రివ్యూ

కాస్త.. నిస్సారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** బెన్-హర్

తారాగణం:
జాక్ హస్టన్, టోబి కెబెల్, రోడ్రిగో శాంతోరో, నజానిన్ బోన్‌నియాడి, మోర్గాన్ ఫ్రీమాన్ తదితరులు
దర్శకత్వం:
తిమూర్ బెక్‌మామ్‌బెటోవ్
**
1880నాటి లియో వాలెస్ నవల ‘ది టేల్ ఆఫ్ ది క్రైస్ట్’ -మొదటిగా 1907లో నిశ్శబ్ద చిత్రంగా వెలువడి సంచలనం సృష్టించింది. తర్వాత 1925లోనూ అదే నవల ‘నిశ్శబ్దం’గానే విడుదలై.. అశేష జనావళిని అలరించింది. తర్వాత్తర్వాత నిశ్శబ్ద తెరల్ని చీల్చుకొని -స్క్రీన్‌పై బొమ్మలు మాట్లాడటం మొదలుపెట్టి -1959 నాటిక్కూడా ఆ నవలపై ఉన్న ఉత్సుకత సినీ పరిశోధకుల్ని శోధింపజేస్తూనే ఉంది. 2003లోనూ ఇదే పేరిట యానిమేటెడ్ మూవీ వచ్చింది.
భూనభోనాంతరాళాలు బద్దలై.. తెరపై అప్పటివరకూ చూడని ఓ మహాద్భుతాన్ని ఆవిష్కరించింది ‘బెన్‌హర్’ సినిమా. ఆ నవలలోని ఏ సన్నివేశాన్నైనా -వొకింత మర్చిపోవచ్చునేమోగానీ- ఛారియట్ రేస్ అంటే ఇనే్నళ్లైనా ఎనే్నళ్లైనా వొళ్లు పులకరిస్తూనే ఉంటుంది. హాలీవుడ్ చరిత్రలో అదొక సువర్ణ్ధ్యాయ దృశ్య కావ్యం. ఒక్క హాలీవుడ్‌లోనే కాదు- ఏ సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకొన్నా- టాప్ టెన్ స్థానంలో ఉంటుందీ కథ. కాకపోతే- ఆ చిత్రాన్ని ఆరు దశాబ్దాల తర్వాత ‘రీమేక్’ చేయాలన్న ఆలోచన కార్యరూపం దాల్చి.. 2డి, 3డి, రియల్‌డి 3డి, డిజిటల్ 3డి, ఐమాక్స్ 3డి వర్షన్స్‌తో -700 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమైనప్పటికీ.. ఆ ‘్ఫల్’ని ప్రేక్షకుల మనోఫలకంపై కలిగించలేక పోయింది. ఏదో అసంతృప్తి. అంటే -1959 నాటి ‘కథ’ మనఃతెరపై చెక్కుచెదరని శిలాక్షరం కావటంతో.. ఆ దృశ్య కావ్యాన్నీ.. ఈ లేటెస్ట్ వర్షన్‌ని బేరీజు వేసుకొంటూ చూట్టంవల్ల బహుశా ‘బెన్‌హర్’ నిరుత్సాహ పరచి ఉండొచ్చు. అంతమాత్రంచేత ఈ సినిమా తెరకెక్కించటంలోని కృషిని అంత తేలిగ్గా తీసిపారేయటానికీ లేదు.
1959 కథని పక్కనబెట్టి- 2016 కథలోకి వద్దాం. ఈ మార్పులు కథని ఏ మాత్రం తప్పుదోవ పట్టించకున్నప్పటికీ.. కథాపరంగా ‘డెప్త్’ తగ్గిందేమో ననిపిస్తుంది.
కథ-
జూడా బెన్-హర్ (జాక్ హూస్టన్) ఓ తెగ ప్రతినిధి. రోమన్ రాకుమారుడు మెస్సలా (టోబీ కెబెల్). వీరిద్దరూ మంచి స్నేహితులు. తెగలూ జాతులూ వేరైనప్పటికీ -ఒకరంటే ఒకరికి ప్రాణం. సమయం సందర్భం వచ్చిన ప్రతిసారీ మెస్సలా.. తన రోమన్ ఆధిక్యతని ప్రదర్శిస్తూంటాడు. ఎస్తేర్ అనే ఓ బానిస పిల్లని ఇష్టపడతాడు జూడా. మెస్సలాకి జూడా చెల్లెలంటే ప్రేమ. జూడా తల్లికి మెస్సలా వ్యవహారం అంతగా నచ్చదు. దీంతో జూడా కుటుంబం పట్ల కక్ష పెంచుకొన్న మెస్సలా- రోమన్ సైనికులతో వారిని నిర్బంధించి.. జూడా బెన్‌హర్‌ని బానిసగా పంపిస్తాడు. ఆ క్రమంలో జూడా ఎదుర్కొన్న సమస్యలేమిటి? అతని కుటుంబం ఎన్ని ఇబ్బందుల పాలైంది? తమ తెగకి దూరమై.. ఇతర రాజుల ప్రాపకాన్ని ఏ విధంగా సంపాదించుకొన్నదీ? ఇత్యాది అంశాలతో -కథ అనేకానేక మలుపులతో క్లైమాక్స్ చేరుకుంటుంది.
జెరూసలేం నేపథ్యంలో సాగే ఈ కథకి - సమాంతరంగా యేసుక్రీస్తు జీవిత కాలం నడుస్తుంది. ఆయా సందర్భాల్లో బెన్‌హర్ జీవితంలో యేసు చేసిన అద్భుతాల నేపథ్యం ఉంటాయి. 1959లో విలియం వైలర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రంతో ఈ చిత్రాన్ని పోల్చి చూడకుండా ఉంటే- ఈ కథ కూడా తీయటి అనుభూతిని మిగులుస్తుంది.

-బిఎనే్క