రివ్యూ

పెద్ద తెరపై బుల్లి సీరియల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* సిద్ధార్థ
--
తారాగణం: సాగర్, రాగిణి నంద్వాని, సాక్షి చౌదరి, కోట, సుబ్బరాజు, సత్యంరాజేష్, తాగుబోతు రమేష్, రణధీర్, బెనర్జీ, అజయ్, సన తదితరులు
సంగీతం: మణిశర్మ
నిర్మాత: దాసరి కిరణ్‌కుమార్
దర్శకత్వం: కెవి దయానంద్ రెడ్డి
---
టెలివిజన్ రంగంలో ఒక సీరియల్ ఏడేళ్లకు పైగా జనాదరణ పొందిందంటే -మామూలు విషయం కాదు. ఇక ఆ సీరియల్‌లో నటించి ఎక్కడలేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు సాగర్. సీరియల్‌లో ఆర్‌కె నాయుడిగా గుర్తింపు తెచ్చుకున్న సాగర్ -వెండితెరకు పరిచయమవుతూ రూపొందిన చిత్రం సిద్ధార్థ. కెవి దయానంద్ దర్శకత్వంలో సాగర్ సిద్ధార్థగా ఆకట్టుకున్నాడో లేదో చూద్దాం.
కథ: రాయలసీమలో ఫ్యాక్షన్ నేపథ్య కుటుంబంలో పుట్టిన సూర్య (సాగర్) కొన్ని కారణాలవల్ల మలేసియా వెళ్తాడు. ఆ జర్నీలో సహస్ర (రాగిణి నంద్వాని) పరిచయమవుతుంది. సహస్రకు తన గతం చెప్పకుండా -సిద్ధార్థగా పరిచయం చేసుకుంటాడు. పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. సూర్య తన చేదు గతాన్ని ముగించి సహస్రతో కొత్తగా ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటాడు. ఆ ఉద్దేశ్యంతో తన సమస్యలు పరిష్కరించుకోవడానికి సొంతూరికి వెళ్తాడు. కానీ అక్కడ సూర్య ఊహించని విధంగా తన ప్రేమను త్యాగం చేయాల్సి వస్తుంది. సహస్ర కూడా సూర్య ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని దూరమవుతుంది. సూర్య తన ప్రేమను ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చింది? అసలు అతని చేదు గతమేమిటి? చివరికి సూర్య, సహస్రల ప్రేమ ఏమైంది? అన్నది మిగతా సినిమా.
సీరియల్ నటుడిగా ప్రేక్షకులకు దగ్గరైన సాగర్, సినిమాలోనూ సూర్య పాత్రతో ఓకే అనిపించుకున్నాడు. చేదుగతం వెంటాడే మనిషి ఎలాంటి బాధ అనుభవిస్తాడు అన్నది తన నటనలో వైవిధ్యంగా చూపాడు. కథ పాతదే అయినప్పటికీ దర్శకుడు దాన్ని కొత్తగా చూపే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. మొదటి భాగంలో హీరో సాగర్, హీరోయిన్ రాగిణి నంద్వానిల మధ్య రొమాన్స్ ఆకట్టుకుంటుంది. మొదటి భాగాన్ని ఎమోషనల్‌గా ఉండే హీరో పాత్రతో, లవ్‌స్టోరీని సమానంగా నడుపుతూ సెకెండాఫ్‌లో ఏంజరుగుతుందో అన్న ఆసక్తిని క్రియేట్ చేయడంలో దర్శకుడు ఓకె అనిపించుకున్నాడు. హీరోయిన్ పాత్రలో రాగిణి నంద్వాని తనవంతు ప్రయత్నం చేసింది. సెకెండాఫ్‌లో వచ్చే కామెడీ సన్నివేశాలు అక్కడక్కడా నవ్వించాయి.
దర్శకుడు దయానంద్ ఎమోషన్, రొమాన్స్‌తో ఫస్ట్‌హాఫ్‌ను ఆసక్తిగా నడిపించినా, సెకెండాఫ్‌లో మాత్రం బోరింగ్ స్క్రీన్‌ప్లే సీరియల్‌ను తలపించింది. రొటీన్ క్లైమాక్స్ మరింత నిరుత్సాహానికి గురిచేసింది. హీరోగా సెల్యూలాయిడ్‌పై వెలగాలని ఆశించిన సాగర్‌కు
ఇక మణిశర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటల సంగీతం మెప్పించాయి. ఎస్.గోపాల్‌రెడ్డి సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
స్క్రీన్‌ప్లే, హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీతో ఫస్ట్ఫాలో ఆసక్తి పెంచినా, క్లైమాక్స్ వరకూ ఆ టెంపోని దర్శకుడు దయనంద్ కొనసాగించలేకపోయాడు. ఫ్యాక్షన్ నేపథ్యంలో చిత్రాన్ని నిర్మించినా -హీరో పాత్రలో మిస్సయిన దూకుడు, రొటీన్ క్లైమాక్స్ సిద్ధార్థను హైట్స్‌కు తీసుకెళ్లలేకపోయింది. సెకెండాఫ్‌లో సీరియల్ మాదిరిగా వెళ్లిపోతున్న ఎపిసోడ్స్‌తో ఆడియన్స్ పూర్తిగా నిరుత్సాహపడ్డారు. ఫస్ట్ఫాలో హైప్ ఇచ్చి, సెకెండాఫ్‌లో హీరో పాత్రను తేల్చేయడమే పెద్ద మైనస్. కమర్షియల్, యాక్షన్ ఎంటర్‌టైనర్ అని ప్రొమోస్‌లో పెద్దగా ప్రచారం చేశారుగానీ, -సినిమాలో ఒక్క సన్నివేశం కూడా అలాంటిది కనిపించదు. మొత్తానికి సిద్ధార్థ -సీరియల్‌ను దాటాడుగానీ, సినిమా స్థాయికి చేరలేకపోయాడు.

-త్రివేది