రివ్యూ

*ఈడు గోల్డ్ ఎహె (అంత సీన్ లేదెహె..!)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో ఇమేజ్ కోసం కమెడియన్ సునీల్ పడుతోన్న కష్టం అంతా ఇంతా కాదు. హీరోగా రెండు మూడు హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు కూడా. తరువాతే -ఇమేజ్ నిలబెట్టుకోవడం ఎంత కష్టమో అర్థమవుతూ వచ్చింది. వరసగా సినిమాలన్నీ ఫ్లాప్ బాట పట్టడంతో -ఒకింత గ్యాప్ తీసుకుని కృష్ణాష్టమితో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టాడు. ఆ సినిమాతోపాటు నిన్నగాక మొన్న వచ్చిన జక్కన్న కూడా చెక్కుచెదిరిపోవడంతో -ఆశలన్నీ ‘ఈడు గోల్డ్‌ఎహె’ మీదే పెట్టుకున్నాడు. టైటిల్ హిట్టు కొట్టడంతో -డైరెక్టర్ వీరూ పోట్లతో తనకు కొత్త లైఫ్ స్టార్టయ్యిందని సంబరపడ్డాడు సునీల్. మరి -ప్రేక్షకుల చేత ‘ఈడు గోల్డేనెహె’ అనిపించుకున్నాడో లేదో చూద్దాం.
కథ?
బంగర్రాజు (సునీల్) అనాధ. నచ్చినచోటల్లా పని చేసుకుంటూ కాళం వెళ్లదీస్తుంటాడు. బంగార్రాజు ఎక్కడ పనిలో కుదిరితే -అక్కడ యజమానికి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇదిలావుంటే మహదేవ్ (పునీత్ ఇస్సార్) ఇల్లీగల్ బిజినెస్‌లతో కోట్లు గడించాడు. అతనికి బెట్టింగ్ వ్యాపారం కూడా ఉంటుంది. బెట్టింగ్ ద్వారా సంపాదించిన 900 కోట్లను లాఫింగ్ బుద్ధ విగ్రహానికి డైమండ్స్ అమర్చడం ద్వారా కన్వర్ట్ చేస్తాడు. వివిధ ప్రాంతాల నుంచి ఆ విగ్రహాలను తెప్పించి ఒకచోట భద్రపరుస్తాడు. ఈ కోవలో బంగార్రాజుకి పనిచ్చిన వారికి తిప్పలు తప్పవనేది కొన్ని సంఘటనల ద్వారా రుజువవుతుంది. బంగార్రాజుకి పనివ్వడంవల్ల దాదాపు దెబ్బలు తినాల్సిన పరిస్థితికి వచ్చిన నారదరావు... అతన్ని హైదరాబాద్‌లోని స్నేహితుడి దగ్గరకు పంపేస్తాడు. అలా హైదరాబాద్ చేరిన బంగార్రాజుకి దేవుడిచ్చిన తల్లిలా జయసుధ కనిపిస్తుంది. వాళ్లింట్లోనే ఉంటూ తమ్ముడి గార్మెంట్స్ షాపులో పని చేస్తుంటాడు. ఆ సమయంలో బంగార్రాజుకి కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. తన రూపంలోనే సునీల్‌వర్మ అనే వ్యక్తి ఉన్నాడని తెలుసుకుంటాడు. మహదేవ్ మనుషులు సునీల్‌వర్మను వెతుకుతూ బంగార్రాజు వెంటపడతారు. ఈ విషయాలన్నీ బంగార్రాజుని కన్‌ఫ్యూజ్ చేస్తాయి. బంగార్రాజుని సునీల్‌వర్మ ఏ విషయంలో వాడుకున్నాడు? అసలు సునీల్‌వర్మ ఎవరు? సునీల్‌వర్మ కోసం ఎందుకు వెతుకుతుంటారు అన్నదే మిగతా కథ.
ముఖ్యంగా బంగార్రాజుగా సునీల్ నటన బాగుంది. ఇటీవలి కాలంలో వచ్చిన సినిమాలతో పోలిస్తే ఈడు గోల్డ్ ఎహెలో పాత్ర కాస్తంత వైవిధ్యంగా ఉంది. హీరో అనిపించుకోవాలన్న సునీల్ తపన -డ్యాన్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌లో కనిపించింది. కోపమంటే తెలీని బంగార్రాజుకి ఓ సందర్భంలో కోపమొస్తుంది. ఆ కోపంలో విలన్ గ్యాంగ్‌ని ఉతికేసే యాక్షన్ ఎపిసోడ్ ఎమోషనల్‌గా డీల్ చేశాడు. ఎంటర్‌టైన్‌మెంట్ పరంగానూ సునీల్‌కి మార్కులు పడతాయి. హీరోయిన్లు సుష్మారాజ్, రిచాపనాయ్ హీరోతో ఆడిపాడే సన్నివేశాలకు తప్ప, క్యారెక్టర్లకు ప్రాధాన్యత లేదు. మహదేవ్‌గా పునీత్‌ఇస్సార్ ఓకే. పృధ్వీ, షకలక శంకర్, వెనె్నల కిషోర్ కామెడీ డైలగ్స్‌తో నవ్వించే ప్రయత్నం చేశారు. మిగిలిన పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేమీ లేదు.
దర్శకుడు వీరు పోట్ల -కామెడీ థ్రిల్లర్‌కు సరిపడా కథ, ట్విస్ట్‌లు పెట్టుకుని మ్యాజిక్ చేయాలనుకున్న ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. ట్విస్ట్‌లన్నీ సన్నివేశాలపరంగా ఓకే అనిపించినా, కథకు పెద్ద జర్క్‌లా తోస్తాయి. అక్కడక్కడా -వీరూ మార్క్ కామెడీ తప్ప మెరుపులు మెరిపించిన సన్నివేశాలు వెతుక్కున్నా కనిపించవు. సాగర్ మహతి అందించిన బాణీల్లో -బయటికొచ్చాక ఒక్కటీ గుర్తుండేది లేదు. బ్యాక్‌గౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ప్రాజెక్టు స్టేటస్ పెంచితే, ఎడిటింగ్ మైనస్‌తో బ్యాలెన్స్ చేసేసింది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్బ్. చివరగా ఈడు గోల్డ్ ఎహె చెప్పుకోవడానికి వైవిధ్యమైన కథ, వండి వడ్డించడానికి అదిరిపోయే ట్విస్ట్‌లున్నా తడబాటు స్క్రీన్‌ప్లేతో ముడిసరుకు మొత్తం వృధా అయిపోయింది. కమర్షియల్ అంశాలను బలంగా జోడించినా, టైమింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ కరవై బోరింగ్‌గా నడిచింది. సునీల్ హీరోగా మారినప్పటినుంచి ఆయన పాత్రలు చూస్తే అన్నీ ఒకే తరహాలో సాగుతుంటాయి. ఈసారికి ఆ తరహా పాత్ర ప్రభావం నుంచి బయటపడినా, లక్ కలసిరాలేదు. ఫస్ట్ఫాలో అసలు కథ మొదలెట్టడానికి దర్శకుడు భరించలేనంత సమయం తీసుకోవడంతో -హీరో పాత్రతో ఆడియన్స్ ట్రావెల్ కాలేకపోయారు. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ ఏమాత్రం ఆకట్టుకునేలా అనిపించదు.

తారాగణం: సునీల్, సుష్మారాజ్, రిచాపనాయ్, పునీత్‌ఇస్సార్, పృధ్వీ, షకలక శంకర్,
వెనె్నల కిషోర్ తదితరులు
నిర్మాత:
రామబ్రహ్మం సుంకర
సంగీతం:
సాగర్ మహతి
దర్శకత్వం:
వీరూ పోట్ల

-త్రివేది