రివ్యూ

జత లేకుంటేనే....!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు *నీ జతలేక..
**
తారాగణం:
నాగశౌర్య, పరుల్ గులాఠి, సరయు, తదితరులు.
సంగీతం:
స్వరాజ్ జెడిదయ్య
నిర్మాత:
జివి చౌదరి
దర్శకత్వం:
లారెన్స్ దాసరి
**
తెలుగు సినిమాకు నాగశౌర్య అరంగేట్రం కోసం రూపొందించిన సినిమా ఇది. అనుకున్న సమయానికి చిత్రం విడుదల కాకపోవడంతో -నాగశౌర్య దీని తరువాత మొదలెట్టిన సినిమాలు చాలానే చేసేశాడు. ముఖ్యంగా ‘ఊహలు గుసగుసలాడె’తో తన ఖాతాలో హిట్టువేసుకున్నాడు. కొత్త దర్శకుడు లారెన్స్ దాసరి దర్శకత్వంలో జివి చౌదరి నిర్మించిన చిత్రమే -నీ జతలేక. లేట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగశౌర్య అరంగేట్రం చిత్రం -అతని కెరీర్‌కు ప్లస్సో మైనస్సో చూద్దాం.
కథ:
అఖిల్ (నాగశౌర్య)కి బాగా డబ్బున్న గర్ల్‌ఫ్రెండ్ స్వప్న (సరయు). ఎప్పుడూ గొడవపడే వీరిద్దరూ ఒకరోజు తీవ్ర ఘర్షణతో ఒకరికొకరు దూరమవుతారు. దీంతో అఖిల్ డిప్రెషన్‌కు గురవుతాడు. అఖిల్ పరిస్థితి చూసి చలించిపోయిన ఓ ఫ్రెండ్ -ఓ ఉచిత సలహా పడేస్తాడు -‘నీ లవర్ ఈర్ష్య ఫీలయ్యేలా చేస్తే ఆమె నిన్ను వెతుక్కుంటూ వస్తుంది’ అని. ఫ్రెండ్ సలహాను అడ్వాంటేజ్‌గా తీసుకున్న అఖిల్ సలహా ఇచ్చిన ఫ్రెండ్ లవర్ (పరుల్)నే హెల్ప్ చేయమని అడుగుతాడు. కానీ అనుకోకుండా అఖిల్, పరుల్ ఇద్దరూ ప్రేమలో పడతారు. అలా ప్రేమలో పడిన వారిద్దరూ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? వాళ్ళ లవర్స్‌ని ఎలా మేనేజ్ చేశారు? చివరికి వీరిద్దరూ ఒక్కటయ్యారా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాలి.
పరిచయం సినిమా కనుక నాగశౌర్య ప్రెష్ లుక్‌లో కనిపించినా -ఆకట్టుకునేంత నటన కనబర్చలేదు. నాగశౌర్యను ఇప్పటికే అలవాటుపడిన ప్రేక్షకుడు -తొలి పరిచయంలో చూడటం చాలా కష్టమైంది. కొడుకు తాగి తందానాలు ఆడుతుంటే.. అల్లారు ముద్దుచేసే తండ్రి పాత్ర ప్యాటర్న్‌నూ ఇప్పటి ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. హీరోయిన్ పరుల్ తన పాత్రలో ఫరవాలేదనిపించింది. సెకండాఫ్‌లో లవ్ ఎమోషన్స్‌లో బాగానే మెప్పించింది. సరయు గ్లామర్ పాత్రలో పడిన కష్టానికి కొన్ని మార్కులు పడ్డాయి. నటనపరంగా కితాబిచ్చేంత గొప్ప నటన ఎవరినుంచీ కనిపించదు.
సాంకేతిక అంశాల విషయంలో -లవ్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆర్ట్ వర్క్ బావుంది. రక్తికట్టించేంత గొప్ప కథనం లేకపోవడం, సాధారణ ప్రేమ కథే కావడంతో మిగిలిన సాంకేతిక విభాగాల పనితీరూ మైనస్‌లోనే ఉండిపోయాయి. డబ్బింగ్ డైలాగుల్లో -బట్టీపట్టి చెబుతున్న ఫీలింగ్ కలగడంతో, సంభాషణల్లో చమక్కుమనిపించే పనితనం కనిపించక పోవడం బిగ్ మైనస్. దర్శకుడు లారెన్స్ దాసరి తొలి సినిమా తడబాటు అన్ని కోణాల్లో కనిపిస్తుంది. ఒక ప్రేమకథని నడిపించే పనితీరులో అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ప్రేమ కథలోకి అనవసర సన్నివేశాలు జొప్పించి, బోరింగ్ ట్రాక్‌లోకి తీసుకెళ్లిపోయాడు. ఎమోషన్స్ క్యారీ చేయడానికి ప్రధాన సాధనమైన మ్యూజిక్ (ఆర్‌ఆర్) సైతం మెప్పించలేకపోవడంతో -సినిమాను వదిలేసి ఆడియన్స్ కొత్త జతను వెతుక్కోవాల్సిన పరిస్థితి కనిపించింది. సెకండాఫ్ చివరిలో ట్రయాంగిల్ ఎమోషనల్ లవ్ సీన్స్ తప్ప, చెప్పుకోడానికి సినిమాలో ఏమీ లేదనిపించింది. ఇక నిర్మాణ విలువలు జస్ట్ ఓకే.
ఓల్డ్ స్టోరీ, బోరింగ్ నేరేషన్, మెప్పించలేని నటన అన్నీ సమపాళ్లలో మిళితమైన ఈ చిత్రం -ఒడిదుడుకులు లేకుండా నడుస్తున్న నాగశౌర్య కెరీర్‌కు చిన్న మైనస్ పాయింటే. దర్శకుడి అనుభవ రాహిత్యం, కథ, కథనాలు అప్‌డేట్‌కు లేకపోవడం, సంభాషణల్లోనూ చతుతర చూపించలేకపోవడం, రొటీన్ మ్యూజిక్ ట్రాక్స్ వెరసి -కొత్త పెయిర్ వెతుక్కున్న హీరో నాగశౌర్యలాగే ప్రేక్షకుడూ కొత్త సినిమా వెతుక్కోక తప్పదు.

-త్రివేది