రివ్యూ

మళ్లీ.. మురిపించారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** 100 డేస్ ఆఫ్ లవ్

తారాగణం: దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్, శేఖర్ మీనన్,
వినీత్ తదితరులు
సంగీతం: గోవింద్ మీనన్
నిర్మాత: ఎస్.వెంకట రత్నం
దర్శకత్వం: జీసస్ మహమ్మద్
***
కథలో ఏ పాత్రతోనైనా మనకి పరిచయం ఉన్నట్టు అనిపిస్తే- కచ్చితంగా ఆ ‘్ఫల్’ మనల్ని కథ చుట్టూతా వెంటాడేట్టు చేస్తుంది. ప్రేమ కథలకు ప్రేక్షకుడు ఆకర్షితుడవటానికి ఈ సూత్రం పనికొస్తుంది. ఇక- ట్రెండ్‌ని బట్టి కూడా లవ్‌స్టోరీ థియేటర్లలో రాజ్యమేలుతుంది. మలయాళంలో ‘ప్రేమమ్’ ‘బెంగళూరు డేస్’ చిత్రాల అనుభూతి పరిమళం ప్రేక్షకుల మది నుంచీ తొలగక ముందే- ‘100 డేస్.. లవ్’ ఉక్కిరిబిక్కిరి చేసింది. దానికి తగ్గట్టు ‘ఓకే బంగారం’ చిత్రం ద్వారా దుల్కర్ సల్మాన్ -నిత్యా మీనన్‌ల ‘కెమిస్ట్రీ’ వర్కవుట్ కావటంతో - 100 డేస్.. మరింత ఉర్రూత లూగించింది. కానీ- ప్రేక్షకుల ఆలోచనకి తగ్గట్టుగా సినిమాలో ‘వేగం’ లేకపోవటం.. కథ మరీ పెళ్లి నడక నడవటంతో.. ప్రేక్షకుడే వేగంగా వెళ్లిపోతూ మధ్యమధ్య వెనక్కి తిరిగి చూసుకోవాల్సి వచ్చింది.
ఎన్ని ప్రేమకథలు పుట్టుకొస్తాయ్? ఎన్నో ఏళ్లుగా ‘లవ్’ చక్రం క్లాక్‌వైజ్ డైరెక్షన్‌లో తిరుగుతూండటంవల్ల.. ఆయా కథల్లో కొత్తదనం లేకపోవటం ఓ కారణమైనా.. ఆ రొటీన్ కథల్లోని సారాంశానికి.. ఏదో ఒక కొత్తదనాన్ని జోడిస్తే.. ఇక తిరుగుండదు. ఇది అందరికీ తెలిసిన కానె్సప్ట్. ఆ రొటీన్ కానె్సప్ట్ ఏమిటో చూద్దాం.
కథ - రావు గోపాలరావు (దుల్కర్ సల్మాన్)కి తల్లిదండ్రుల ఆలోచనలూ అభిప్రాయాలంటే పడదు. తనకి నచ్చిన రీతిలోనే బతకాలన్నది అతడి ఉద్దేశం. సంపన్న వర్గంలో పుట్టినా.. సామాన్య జీవితాన్ని ఇష్టపడే గోపాల్‌కి కామిక్ కార్టూనిస్టు కావాలన్న ఆశ. ఓ ఇంగ్లీష్ పత్రికలో ఫీచర్స్ రైటర్‌గా పనిచేస్తూ.. తన దుడుకు స్వభావాన్ని తగ్గించుకొనే ప్రయత్నం చేస్తూంటాడు. ఓ రోజు రోడ్డు మీద సావిత్రి (నిత్యా మీనన్)ని చూసి ఆకర్షితుడై మనసు పారేసుకుంటాడు. ఆమె పారేసుకున్న కెమెరాని పుచ్చుకొని ఆమె కోసం వెతుకులాట మొదలుపెడతాడు. చివరాఖరికి ఆ అమ్మాయి దరి చేరేసరికి మరొకరితో ఆమెకు నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో గోపాల్ ఏం చేశాడన్నది క్లైమాక్స్.
కథ మొదలైంది మొదలుకొని.. ఎంతకీ ముందుకి వెళ్లదు. అనే్వషణ దగ్గరే ఆగిపోతుంది. లవ్‌స్టోరీల్లో హీరోయిన్ తళుక్కుమని మెరిసి వెళ్లిపోతే కుదర్దు. ఆ తళుకులు స్క్రీన్ అంతటినీ పరచుకొని.. మంత్రముగ్ధుల్ని చేయాలి. ఫస్ట్ హాఫ్‌లో కనిపించా కదా.. ఇక సెకండ్ హాఫ్‌లో ఎప్పుడో వచ్చి పలకరించి వెళ్తానంటే అస్సలు కుదర్దు. ఈ సినిమాలో ఇదే జరిగింది. ఫస్ట్ హాఫ్‌లో మొహం చాటేసిన ‘సావిత్రి’ సెకండ్ హాఫ్‌కి వచ్చేప్పటికి చాలా కాలాతీతమైంది. అయినప్పటికీ.. ‘నిత్య’ కోసం స్క్రీన్ వెంబడి హీరో పాటు వెతుకుతూనే ఉంటాం. దర్శకుడు ప్రేక్షకుల్ని అక్కడే నిలబెట్టాడు.
దర్శకుడు మణిరత్నం ‘ఓకే బంగారం’ తాలూకు ఫీలింగ్ అక్కడక్కడ కనిపిస్తుంది. కానీ -డెడ్ స్లోగా సాగే కథతో ప్రేక్షకుడు ప్రయాణం చేయటానికి కొద్దిగా ఊపిరి బిగబట్టాల్సి వచ్చింది. హీరో అనే్వషణ.. క్లైమాక్స్‌లో ఎటువైపు మలుపు తిరుగుతుందన్నది తెలిసి పోతూనే ఉంటుంది. ఐతే- జీసస్ మహ్మద్.. సన్నివేశాలన్నీ ప్రేక్షకుడితో కాంటాక్ట్ అయ్యేలా స్క్రీన్‌పై నడిపించాడు.
ఆయా మైనస్ పాయింట్లన్నీ - సల్మాన్ - నిత్య వద్దకి వచ్చేసరికి మటుమాయమై పోయాయి. వాళ్లిద్దర్నే చూస్తూ ‘100%’ ఫీల్‌కి గురవుతాం.
కథని అద్భుతంగా నడిపించటానికి సల్మాన్ - నిత్య - ఆయా పాత్రల్లో జీవించారు అనటం సబబు. కథా గమనం ‘నత్తనడక’న సాగినప్పటికీ.. ఆ ప్రేమానుభూతి వెంటాడుతుంది.
నటనాపరంగా -శేఖర్ మీనన్ చక్కటి హాస్యాన్ని వొలికించాడు. వినీత్ తదితరులు ఆయా పాత్రల పరిధిలో నటించారు.
ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్- ప్రతీష్ వర్మ ఫొటోగ్రఫీ. ప్రతి ఫ్రేమ్‌ని అందంగా తీర్చిదిద్దారు. ఆయా సన్నివేశాలన్నీ - ప్రకృతితో మమేకం చేసినట్టు.. కథ మన చుట్టూ జరుగుతున్నట్టూ అనుభూతి కలిగించటంలో కృతకృత్యుడయ్యాడు. గోవింద్ మీనన్ సంగీతంతో ‘లవ్’ తరంగాలు వెల్లువెత్తాయి. దర్శకుడికిది మొదటి సినిమానే అయినప్పటికీ.. ప్రతి ఒక్కరి నించి ‘100%’ పనితనాన్ని వెలికితీసి.. 100 డేస్ ఆఫ్ లవ్ అంటే ఏమిటో చూపించాడు.

-బిఎనే్క