రివ్యూ

లెక్క తప్పిన లక్కు ! ( * బాగోలేదు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* లచ్చిందేవికి ఓ లెక్కుంది

తారాగణం:
నవీన్‌చంద్ర, లావణ్య త్రిపాఠీ, జయప్రకాష్‌రెడ్డి, బ్రహ్మాజీ, అజయ్, భానుశ్రీ, నర్రా శీను, సంపూర్ణేష్ బాబు, భద్రం, సూపీ సరుూద్, మేల్కొటే.
సంగీతం: ఎంఎం కీరవాణి
నిర్మాత:
సాయిప్రసాద్ కామినేని
దర్శకత్వం:
జగదీష్ తలశిల

కథను నమ్మడం మానేసి కానె్సప్ట్‌ను అమ్ముకుని బతికేస్తోంది తెలుగు సినిమా. ఇటీవల వచ్చిన సినిమాల్లో చాలావరకూ కానె్సప్ట్ బేస్‌డే. కొత్త కానె్సప్ట్ వెతుక్కుని.. దానిచుట్టూ పిల్లి కథో, పిట్ట కథో అల్లుకుని.. ఓ 50 సీన్లు కుదురుగా కూర్చోబెడితే -సినిమా రెడీ. కమర్షియల్ ఫార్మాట్ మార్జిన్ దాటకుండా.. కూర్చిన సన్నివేశాల్లో మినిమం వినోదం మిస్సవకుండా.. సరంజామాను సరిగ్గా సర్దితే.. సినిమా -బతికేసినట్టు, ఎడిసోడ్లుగా రాసుకున్న సీన్లలో ఏమైనా తేడా పలికితే -తనే్నసినట్టు. ఆడియన్స్ సైతం కానె్సప్ట్ బేస్డ్ సినిమాలకు కనెక్టవుతుండటంతో -కొత్తవాళ్లు సైతం దడలేకుండా దర్శకత్వ బాధ్యతలు భుజానికి ఎత్తుకుంటున్నారు.
బ్యాంకుల్లో పేరుకుపోయిన అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లను ఎలా కొట్టేయవచ్చన్న సింగిల్ పాయింట్ కానె్సప్ట్ చుట్టూ అల్లుకున్న కథే -లచ్చిందేవికి ఓ లెక్కుంది. ఆసక్తికరమైన టైటిల్‌తోపాటు, అనుభవజ్ఞుడైన రాజవౌళి స్కూల్ నుంచి వచ్చిన జగదీష్ తలశిల దర్శకుడు కనుక -ఎల్‌వోఎల్‌పై ఆసక్తి పెరిగింది. పండక్కి విడుదలైన పెద్ద సినిమాల గాలి తగ్గిన టైంలో సినిమా విడుదలకు మంచి స్లాట్ దొరికింది. ఈ ప్లస్‌లతో వచ్చిన లచ్చిందేవి -ఎలాంటి లక్కు, లెక్కలు చూపిందో చూద్దాం.
కథ
జనతా బ్యాంకులో నవీన్ (నవీన్ చంద్ర), దేవి (లావణ్య త్రిపాఠి) ఉద్యోగులు. వీళ్లిద్దరిదీ -బ్యాంకులో ఎదురెదురు సీట్లే కాదు, అపార్ట్‌మెంట్‌లో పక్కపక్క ఫ్లాట్లు కూడా. కానీ ఒకరంటే ఒకరికి పడదు. ఇదిలావుంటే, బ్యాంకుల్లో పేరుకుపోతున్న అన్ క్లెయిమ్డ్ ఖాతాలను సెటిల్ చేయమంటూ ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో, అజయ్ (అజయ్), అతని గాళ్‌ఫ్రెండ్ (్భనుశ్రీ) కోట్లు కొల్లగొట్టే ప్లాన్‌కు శ్రీకారం చుడతారు. డబ్బు పిచ్చివున్న నవీన్ ఖాతాకు లక్ష రూపాయలు ఎరవేసి -తెలివిగా అతన్ని ట్రాప్ చేస్తారు. అన్ క్లెయిమ్డ్ ఖాతాల వివరాలందిస్తే -మరింత కమిషన్ ఇస్తామంటూ డీల్ మాట్లాడుకుంటారు. డీల్‌కు ఓకే అన్న నవీన్ -దేవికి దగ్గరై ఆమె అజమాయిషీలో ఉండే ఖాతాల వివరాలు తెలివిగా సంగ్రహిస్తాడు. ఈ వ్యవహారాన్ని ముందుగానే అనుమానించిన బ్యాంకు మేనేజర్ సోమయాజులు (జయప్రకాష్‌రెడ్డి) -రివర్స్ ప్లాన్‌తో కథ మొత్తాన్ని మలుపుతిప్పుతాడు. అన్‌క్లెయిమ్డ్‌గా పడివున్న ఆంకాళమ్మ, ఉమాదేవిల ఖాతాల్లోని ‘లచ్చిందేవి’ని కొల్లగొట్టేందుకు ఎవరెవరు ఎలాంటి ప్రణాళికలేశారు? ఎవరి ఎరకు ఎవరు చేపలయ్యారు? లాకర్ల నుంచి బయటికొచ్చిన లచ్చిందేవి, తిరిగి లాకర్లకే చేరిందా? బ్యాంకు గుమ్మం దాటేసిందా? లాంటి ఫన్నీ ప్రశ్నలకు కామెడీ టచ్ ఆన్సర్లే -మిగతా కథ.
ఎలా ఉంది?
రాజవౌళి స్కూల్‌నుంచి వచ్చిన దర్శకుడు కనుక ఎంతోకొంత సరుకు ఉంటుందన్న ఆసక్తితో సినిమాకు వెళ్లినవాళ్లకు నిరాశే మిగిలింది. సింగిల్ పాయింట్ కానె్సప్టే అయినా, కథను వండుకుని, సన్నివేశాలను అల్లుకునే ప్రయత్నంలో గాఢత లోపించింది. కథకు ముఖ్యమనపించే పాత్రలు పట్టుమని పదికూడా లేకున్నా, వాటి స్వభావాలను పరిచయం చేయడానికే ఫస్టాప్‌ను వాడేశారు. మిగిలిన అర్థ్భాగంలో చెప్పాల్సిన కథకూ కితకితలు, పాయింట్ బ్లాంక్ టర్నింగులు ఎక్కువైపోవడంతో -చెప్పాల్సిన విషయంపై దర్శకుడికే గ్రిప్పు తప్పేసింది. ఏ పాత్రతోనూ ఆడియన్ ట్రావెల్ చేయలేని పరిస్థితి రావడంతో -స్క్రీన్ మీద సినిమా వెళ్లిపోతుంటే, ప్రేక్షకుడు దిక్కులు చూస్తూ కూర్చోవాల్సి వచ్చింది.
బ్యాంకు నుంచి కోట్ల రూపాయలు కొల్లకొట్టే సన్నివేశంలో ఏమాత్రం టెన్షన్ క్రియేట్ చేయలేకపోయారు. సన్నితమైన భావోద్వేగాలు పలికించే అవకాశమున్న సన్నివేశాలను గాలికొదిలేశారు. దర్శకుడి వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు -సినిమాటోగ్రఫీ, సంగీతం, ఎడిటింగ్, ఆర్ట్, సంభాషణల విభాగాలేవీ సహకరించలేకపోయాయి. పైగా ఏ పాత్రనూ ప్రేక్షకుడు ఓన్ చేసుకోలేక సినిమా ఒకవైపు, ప్రేక్షుకుడి మరోవైపు అన్నట్టయ్యింది. లావణ్య త్రిపాఠీ గురించి నాలుగు చెప్పుకునేలా ఉన్నా -ఆమె కెరీర్‌కు సినిమా, సినిమా కెరీర్‌కు ఆమె ఏమాత్రం ప్లస్ కాలేదు. మొత్తంగా సినిమాకు కావాల్సిన సరుకంతా ఉంది.. ఒక్క లచ్చిందేవి తప్ప.

- మహాదేవ