రివ్యూ

భావోద్వేగాల బ్యాటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** ఎంఎస్ ధోని
-ది అన్‌టోల్డ్ స్టోరీ-
**
తారాగణం:
సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్, దిశా పటాని, అనుపమ్‌ఖేర్, రాజేశ్ శర్మ
సంగీతం:
అమాల్ మాలిక్, రోచక్ కోహ్లి
నిర్మాతలు:
అరుణ్ పాండే, ఫాక్స్ స్టార్ స్టూడియోస్
దర్శకత్వం:
నీరజ్ పాండే
**
2011 -క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్. శ్రీలంకతో యుద్ధం. అప్పటికి మూడు వికెట్లు కోల్పోయి 114 పరుగుల వద్ద- గ్రౌండ్‌లో అతి కష్టం మీద పోరాడుతూన్న భారత్ క్రికెట్ జట్టుపై ఆశనొదిలేసుకొని నిస్తేజంగా నిర్వీర్యంగా తిలకిస్తూన్న ప్రేక్షక జనావళిలో పెను‘ద్రోణి’లా చెలరేగి ఆనక విజృంభించి ఫీల్డ్‌లో వీర విహారం చేసి.. జాతి పరువుని ‘బ్యాట్’తో నిలబెట్టిన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని. టీ-20, వనే్డ క్రికెట్, టెస్ట్ సిరీస్‌లతో క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాల్నీ.. సువర్ణాక్షరాల్ని లిఖించిన ధోని.. క్రికెట్ గ్రౌండ్‌లో తెలిసిన సంగతులు కొన్నైతే.. తెలీని ఎనె్నన్నో విశేషాలనూ.. అతగాడి రికార్డుల మైలురాళ్లనూ.. తెర వెనుక అతడు ఎదుర్కొన్న సవాళ్లనూ -తెర కెక్కించే ప్రయత్నం చేశారు. స్పోర్ట్స్ బయోపిక్స్ బాలీవుడ్‌కి కొత్తేం కాదు. కానీ- యధార్థ సంఘటనలతో సినిమా చేయాలంటే- కొద్దిగా కష్టం. ఏ మాత్రం పక్క కోణంలోకి వెళ్లినా డాక్యుమెంటరీలా మారే ప్రమాదం కూడా ఉంది. కానీ- ఈ సినిమా చూస్తూంటే మనసు ‘తెర’పై ధోని జీవితంలోకి తొంగి చూసినట్టూ.. అతడితోపాటు ప్రేక్షకుడూ ప్రయాణించినట్టు అనిపించటం వెనుక దర్శకుడి ప్రతిభ కనపడింది.
కథ -జార్ఖండ్‌లోని రాంచిలో ఓ మధ్యతరగతి కుటుంబం నుంచీ ఎదిగిన మహేంద్రసింగ్ ధోని కథ. ఇదొక అన్‌టోల్డ్ స్టోరీ కాదు. ధోని జీవితాన్ని ఆవిష్కరించిన సంఘటనల సమాహారం. బాల్యం- అతడి జీవితానికి క్రికెట్ సోపానం వేసిందా? క్రికెట్‌కీ.. అతడికీ అవినాభావ సంబంధం ఏ వయసులో పడింది? క్రికెట్ ప్రస్థానంలోనూ.. అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతూన్న తీరులోనూ.. రైల్వే టీటీ ఉద్యోగం నుంచీ క్రికెట్ వైపు మళ్లిన అతడి ఆలోచనల వెల్లువలోనూ ఎదుర్కొన్న సవాళ్లనీ.. సమస్యల్నీ - ఇలా ధోని జీవితంలోని ప్రతి అంశాన్నీ కూలంకషంగా చర్చిస్తూ.. ఇదొక బయోపిక్ అనిపించకుండా.. ప్రేక్షకుడు ‘్ధని’తో కనెక్ట్ అయ్యే రీతిన సినిమా ఆద్యంతం మలచబడింది.
ఇది కేవలం క్రికెట్ అభిమానుల కోసం మాత్రమే తీసిన సినిమా కాదు. ధోని ఆత్మకథలా చూసినా.. క్రికెట్ అంటే పిచ్చి ప్రేమనూ వ్యక్తీకరించేవారికీ.. అందునా ధోని అంటే ప్రాణం పెట్టేవారికీ.. ఈ సినిమా భావోద్వేగాల తెరపై కన్నీళ్లు పెట్టిస్తుంది. ధోనిని ప్రత్యక్షంగా చూస్తూన్నట్టు అనిపిస్తుంది.
రాంచీలోని ఓ మధ్యతరగతి యువకుడి కుటుంబ నేపథ్యం.. అతడి జీవితంలో తారసపడిన వ్యక్తులూ.. ఇష్టంలేని రైల్వే ఉద్యోగం.. దులీప్ ట్రోఫీలో ఛాన్స్ పోవటం.. అటు క్రికెట్‌కీ.. ఇటు ఉద్యోగానికీ మధ్య నలిగిన ధోని జీవితం ఎన్ని వొడిదుడుకుల్ని ఎదుర్కొందో చూస్తూంటే.. ధోని అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదగటానికీ.. ఎంతోమందికి స్ఫూర్తిని అందించే ప్రతినిధిగా కనిపించటానికి.. ఎన్ని సవాళ్లను చవిచూశాడో అర్థమవుతుంది. అదీకాక- భావ సంఘర్షణనీ.. మానసిక వత్తిడినీ.. అంచెలంచెలుగా ఎదిగే అతడి క్రికెట్ జీవితాన్ని ఒక్కో మెట్టుగా చక్కగా చిత్రీకరించటంవల్ల.. ఇదొక డాక్యుమెంటరీలా అనిపించదు.
ధోని బాల్యం ఎవరికీ అంతగా తెలీదు. క్రికెట్ పట్ల అతణ్ని పురిగొల్పిన అంశాలేమిటో? రైల్వే టీటీగా అవతారమెత్తిన నాటి ధోని జీవితం గురించి.. దులీప్ ట్రోఫీలో అవకాశం దొరక్కపోవటం గురించీ.. ఇత్యాది అంశాలన్నీ ఆసక్తిని రేకెత్తించేవే. కాబట్టి - ఫస్ట్‌హాఫ్ అంతా ఆడుతూ పాడుతూ వొకింత ఉద్విగ్నభరితంగా సాగిపోతుంది. సెకండ్ హాఫ్‌కి వచ్చేప్పటికి క్రికెట్ తెరపై అన్నీ తెలిసిన అంశాలే కావటంతో సన్నివేశాలన్నీ నిస్తేజంగా నడుస్తూన్నట్టు అనిపించినా.. ఎక్కడా బోర్ కొట్టే ఛాన్స్ లేకుండా దర్శకుడు మధ్యమధ్య రొమాంటిక్ సీన్స్‌తో.. పాటల్తో వాటిని నింపేశాడు. ఇక- 2011 వరల్డ్ కప్‌ని మళ్లీ చూసేట్టు చేయటంలో దర్శకుడు సఫలీకృతుడయ్యాడు.
నటనాపరంగా -సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ‘్ధని’ పాత్రకి సరైన న్యాయం చేశాడు. ధోనిలా భుజాలు ఆడించడం.. ధోనీలా షాట్లు కొట్టడం.. నడవడం.. ఒకటేమిటి.. ధోని ప్రతిబింబాన్ని తెరపై చూపించటంలో సుశాంత్ నూటికి నూరు శాతం జీవించాడు. ఒక్క ముఖం తప్ప ప్రతి కదలికా ధోనిలా కనిపించి.. ధోనినే తెరపై కనిపిస్తున్నాడా? అన్న అనుభూతిని కలిగించాడు. ఏకే గంగూలీగా కనిపించిన నటుడు, యువరాజ్ సింగ్‌లా నటించిన నటుడు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్క్రీన్‌కి జీవం పోశారు. ధోని తండ్రి పాత్రలో అనుపమ్‌ఖేర్.. కోచ్‌గా రాజేశ్ శర్మ.. ఆయా పాత్రల్లో జీవించారు. సంగీతం బాగుంది.

-బిఎనే్క