రివ్యూ

**అభినేత్రి ( మెప్పించని ఆత్మ కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం: ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్, ఏమీజాక్సన్, హేమ, పృధ్వీ, సప్తగిరి, మురళీశర్మ
సంగీతం:
సాజిద్-వాజిద్, విశాల్, జివి ప్రకాష్
నేపథ్య సంగీతం: గోపీసుందర్
నిర్మాత: ఎంవివి సత్యనారాయణ
దర్శకత్వం: విజయ్

అభినేత్రి -ప్రచారపరంగా హారర్ కామెడీ సినిమా. కానీ ఇందులో హారర్ కంటే కామెడీయే ఎక్కువ కనిపించింది. అలా కనిపించిన కామెడీ కూడా కథలో కలిసినట్టు కాకుండా బిట్లుబిట్లుగా ఉండి టీవీ స్కిట్లు మాదిరిగా ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. వెరసి ఏ జోనర్‌కూ చెందని చిత్రంగా మిగిలిపోయి ప్రేక్షకులకు పూర్తిస్థాయి అలరింపు విషయంలో విఫలమైంది. వివరాల్లోకి వెళ్తే.. సినిమాల్లో వచ్చే పేరు, ఆ పరంగా వచ్చే ప్రశంసలు తదితరాలు తీరకుండానే సినీ నటి రూబీ (తమన్నా) జీవితం అంతమైపోతుంది. అలా తనకు తీరని కోరికలు తీర్చుకుందామనే తపనతో ఆ ఆత్మ కృష్ణ (ప్రభుదేవా) భార్య దేవి (తమన్నా)లో ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించిన రూబీ నుంచి తన వైఫ్ దేవిని కృష్ణ ఎలా విడిపించుకున్నాడన్నది మిగిలిన కథ. ఇలా ఆత్మలు, ప్రవేశాలు, నిష్క్రమణలూ -ఈ మధ్య తెలుగు సినిమాలకు బాగా అలవాటైన ముడి పదార్థం. కనుక ఇందులో వైవిధ్యం ఏమీ కనిపించలేదు. కాకపోతే ఆత్మల పేరిట విపరీతమైన అరుపులూ, చప్పుళ్లు ఇందులో లేకపోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇంకో చిన్న విషయం -చాలా కాలానికి ప్రభుదేవా తెలుగు తెరపై కనిపించడం, తమన్నాకు నటించడానికి అవకాశంమున్న రెండు విభిన్న పాత్రలు లభించడం. అయితే ఎన్నుకున్న కథ -అదీ సినీ నేపథ్యం ఉన్నది కావడంతో ఏది సినిమాలో కథో, ఏది చిత్రంలో కథో సరిగ్గా తెలియక ప్రేక్షకుడు కొంత గందరగోళానికి గురయ్యాడు. ఈ తరహా సినీ నేపథ్య స్టోరీలకు ఆ సమస్య తప్పదేమో. దీన్ని అధిగమించడానికి దర్శకుడు మార్గాలు అనే్వషించి ఉంటే ప్రేక్షకుడికి గొప్ప రిలీఫ్ ఉండేది. ఇక ఈ చిత్రం హిందీ (టుటుక్ టుటుక్ టుటియా), తమిళం (దేవి), అభినేత్రిగా తెలుగులో తయారై విడుదల కావడంతో మూడు భాషల నేటివిటీ కోసం పడిన యాతన ఎటూకాకుండా పోయింది. దీంతో ఫీల్ మిస్సయ్యింది. తెలుగు కోసం ‘రాజమండ్రి, వేటపాలెం’ అంటూ బోర్డులు పెట్టినా, తిరిగి చిత్రంలో మొత్తం ప్రభుదేవా బొంబాయిలో ఉద్యోగం, అక్కడ సినిమా షూటింగ్స్ వగైరా చూపడంతో కథతో ప్రేక్షకుడు కనెక్ట్ కాలేకపోయాడు. ఇక ఇంతకుమించి కథాపరంగా ఇందులో లాజిక్‌కి వెళ్లడం అనవసరం. ఎందుకంటే ఇది ఆత్మల మూలంతో తయారైన కథ కనుక. ఇటీవలే త్రిష నాయికగా వచ్చిన ‘నాయిక’ కూడా ఇంచుమించు ఈ చాయల్లోనే సినిమా వెళ్లిందన్న వాదనా ఉంది. ఇవిలావుంటే, నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వయసుపైబడిన ఛాయలు నాయక పాత్రధారి ప్రభుదేవాలో స్పష్టంగా కనిపించినా, తనదైన శైలి డాన్స్ అంశాలను ఇందులోనూ కనబర్చాడు. అది పాటల్లో డాన్స్‌పరంగానే కాకుండా, రాజ్‌కరణ్ (సోనూసూద్), రూబీ (దేవిలో ప్రవేశించిన ఆత్మ) విషయంలో తన నిర్ణయం తెలిపేటపుడు అందులోని సంతోష, విషాద సంబంధితాలకు అనుగుణంగా డాన్స్‌కోడ్‌లో అభినయించి చూపడం అలరించింది. రూబీ-దేవి రెండు పాత్రల్లోనూ తమన్నా తన శక్తివంచన లేకుండా విభిన్నత చూపడానికి ప్రయత్నించి కృతకృత్యురాలైంది. ముఖ్యంగా రూబీ తరహా ఆధునిక పాత్రలు తనకు అలవాటైనా, గ్రామీణ యువతి పాత్రలో (దేవి) ఎక్కువ కష్టపడి నటించింది. స్టార్ హీరో పాత్రలో సోనూసూద్ తన తరహా నటనను మరోసారి ప్రదర్శించారు. అయితే తనకు అంతగా అలవాటులేని స్టెప్ట్ వగైరా పాటల్లో ఇందులో వేయడం ఓ ప్రత్యేకత. హీరో ఫ్రెండ్‌గా సప్తగిరి కొన్ని సన్నివేశాల్లో ఇలా వచ్చి అలా అదృశ్యమైపోయాడు. సోనూసూద్ మేనేజర్ పాత్రలో మురళీశర్మ నటించాడ. తమన్నా తల్లి పాత్రలో హేమ కనిపిస్తుంది. ‘పులికి ఆకలేస్తే పులిహోర తినదు’, ‘ఆడది అందమైనదేతే మగాణ్ణి ఏలుతుంది. తెలివైనదేతే దేశాన్ని ఏలుతుంది. రెండూవుంటే ప్రపంచానే్న ఏలుతుంది’ ‘నువ్వు చచ్చిపోయావ్ కాబట్టి బతికిపోయావ్’ లాంటి సంభాషణల్లో కోన వెంకట్ కోణం కనిపిస్తుంది. సంగీత దర్శకులు స్వరపరిచిన పాటల్లో ఏమీజాక్సన్, సుందరం కనిపించిన తొలి పాట క్యాచీగా ఉంది. ‘టుటుక్ టుటుక్ టుటియా’ ఎత్తుగడతో ఆరంభమైన పాటలో కొరియోగ్రఫీ ఆకట్టుకునే రీతిలో ఉంది. చిత్రీకరణపరంగా ‘ఆకాశంలో రంగులమై/ అరచేతుల్లో రేకలమై’ పాట బాగుంది. చిత్రానికి ఖర్చుపై పెట్టిన శ్రద్ధ కథపైనా పెట్టివుంటే ‘అభినేత్రి’ నటన అన్ని వర్గాలనూ ఆకర్షించి ఉండేది.

.................................................................................................................................
**** చాలా బాగుంది *** బాగుంది ** ఫర్వాలేదు * బాగోలేదు

-అనే్వషి