్గా చెప్పేలా కథనం లేకపోవడం నిరుత్సాహపర్చే అంశం. ఫస్ట్ఫాలో కొంతమేర కథ కనిపించినా, సెకండాఫ్‌కి వచ్చేసరికి ఎక్కడా కథే కనిపించదు.

-త్రివేది