రివ్యూ

లాలి ప్రేమానంద..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు..జ్యో అచ్యుతానంద
**
ఓ కథని చెప్పే రీతిలో చెప్తే -ఊహాలోకాల్లో విహరించే తత్త్వం కలిగిన ప్రేక్షకుడు కచ్చితంగా ‘కనెక్ట్’అయి, కథలో ‘జో’గి ఆనంద పారవశ్యుడవుతాడు. స్క్రీన్‌ప్లేతో ‘చ్యూ’మంతర్ అనేసి ఒక అద్భుతాన్ని సృష్టిస్తే -ఇంతకుమించి కావల్సిందేముంటుంది? ‘ఊహలు గుసగుసలాడె’ చిత్రంతో రచయితగా తీయటి అనుభూతిని ప్రేక్షకుల ముందు పరచిన శ్రీనివాస్.. వాగ్గేయకారుడు అన్నమాచార్య సంకీర్తన ‘జో అచ్యుతానంద’ పాటని ప్రేమ కథాంశంగా మలచి.. ప్రేక్షకుల్ని జోకొట్టాడు.

కథ
అచ్యుత్ (నారా రోహిత్).. ఆనంద్ (నాగశౌర్య) మధ్యతరగతి అన్నదమ్ములు. ఒకరంటే ఒకరికి ప్రాణం. అన్న మాట తమ్ముడు జవదాటడు. తమ్ముడి మాట అన్న కొట్టిపారేయడు. ఇలా సాఫీగా కాలం వెళ్లిపోతూంటుంది. ఇంతలో -జ్యో అలియాస్ జ్యోత్స్న (రెజీనా) వాళ్లింట్లో అద్దెకు దిగటంతో కథ మొత్తం మారిపోతుంది. అనతి కాలంలోనే ఆ ముగ్గురి మధ్య స్నేహం వేళ్లూనుకొని.. విడదీయరాని బంధంగా మారుతుంది. అయితే- జ్యోత్స్నని అన్నదమ్ములిద్దరూ ఒకరికి తెలీకండా మరొకరు ప్రాణప్రదంగా ప్రేమించేస్తారు. కానీ- తనకి ఆ ఉద్దేశం లేదనీ, వేరే అబ్బాయి ప్రేమలో పీకల్లోతు మునిగిపోయానని తెగేసి చెప్పేసి యుఎస్ వెళ్లిపోతుంది ఆమె. దీంతో -అన్నదమ్ముల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరంటే ఒకరికి ద్వేషం. మాటలు ఉండవు. ఒకే ఇంట్లో ఉంటున్నా.. ఎడమొహం పెడమొహంగా మసలుతూంటారు. ఇదిలా కొనసాగుతూండగా ఒకానొక శుభ ముహూర్తంలో వాళ్లిద్దరికి పెళ్లి జరుగుతుంది. మళ్లీ సాఫీగా కాలం దొర్లుతూండగా.. జ్యో ప్రత్యక్షమై.. ఇద్దరికీ ‘ఐ లవ్ యూ’ చెబుతుంది. దీంతో -ఏం చేయాలో ‘అచ్యుతానందాల’కు తోచదు. ‘జ్యో’మాత్రం చోద్యం చూస్తూంటుంది. వేరే అబ్బాయిని ప్రేమించాననీ.. ఖరాఖండిగా చెప్పేసి యుఎస్ చెక్కేసిన ‘జ్యో’ తిరిగి అచ్యుతానందాల పెళ్లి తర్వాత ‘ఐ లవ్ యూ’ చెప్పటంలోని ఆంతర్యం ఏమిటన్నది క్లైమాక్స్. నిజానికి- ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ మరీ పాత ఆవకాయ. ఒక అమ్మాయి.. ఇద్దరబ్బాయిల కథలు మనకి కొత్తేం కాదు. చివరాఖరికి ఎవరో ఒకరు ‘త్యాగం’ మార్కు ఫేస్‌తో స్క్రీన్‌లోంచి బయటికి వెళ్లిపోవటంతో శుభం కార్డు పడుతుంది. అయితే -శ్రీనివాస్ ఈ కథని తనకి ఎంతవరకు ‘అవసరమో’ అంతే తీసుకొని... ఆ కథకి మరో రెండు కథల్ని ‘జో’డించి చక్కగా మలిచాడు.
ఈ సినిమాకి శ్రీనివాస్ తన రచనా విశ్వరూపాన్ని మరోసారి ప్రదర్శించటానికి -కథని చెప్పే తీరుని ఎంచుకున్నాడు. ప్రధాన పాత్రలు ఎవరి కోణంలో వారివారి ఇష్టారీతిన ఫ్లాష్ బ్యాక్‌ని చెప్పుకుంటూ రావటం.. అసలు కథలో ఏం జరిగిందన్నది మళ్లీ చూపటంతో కొత్త స్క్రీన్‌ప్లేని చూసిన భావన కలగటమే కాదు.. ఆ అనుభూతిలో ‘జో’కొట్టినట్టు ఊహల్లో విహరిస్తాం కూడా. కథని ఎక్కడా చేజారిపోనివ్వలేదు. చేజారిపోతుందన్న ఆలోచన ప్రేక్షకుల్లో కలగటంతోనే -అది సెంటిమెంట్‌గానో... నవ్వుల నదిలోనో మునిగి తేలేట్టు చేశాడు. నిజానికి కథ సెకండాఫ్‌కి వచ్చేప్పటికి.. చేష్టలుడిగి.. నిస్తేజంగా ఆగిపోయిందా అనిపిస్తుంది. కానీ- కథపై పట్టున్న శ్రీనివాస్ అక్కడే మరో లోతుల్లోకి వెళతాడు.
ఇక -కొన్ని సన్నివేశాల్లో నవ్వించేటప్పుడు కూడా కంట తడి పెట్టిస్తాడు. సన్నివేశపరంగా కామెడీని ఎంచుకొన్నాడే తప్ప.. ఎక్కడా కామెడీ ట్రాక్ అంటూ ప్రత్యేకించి వెళ్లలేదు.
‘జ్యో అచ్యుతానంద’ కథ దర్శకుడి ఆలోచనల్లో ఏవిధంగా రూపుదిద్దుకుందో నూటికి నూరు శాతం స్క్రీన్‌పై ఎస్టాబ్లిష్ చేయటంతో ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. అందుకు నటీనటులు కూడా తమవంతు కృషిని పెట్టారు.
ఈ సినిమాలోనూ మైనస్ పాయింట్లు లేకపోలేదు. కథ అక్కడక్కడా సాగతీసినట్టు అనిపిస్తుంది. జ్యో పాత్ర ఎందుకలా వింతవింతగా ప్రవర్తిస్తున్నదో ఒక్కో సందర్భంలో అర్థం కాదు. నిశ్చితార్థంతో కథ అదుపుతప్పి వెళ్లిపోయిందా అనిపిస్తుంది. ఇలా అనేకానేక సన్నివేశాల్లో అవసరాల ‘పట్టు’ కోల్పోతున్నాడా అని అనిపించినప్పుడల్లా... చక్కగా మేనేజ్ చేస్తూ.. ప్రేక్షకుల్లో విసుగు రేకెత్తకుండా.. తను ఏం చెప్పదలచుకున్నాడో చెప్పేసి ‘హమ్మయ్య’ అన్న రిలీఫ్‌ని కలుగజేస్తాడు. నటనాపరంగా -ఏ ఒక్కరినీ ఎన్నిక పెట్టడానికి లేదు. ఆయా పాత్రల్లో జీవించారు. ఆ పాత్రల కోసమే తాము పుట్టినట్టు నటించి మెప్పించారు. కాకపోతే -ఈ కథ క్లాస్ ప్రేక్షకుల మదిని తొలుస్తుంది తప్ప.. ‘మాస్’ జోలికి మాత్రం వెళ్లే ఛాన్స్ లేదనిపిస్తుంది.

-బిఎనే్క