రివ్యూ

వికటించిన విక్రమ్ ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు..ఇంకొక్కడు
**
తారాగణం: విక్రమ్, నయనతార, నిత్యామీనన్, నాజర్, తంబి రామయ్య, బాల తదితరులు.
సంగీతం: హరీస్ జైరాజ్
సినిమాటోగ్రఫీ: ఆర్‌డి రాజశేఖర్
ఎడిటింగ్: భువన్ శ్రీనివాసన్
నిర్మాత: శిబు థమీన్స్
దర్శకత్వం: ఆనంద్ శంకర్
***
ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో తమిళ స్టార్లు ముందుంటారు. కమల్‌హాసన్ తరువాత ఆ స్థాయిలో ప్రయోగాల హీరోగా ఇమేజ్ తెచ్చుకున్నాడు హీరో విక్రమ్. తాజాగా ఆయన ‘ఇరుముగన్’ పేరుతో మరో ప్రయోగాత్మక సినిమా చేసాడు. తెలుగులో ‘ఇంకొక్కడు’గా అనువాదమైంది. ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించాడు. ‘ఐ’ ప్రయోగం వికటించిన తరువాత, సరైన హిట్‌కోసం ఎదురుచూస్తోన్న విక్రమ్‌కు ‘ఇంకొక్కడు’ ఎలాంటి ఫలితాన్ని అందించిందో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే
కథ:
లవ్ (విక్రమ్) అనే ఎవ్వరికీ దొరకని ఒక సైంటిస్ట్ ‘స్పీడ్’ అనే డ్రగ్‌ను కనిపెడతాడు. ఆ డ్రగ్‌ను తన అవసరాలకు చెడుమార్గంలో వాడుకోవాలని ప్రయత్నించే అతను, ఈ క్రమంలోనే మలేషియాలో ఇండియన్ ఎంబసీపై దాడికి పాల్పడతాడు. దీంతో లవ్‌ను పట్టుకునేందుకు ఇండియన్ ఇంటిలిజెన్స్ సంస్థ, అఖిల్ (విక్రమ్) అనే సస్పెన్షన్‌లోవున్న పవర్‌ఫుల్ అధికారిని పిలిపిస్తుంది. అఖిల్‌కి మాత్రమే లవ్‌కి సంబంధించిన చాలా విషయాలు తెలుసని భావించిన ఇంటిలిజెన్స్ సంస్థ, లవ్‌ని పట్టుకునేందుకు అఖిల్‌కి అన్ని అధికారాలు ఇస్తుంది. ఈ మిషన్‌పై ఆయుషి (నిత్యామీనన్)తో కలిసి మలేషియా వెళ్ళిన అఖిల్, అక్కడ లవ్‌ని పట్టుకునేందుకు ఏం చేశాడు? అసలు అఖిల్‌కి, లవ్‌కి ఉన్న సంబంధమేంటి? ఇంతకీ కథలో మీరా (నయనతార) ఎవరు? లాంటి ప్రశ్నలకు సమాధానమే అసలు సినిమా.
సినిమాకి అన్నిరకాల బలాన్నిచ్చింది ఒక్క విక్రమ్ మాత్రమే. ప్రయోగాలకు విక్రమ్ ఎప్పుడూ ముందుంటాడన్న విషయం ఈ సినిమాతో మరోసారి ఋజువైంది. అఖిల్, లవ్ అనే రెండు విభిన్న పాత్రల్లో విక్రమ్ తన నటన స్థాయిని మళ్ళీ కొత్తగా పరిచయం చేశాడు. ముఖ్యంగా లవ్ పాత్రలో విక్రమ్‌ని తప్ప మరొకరిని ఊహించలేమేమో అన్నంతగా ఆ పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నటించాడు. ఈ రెండు పాత్రలను పరిచయం చేసిన విధానం కూడా అదిరిపోయేలా ఉంది. ఇక స్పీడ్ డ్రగ్ ఎలా పనిచేస్తుందో మొదటి సన్నివేశంలోనే చెప్పేయడం బాగా ఆకట్టుకుంది. మీరా పాత్రలో నయనతార ఎంత అందంగా కనిపించిందో, అంతే బాగా నటించింది. సినిమాపరంగా చూసుకుంటే ఫస్ట్ఫాలో అఖిల్, లవ్, స్పీడ్ డ్రగ్.. ఇలా కథకు అవసరమైన పాత్రలను, అంశాలను పరిచయంచేసిన విధానం కట్టిపడేసేలా ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా అదిరింది. అఖిల్, లవ్ పాత్రల మధ్యన సెకండాఫ్‌లో వచ్చే మైండ్‌గేమ్ కొన్నిచోట్ల ఆకట్టుకుంది.
సాంకేతిక అంశాలపరంగా చూస్తే దర్శకుడు ఆనంద్ శంకర్ ఒక కొత్త కానె్సప్ట్‌నే అందరికీ తెలిసిన, కమర్షియల్ సినిమా ఫార్మాట్‌లో చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలోనే ఫస్ట్ఫా విషయంలో బాగానే విజయం సాధించగా, సెకండాఫ్‌లో పక్కదారి పట్టినట్టనిపించింది. స్పీడ్ డ్రగ్ గురించి చెప్పడం, అఖిల్, లవ్‌ల పాత్రలు పరిచయం చేయడం తదితర సన్నివేశాల్లో ఆనంద్ అద్భుతమైన ప్రతిభ చూపాడు. హరీస్ జైరాజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి బలంగా నిలిచింది. అయితే పాటల్లో హెలెనా తప్ప వెంటనే ఆకట్టుకునేలా పాటలేవీ లేవు. ఆర్‌డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. భువన్ శ్రీనివాసన్ ఎడిటింగ్ ఓకే. సెకండాఫ్‌లో ఇంకొన్ని సన్నివేశాల్లో కత్తెరకు మరికొంత పని చెప్పివుంటే, గ్రప్పింగా ఉండేదనపిస్తుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
కొత్తదనమున్న ఓ ప్రయోగాత్మక అంశంతో కమర్షియల్ ఫార్మాట్‌లో కథ చెప్పడమన్నది సులువైన విషయం కాదు. ఒక్కసారి అది బాగా కుదిరిందంటే సినిమా ఏస్థాయి విజయం సాధిస్తుందో చాలా సినిమాలే ఋజువు చేశాయి. తనకు బాగా అలవాటైన ఈ పద్ధతినే నమ్ముకొని విక్రమ్ ఈసారీ ప్రయోగంతోనే వచ్చాడు. అయితే ఈ ప్రయోగం పూర్తిస్థాయి సినిమాగా ఆకట్టుకునేలా లేకపోవడమే పెద్ద మైనస్. విక్రమ్ అనితర సాధ్యమైన నటన, ఫస్ట్ఫాలో డ్రగ్‌ను, హీరో, విలన్ పాత్రలను పరిచయంచేసిన విధానం, ఇంటర్వెల్ ట్విస్ట్, ఇంకొక్కడులో కట్టిపడేసే అంశాలు చాలానే ఉన్నాయి. ఒరిజినల్ ప్లాట్ ముందే పూర్తిగా అర్థమయ్యేలా చెప్పేయటం కొన్ని సినిమాలకు కలిసొచ్చినా, ఇంకొక్కడికి మాత్రం మైనస్సే అయ్యింది. సైన్స్ ఫిక్షన్ అంశాన్ని పక్కనబెడితే, ఇలాంటి కథతోనే చాలా సినిమాలు వచ్చాయి. ఇక సెకండాఫ్‌లో హీరో, విలన్ ఒకసారి ఎదురుపడ్డాక సినిమా అంతా ఒకే ఒక్క అంశం చుట్టూ సాగేది కావడం బోర్ కొట్టించింది. విక్రమ్, నయనతారల మధ్యన వచ్చే లవ్‌ట్రాక్ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు. నిత్యామీనన్ పాత్ర చాలా చిన్నది కావడంతోపాటు ఆమెకు పెద్దగా నటించే ఆస్కారం లేకపోయింది. సైన్స్‌ఫిక్షన్ విషయంలో లాజిక్ పక్కనబెడితే, మిగతా చాలా విషయాల్లోనూ కథ లాజిక్‌కు అందకుండా ఎటో పరుగులు తీసినట్టు అనిపించింది. కథలో ప్రయోగం లేకుండా, రూపురేఖల్లో మాత్రమే ప్రయోగాలు చూపిస్తూ విక్రమ్ ఇలా ఎన్నిసార్లు వచ్చినా.. అవన్నీ ఒక్కొక్కటి, ఇంకొక్కటిగానే ఉండిపోతాయి తప్ప, హిట్ రేంజ్‌కు వచ్చేలా లేవు.

-త్రివేది