రివ్యూ

ఫలితం లేని ప్రయాస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు *నాగభరణం

తారాగణం: రమ్య, దిగంత్, విష్ణువర్ధన్, సాయికుమార్, ముకుల్‌దేవ్, సాధుకోకిల తదితరులు..
సంగీతం: గురు కిరణ్
సినిమాటోగ్రఫీ: హెచ్‌సి వేణు
ఎడిటింగ్: జాని హర్ష
మాటలు: ఎంఎస్ రమేష్
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: సాజిత్ ఖురేషీ, సోహేల్ అన్సారి, ధవల్‌గడ

కుటుంబ కథా చిత్రాల స్పెషలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ రొటీన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టి, కొత్త ట్రెండ్ సెట్ చేసే ప్రయత్నాలవైపు అడుగులేస్తున్నాడు. సినిమాలకు కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడుకోవచ్చని తెలిసిన రోజుల్లోనే ‘అమ్మోరు’తో గ్రాఫికల్ మాయాజాలాన్ని సృష్టించి ప్రశంసలు అందుకున్నాడు. ఆ తరువాత దేవి, అంజి, అరుంధతి సినిమాల్లో గ్రాఫిక్స్ మాయాజాలాన్ని పూర్తిగా వాడుకుని -టెక్నికల్ స్క్రీన్‌ప్లేలో తనకు సాటిలేరని ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా అదే ధైర్యంతో రూపొందిన గ్రాఫిక్ మాయాజాలమే -నాగభరణం. కన్నడ హీరోయిన్ రమ్య ప్రధాన పాత్రలో నగరహవు చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు నాగభరణంగా తీసుకొచ్చారు. విడుదలకు ముందు ‘కోటి’ అంచనాలు క్రియేట్ చేసినా -ఆ అంచనాలకు మాత్రం చేరలేకపోయంది.
***
సూర్యగ్రహణం రోజున అన్ని లోకాల్లోని దేవతల దైవత్వం క్షీణిస్తుందని, అందుకని వారి శక్తులన్నింటినీ ఒక మహాకలశంలో నిక్షిప్తంచేసి భూలోకంలోనే ఒకచోట భద్రపరుస్తారు. సూర్యగ్రహణానికి ముందు కొన్ని దుష్టశక్తులు ఆ కలశాన్ని దక్కించుకొని దేవతలను నిర్వీర్యుల్ని చేయాలని ప్రయత్నిస్తుంటాయి. ఆ కలశాన్ని కాపాడే బాధ్యతను శివయ్య కుటుంబానికి అప్పగిస్తారు. తరతరాలుగా ఆ కలశాన్ని ఆ కుటుంబమే కాపాడుతూ వస్తుంది. ప్రస్తుతానికి వస్తే ఈ సినిమాలో కథానాయకుడి పేరు నాగచరణ్ (దిగంత్). ఫ్రెండ్స్‌తో మ్యూజికల్ బ్యాండ్ నిర్వహిస్తూ పోటీలకు వెళ్తుంటాడు. ఒకరోజు మానస (రమ్య) ఆ ట్రూప్‌లో చేరడానికి వస్తుంది. నాగచరణ్‌కు ఇష్టం లేకుండానే అతని ఇంట్లో సెటిలవుతుంది. ఇదిలావుంటే ఎక్కడో భద్రపరిచిన మహాకలశం అటుతిరిగి ఇటుతిరిగి ఢిల్లీ చేరుతుంది. అక్కడ జరిగే ఇంటర్నేషనల్ మ్యూజిక్ కాంపిటీషన్స్‌లో ఆ కలశాన్ని బహుమతిగా ఇవ్వబోతున్నట్టు ప్రకటిస్తారు. కాంపిటీషన్‌లో ఎలాగైనా గెలిచి కలశాన్ని దక్కించుకోవాలని విలన్ ట్రై చేస్తుంటాడు. మరోపక్క ఎప్పటినుంచో ఓ అఘోరా ఆ కలశం కోసం పోరాటం చేస్తుంటాడు. మరి ఆ కలశం చివరికి ఎవరికి దక్కింది? అసలు మానస ఎవరు? నాగచరణ్ మ్యూజిక్ ట్రూప్‌లో ఆమె ఎందుకు చేరింది? మానస ఫ్లాష్‌బ్యాక్ ఏమిటి? మ్యూజిక్ కాంపిటీషన్‌లో మహాకలశాన్ని నాగచరణ్ గెలుచుకున్నాడా? లేక దాన్ని దుష్టశక్తులు చేజిక్కించుకున్నాయా? అనేది మిగతా కథ.
సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది గ్రాఫిక్స్ గురించే. కేవలం గ్రాఫిక్స్‌ని నమ్ముకునే సినిమా చేశారన్నట్టే అనిపిస్తుంది. క్లైమాక్స్ పార్ట్‌లో దివంగత కన్నడ సూపర్‌స్టార్ విష్ణువర్ధన్‌ను విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా ఆవిష్కరించాలని చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు. ఈ పార్ట్‌లో విజువల్ ఎఫెక్ట్స్ ఓకే. ఇక ఎక్కువగా తనపైనే నడిచే సినిమాలో రమ్య నటన బాగుంది. సాయికుమార్ సంస్థానం నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ ఆకట్టుకున్నాయి. రమ్య పాత్రను పక్కనబెడితే మిగతా ప్రధాన పాత్రలన్నీ ఓవర్ అనిపిస్తాయి. ఆయా పాత్రల అతి సినిమా స్థాయిని దిగజార్చేసింది. విలన్ పాత్రను బలంగా ప్రజెంట్ చేయలేకపవడం, ఆ పాత్ర చేసే ఓవర్‌యాక్టింగ్‌తో జోకర్ పాత్రలా అనిపిస్తుంది.
సినిమా మొత్తం లౌడ్. ఎక్కడా బలమైన ఎమోషన్ లేకుండా సాగిన కథ ప్రేక్షకులను మెప్పించలేకపోయంది. ఇక సాంకేతిక అంశాలపరంగా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌దే బలమైన పాత్ర. పెద్ద పామును సృష్టించిన విధానం, క్లైమాక్స్‌లో దివంగత సూపర్‌స్టార్ విష్ణువర్ధన్‌ను విజువల్ ఎఫెక్ట్స్‌తో ఆవిష్కరించడం లాంటివి సాంకేతికంగా సినిమాకు ప్లస్‌పాయంట్లు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బావున్నాయ. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ సినిమాకు మేజర్ మైనస్ పాయంట్లు. చిన్న పాయింట్‌ను గ్రాఫిక్స్‌లో మాయచేసి చూపించడంలో దర్శకుడు కోడి రామకృష్ణ విఫలమయ్యాడు. ఎమోషన్స్‌ని విజువల్ గ్రాఫిక్స్ డామినేట్ చేయడంతో ప్రేక్షకులలో కథ తాలూకు సంతృప్తి కనిపించలేదు. దైవశక్తులున్న మహాకలశాన్ని మ్యూజిక్ కాంపిటీషన్‌లో ట్రోఫీగా ఇవ్వడంలాంటి సీన్లు -కామెడీని తలపిస్తాయ. మహాకలశం కోసమే నాగచరణ్ దగ్గరికి చేరిన మానస -మిగిలిన సన్నివేశాల్లో గ్రాఫిక్స్‌లో తన శక్తుల్ని చూపించినా కలశం దక్కించుకునే విషయంలో మాత్రం తన మంత్ర శక్తులను ఎందుకు వాడలేదన్నది అర్థంకాదు.
విజువల్ ఎఫెక్ట్స్‌తో మ్యాజిక్ చేస్తే ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోయి సినిమా చూస్తారన్నది కొన్ని సినిమాలకు వర్కవుట్ అయ ఉండొచ్చు! అయితే ఆ విజువల్ ఎఫెక్ట్స్‌తోపాటుగా బలమైన కథ, కథనం, ఎమోషన్ నాగభరణంలో లేకపోవడం వెలితిగా కనిపించింది. ఫస్ట్ఫాలో బ్యాలెన్స్‌లేని సన్నివేశాలతో బోర్ కొట్టిస్తే, సెకండాఫ్‌లో కథ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఆడియన్స్‌ని ఇబ్బందిపెట్టింది. సాంకేతిక బలం సత్తా చూసుకుని అసలు కథ గాలికి వదిలేసిన సినిమా -‘నాగభరణం’

-త్రివేది