రివ్యూ

నాని కోసం.. నాని చేత..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు **మజ్ను
***
తారాగణం: నాని, అను ఇమ్మాన్యుయేల్, ప్రియశ్రీ, వెనె్నల కిషోర్, సప్తగిరి, సత్య, రాజ్‌తరుణ్ (అతిథి పాత్రలో) సత్యకృష్ణ, పోసాని కృష్ణమురళి,
శివన్నారాయణ తదితరులు.
సంగీతం: గోపీ సుందర్
నిర్మాత: పి కిరణ్
రచన, దర్శకత్వం: విరించి వర్మ
**
ఒకబ్బాయి -అమ్మాయి ప్రేమకోసం బెంగళూరులో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి ఉన్న ఊరిలో ఉండిపోతాడు. అది పెళ్ళి దగ్గరకు వచ్చేలోగా చిన్న కారణం ద్వారా బ్రేకప్ చెప్పేస్తాడు. అలా చెప్పేసి వచ్చి హైదరాబాద్‌లో ఇంకో అమ్మాయికి కనెక్టవుతాడు. అది కన్ఫర్మ్ అయ్యే దశలో తన పాత లవ్‌స్టోరీ చెపుతాడు. ఆ చెప్పే క్రమంలో తాను అలా మొదటి అమ్మాయిని కాదనుకోడం అవివేకం అన్న ఆలోచనొచ్చి ఉన్నపళంగా అమ్మాయికోసం సొంత వూరు వెళ్దామని నిశ్చయించుకుంటాడు. తర్వాత అతను ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్నది మిగిలిన కథ. స్థూలంగా ఇదీ ‘మజ్ను’. వైవిధ్యమైన చిత్రం (ఉయ్యాలా జంపాలా)తో మెగాఫోను పట్టిన వైవిద్య దర్శకుడు విరించి వర్మ (ఈ చిత్ర దర్శకుడు, రచనా బాధ్యుడు కూడా) ‘మజ్ను’ ద్వారా ఏ కొత్త పాయింట్ చెబుదామనుకున్నాడో అర్థంకాదు. అయితే చిత్ర నాయకుడు నాని పాత కథకే కొత్త లుక్ ఇచ్చి నడిపించేయడం ద్వారా ఫరవాలేదన్న స్థాయికి ‘మజ్ను’ని చేర్చాడు. వివరాల్లోకి వెళ్తే ఇంజనీరింగ్ చదివిన ఆదిత్య (నాని) బెంగుళూరులో వచ్చిన ఉద్యోగాన్ని వదిలేసి భీమవరంలో ఉండిపోయే లెవెల్‌లో కిరణ్మయి (అను ఇమ్మాన్యుల్)తో ప్రేమలో పడతాడు. అయితే తన స్నేహితుడు కాశి (సత్య) విషయంలో వచ్చిన బేధాభిప్రాయంలో కిరణ్‌కు బ్రేకప్ చెప్పేసి హైదరాబాద్ వెళ్లిపోతాడు ఆదిత్య. అక్కడ బాహుబలి-2 చిత్రానికి రాజవౌళివద్ద అసిస్టెంట్ డైరెక్టర్ అవుతాడు. ఇక్కడే సుమ (ప్రియాశ్రీ)తో పరిచయమై అది పెళ్లివరకూ చేరే క్రమంలో తన పాత లవ్ ఎపిసోడ్ చెప్తాడు. ఆ క్రమంలో తాను ఇంతకుముందు కిరణ్మయికి బ్రేకప్ చెప్పడం అవివేకమని అనిపించి తిరిగి భీమవరానికి వెళ్లిపోదామనుకుంటాడు. మరి తర్వాత ఏమైంది అన్నది ‘మజ్ను’ మిగతా చిత్రం. ఈ మాదిరి ముక్కోణపు ప్రేమకథలు తెలుగు తెర అనేకం ఇచ్చేసింది ప్రేక్షకులకి. కాకపోతే ఇందులో కథ నడిచిన తీరులోనే అనేక కొట్టొచ్చే లోపాలు కనిపించాయి. అసలు ఆదిత్య- కిరణ్మయికి బ్రేకప్ చెప్పిన కారణమే చాలా పేలవంగా ఉంది. అది అలాంటి కారణమని ఆదిత్యకు రెండో ప్రేమ పరిపక్వ దశకు వచ్చినపుడు అనిపించింది కానీ, వాస్తవానికి ఆ కారణం చూసినపుడే ఆడియన్స్ అనుకున్నారు. అలాగే ఆదిత్య తన పాత లవ్ స్టోరీ చెప్పి నిజాయితీ నిరూపించుకున్నాడు అనుకుంటూంటే, తన పాత లవ్ స్టోరీని సుమతో చెప్పించడం వగైరా సంఘటనకు ప్రతిగా చెప్పినట్టు ఉంది తప్ప సహజంగా లేదు. అసలు సుమలాంటి తెలివైన యువతి వ్యక్తి ఆనుపానులు తెలుసుకోకుండా తొలి వ్యక్తితో ప్రేమలో పడుతుంది అనుకోవడం పైన చెప్పిన అసహజానికి బలంచేకూర్చింది. అదేవిధంగా పోనీ ఆదిత్య ఏదో ఆవేశంలో అన్నాడని అనుకున్నా, అప్పటికే తనకి కాశి ద్వారా జరిగిన విషయం తెలిసింది కనుక విఫలమైన తన ప్రేమను సఫలం చేసుకోలేని అసమర్థురాలా కిరణ్మయి? అన్నదీ మనకనిపిస్తుంది. ఇవన్నీ విరించి వర్మ కథను తాను అనుకున్నట్టుగా నడిపించుకోడానికి విస్మరించిన విషయాలుగా మనం అనుకోవాలి? 2016లో కూడా ప్రేమ వ్యక్తీకరణకు ‘ప్రేమలేఖలు’ విధానాన్ని అనుసరిస్తోంది అని చెప్పబోవడం ఇందులో చేసిన సిద్ధ సాహసం. అయితే ప్రేమలేఖలో వాడిన పదాలు (అంతులేని సంపద నేనివ్వలేకపోయినా నేను నిన్ను నిరంతరం సంతోషంగా ఉంచగలను.. లాంటివి) బావున్నాయి. (ఈ లేఖ రచయిత అనంత శ్రీరామ్ అభినందనీయులు) ఆదిత్య తొలిమలి లవర్స్ ఇద్దరూ కజిన్స్‌గా చేసి కావల్సినంత కాన్ఫ్లిక్ట్ పండించడానికి దర్శకుడు ప్రయత్నించారు. కానీ ఈమాదిరి ట్విస్ట్స్ అనేక కమర్షియల్ ప్రేమకథల్లో చూసేశారు కనుక ప్రేక్షకులేం కొత్తదనం ఫీలవలేదు. పాత్రధారుల నటనా విషయాలను పరిశీలిస్తే తొలుతే చెప్పినట్టు ఇది ఫక్తు నాని అన్నీ తానై భుజాలపై చిత్రభారం మోశారని చెప్పొచ్చు. అందుకు తనకున్న కామెడీ టైమింగ్, సహజ నటన బాగా పనికొచ్చింది. ముఖ్యంగా కిరణ్మయితో ఆటోలోవెళ్లిన సన్నివేశాల్లోనూ, ఆఖర్లో రైల్లో ఇళయరాజా విషాద గీతాలకు అనువైన అభినయాన్ని చూసినపుడు, తాను రైల్వేస్టేషన్‌లో కొన్న ‘పగిలిన మనసు అతికించడానికి పధ్నాలుగు మార్గాలు’ పుస్తకంలో రాసిన దానికి అనుగుణంగా భావాలు పలికించడంలోనూ ప్రశంసనీయ నటన ప్రదర్శించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘మజ్ను’ నానికోసం, నానిచేత, నానే ఆవిష్కరించుకున్న చిత్రంగా అనిపింది. కిరణ్మయిగా అను ఇమ్మాన్యుయల్ క్యూట్‌గా ఉండి పాత్రోచిత నటన ప్రదర్శించింది. ప్రియశ్రీ పాత్రకు అవసరమైన హుషారునీ అందించింది. సప్తగిరి, వెనె్నలకిషోర్, పోసాని అక్కడక్కడ తమదైన శైలి నటనని చిలకరించేశారు. నవరసాలు చూపించడం క్రమంలో వెనె్నల కిషోర్‌కు నానికి మధ్య చూపిన స్విమ్మింగ్ పూల్ సన్నివేశాలు వగైరా అంతగా అవసరం లేదనిపించింది. అసలిలాంటి అప్రస్తుత సన్నివేశాల నిడివిని తగ్గించి చిత్రాన్ని రెండుగంటల వ్యవధికి (ప్రస్తుతం చిత్రం రెండు గంటల పద్ధెనిమిది నిమిషాలు) కుదించివుంటే బాగుండేది. గోపీసుందర్ స్వరాల్లో ‘కళ్లుమూసి తెరిచేలోగా గుండెల్లోకి చేరేవే’ పాట బావుంది. ‘ఆడరా నీ ఇష్టం ఆడరా...’లో ‘మనలా అంబానీ ఆడలేడురా...’లాంటి పదాలు బావున్నాయి. ‘అందమైన చందమామా’ పాటలో జ్ఞనశేఖర్ కెమేరా పనితనం ఎన్నదగినదిగా ఉంది. దర్శకుడు ఎస్‌ఎస్ రాజవౌళి తన నిజ జీవిత పాత్రలోనే ఇందులో మొదట్లో, ఆఖర్లో తళుక్కున మెరిసారు. ‘బాహుబలి-2’ నిర్మాణం విషయంలో పట్టే వ్యవధి గురించి తనమీద తానే జోకువేసుకోడం అలరించింది. రాజ్‌తరుణ్ కూడా చివర్లో ఓ కీలకపాత్రలో దర్శనమిచ్చాడు. కథ విషయంలో వైవిధ్యానికి పెద్దపీటేసి ఉంటే ‘మజ్ను’ ఇంకా అధిక సంఖ్యలో ‘లైలా’లను ఆకర్షించి ఉండేవాడు.

-సంకల్ప