రివ్యూ

కూత పెట్టని రైల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు *రైల్
**
తారాగణం: ధనుష్, కీర్తి సురేష్, హరీష్ ఉత్తమన్, రాధా రవి, గణేష్ వెంకట్రామన్, తంబి రామయ్య సంగీతం: డి.ఇమ్మాన్
ఎడిటింగ్: ఎల్‌వికె దాస్
కెమెరా: వెట్రివేల్ మహేంద్రన్
నిర్మాత: టిజి త్యాగరాజన్
కథ, కథనం, దర్శకత్వం:
ప్రభు సాలమన్
**
రైలు ఎంత పెద్దదైనా -ముందుకెళ్లాలంటే డ్రైవర్ కీలకం. సినిమాకు హీరో ధనుష్ అయినా -హిట్టుకొట్టాలంటే దర్శకుడు ముఖ్యం. ‘రైలు’ సినిమాలో డ్రైవర్ మరణించాడు. ధనుష్ కథలో ‘డైరెక్టర్’ వీకయ్యాడు. వెరసి -సినిమా పూర్తిగా పట్టాలు తప్పేసింది.
ప్రయాణికులను గమ్యానికి చేర్చేందుకు శరవేగంగా పోతున్న రైల్లో డ్రైవర్ అకస్మాత్తుగా చనిపోతాడు. కంట్రోల్ తప్పిన రైలుకు బ్రేకులూ ఫెయిలవుతాయ. కనీసం వేగాన్ని నియంత్రించే మార్గం కూడా కనిపించదు. ఈ సెటప్ చాలు... ఆడియన్స్‌కి చెమటలు పట్టించడానికి. ఏమవుతుందోనన్న టెన్షన్ బిల్డప్ చేసి థ్రిల్లర్ చూపించేయొచ్చు. కానీ -దర్శకుడు ఫార్మాట్‌లో పోకుండా ఇక్కడే ఓ ప్రయోగం చేశాడు. ఇటీవల ఎక్కువైన హారర్ కామెడీల ప్రభావంతో ‘థ్రిల్లర్ కామెడీ’ని సృష్టించాలనుకున్నాడు. అందుకే -చావు దగ్గరకు తీసుకెళ్లేందుకు ‘రైలు’ శరవేగంతో పోతుంటే ప్రయాణికులతో పేరడీలు, కామెడీలు చేయంచాడు. మధ్యలో ప్రేమ కథను చెప్పాలనుకున్నాడు. ఏదో అనుకుని.. ఏదో చేసేసినట్టు సినిమా కంగాళీ అయిపోవడంతో -‘రైల్’ ఢమాల్‌మంది. పరిగెడుతున్న రైల్లో ప్రమాదం సంభవిస్తే పరిణామాలు ఎంత భయానకంగా ఉంటాయోనన్న కానె్సప్ట్‌తో హాలీవుడ్‌లో ‘అన్‌స్టాపబుల్’ వచ్చింది. దాని ఆధారంగానే దర్శకుడు ప్రభు సాలమన్ ‘రైల్’ను పట్టాలెక్కించాడు. కాకపోతే అన్‌స్టాపబుల్ మాదిరిగా టెన్షన్ పెట్టడం వదిలేసి -ట్రెయిన్‌లో ‘టైటానిక్’ చూపించాలనుకున్నాడు. అదీ జరిగిన పొరబాటు.
థ్రిల్లర్‌ని థ్రిల్లర్‌లా తీసివుంటే ఫలితం ఎలా ఉండేదో. కాని అసలు విషయాన్ని పట్టాలపై వదిలేసి -తీరిగ్గా కామెడీ సీన్లు వండుకున్నాడు. పైగా పొలిటీషియన్లు, పబ్లిక్, లేటెస్ట్ ట్రెండ్ మీద సెటైర్లు వార్చుకున్నాడు. ఆగకుండా రైలు పరుగెడుతుంటే ‘బాబోయ్’ అన్న భయం అందులో కూర్చున్నవాళ్లకే కలగలేదంటే -ఇక సినిమా చూస్తున్నవాళ్లకు ఎందుకు కలుగుతుంది. అదే జరిగిందిక్కడ. క్యారెక్టర్లలోనూ, ఆడియన్స్‌లోనూ ‘టెన్షన్’ మిస్సయ్యింది. డైరెక్టర్ సాల్మన్ స్క్రీన్‌ప్లే మిస్‌ఫైరైంది. చావు భయం లేకుండా పాత్రలన్నీ చచ్చు కామెడీ ఎందుకు చేస్తున్నారో -్థయేటర్లో కూర్చున్న వాళ్లకు ఓ పట్టాన అర్థంకాదు. దానికి తగ్గట్టు తంబి రామయ్య కామెడీ పిచ్చెక్కిస్తుంది. ఎన్‌ఎస్‌జి కమాండోగా అర్థంపర్థం లేని సైకో క్యారెక్టర్‌లో హరీష్ ఉత్తమన్ కనిపిస్తాడు. రైల్లో కనిపించే తడవుగా కీర్తితో హీరో ధనుష్ ప్రేమలో పడిపోవడం, కథలు చెప్పేసుకోవడం చూస్తుంటే.. ఇదేం లవ్ స్టోరీరా బాబూ అనుకుంటూ చూస్తున్నవాళ్లు టెన్షన్ పడాలి.
వేగంగా వెళ్తోన్న ట్రెయిన్ చూపిస్తూనైనా -ఆడియన్స్‌లో టెన్షన్ క్రియేట్ చేయలేకపోయారు. కారణం -సిజె ఎఫెక్ట్ స్పష్టంగా తెలిసిపోవడమే. సీన్లన్నీ గ్రీన్ మ్యాట్‌లో కొట్టేశారన్న విషయం అర్థమైపోవడంతో -టెన్షన్ పెట్టాల్సిన సన్నివేశాలు ఫక్తు కామెడీలా తోస్తాయి. కనీసం -చొప్పించిన ప్రేమ కథలోనూ పస లేకపోవడంతో సన్నివేశాలు నడిచేకొద్దీ ఆడియన్స్‌కి నీరసం వచ్చేసింది. ఇద్దరు ప్రేమికులు చచ్చిపోతారేమో అనే క్వశ్చన్ మార్క్ ఉన్నా -పాత్రల ప్రవర్తనతో ముందు ఆడియన్స్‌కే అలాంటి ఫీలింగ్ కలగలేదు. కథానయిక, నాయకుడి పాత్రల్ని తీర్చిదిద్దడంలోనే దర్శకుడు సాల్మన్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. రైలు ఎంత వేగంగా వెళ్లిపోతుందో, పాత్రలు దాన్ని మించి ఓవరాక్షన్ చేసేస్తుంటే -్భరించటం కష్టమైంది. ధనుష్ మార్కు చూసుకుని గుడ్డిగా ‘రైల్’ ఎక్కితే యాక్సిడెంట్ ఖాయం. ఈ సినిమాను ధనుష్ ఎలా ఓకే చేశాడనేది వేరే విషయం.
తమిళ సినిమాల్లో సాంకేతిక విలువలు ఉన్నతంగా ఉంటాయి. ఇటీవల వచ్చిన అనేక సినిమాలు ఆ విషయాన్ని నిరూపించాయి కూడా. కానీ ‘రైల్’ సినిమా చూశాక, ఆ విషయంలో కొత్త అనుమానాలు పుట్టుకొస్తాయి. సినిమాలో సాంకేతికపరంగా చెప్పుకోదగ్గ పాయింట్ ఒక్కటీ కనిపించదు. సినిమాటోగ్రఫీ సాధారణం. విజువల్ ఎఫెక్ట్స్ వీక్. నేపథ్య సంగీతం డల్. ఇంతకంటే తక్కువగా ‘రైల్’ జర్నీని చెప్పుకుంటే మనసుకు ఒకింత హాయ.

-ప్రవవి