రివ్యూ

బ్యూటీలెక్కువ.. భయం తక్కువ ( * బాగోలేదు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*కళావతి

తారాగణం:
సిద్ధార్థ్, త్రిష, హన్సిక, పూనమ్ బజ్వా, రాధారవి, సూరి, కోవై సరళ, సుందర్ సి తదితరులు
సంగీతం: హిప్ హాప్ తమిళ
నిర్మాత:
గుడ్ ఫ్రెండ్స్
దర్శకత్వం:
సుందర్ సి.

ప్రస్తుతం సౌత్‌లో హర్రర్ సినిమాల హవా జోరుమీదుంది. ఈ తరహా చిత్రాలు రూపొందించేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు హీరోయిన్స్ కూడా రెట్టింపు ఉత్సాహంతో కాల్షీట్లు ఇస్తున్నారు. ఈ తరహా పాత్రలతో హీరోయిన్లకు మంచి గుర్తింపు దక్కుతుంది కూడా. కొద్దిరోజుల క్రితం అరణ్మనై పేరిట తమిళ్‌లో దర్శకుడు సుందర్ సి రూపొందించిన చిత్రం చంద్రకళ పేరిట తెలుగులోనూ విడుదలైంది. ఆ ఉత్సాహంతోనే దర్శకుడు సుందర్ సి అరణ్మయి-2ని తెరకెక్కించాడు. తెలుగులో కళావతి పేరిట విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైన కళావతి భయపెట్టిందో లేదో చూద్దాం.
హారర్ సినిమా అనగానే ఎప్పుడూ ఓ ఇల్లో లేదా ప్యాలెసో కనిపించటం, అందులోకి ఆత్మ ప్రవేశించడం, హీరోయిన్‌ని ఆవహించి రకరకాల భయపెట్టే సిత్రాలు చేయడం కామన్. సమస్యల్లో చిక్కుకున్నవారిని హీరో కాపాడటం? ఇలాంటి ఫార్మాట్‌కు ఏమాత్రం తీసుపోని కథే -కళావతి. మధ్యమధ్యలో కమెడియన్ల జోకులు మామూలే. సుందర్ సి చేసిన గత చిత్రం చంద్రకళలోనూ ఇదే చూశాం. తాజాగా వచ్చిన సీక్వెల్‌లోనూ అదే చూపించాడు.
కథలోకి వెళ్తే.. కొవిలూర్ గ్రామంలో భారీ అమ్మవారి విగ్రహానికి కుంభాభిషేకం చేయడం కోసం ఊరి పెద్దలు సన్నద్ధమవుతారు. విగహ మట్టాన్ని బలోపేతం చేయడానికి -విగ్రహానికి స్థానభ్రంశం కలిగిస్తారు. దాంతో అప్పటివరకు అమ్మవారికి భయపడి ఎక్కడోదాక్కున్న ఆత్మలు ఒక్కసారిగా ఊరిపై విజృంభిస్తాయి. దాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు స్వాములు కొన్ని ఆత్మలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. ఆ సమయంలో ఒక ఆత్మ ఊరి జమీందారు బంగళాలోకి ప్రవేశిస్తుంది -వారసులపై పగ తీర్చుకోవడానికి. ముందుగా జమీందార్‌పై ఎటాక్ చేసి అతను కోమాలోకి వెళ్లేలా చేస్తుంది. జమీందారు అనారోగ్యం వర్తమానం అందడంతో -టూర్‌లోవున్న చిన్న కొడుకు మురళి (సిద్ధార్థ్), కాబోయే కోడలు అనిత (త్రిష) అక్కడికి చేరుకుంటారు. ఇంట్లో ఏదో జరుగుతోందనే విషయాన్ని గ్రహిస్తారు. సిటీనుంచి వచ్చిన అనిత అన్నయ్య రవి (సుందర్ సి) దాన్ని కనిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. అప్పుడు రవికి ఎలాంటి విషయాలు తెలిశాయి? ఆ ఆత్మ జమీందారు కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేసింది? దానికి జరిగిన అన్యాయం ఏమిటి? అనేది మిగతా కథ.
ఇక సినిమా అంతా దర్శకుడే నటించేసి నడిపించేశాడు. చిత్రంలో కళావతి పాత్రను హన్సిక చేస్తే, హీరో మాత్రం సుందర్ సి. ఆత్మకు సంబంధించిన అన్ని విషయాలూ కనిపెట్టి, ఎవరిని ఆవహించిందో గుర్తించి, బయటకు పంపేందుకు ప్రాణాలను సైతం రిస్క్ చేసే కీలక పాత్రను దర్శకుడే పోషించాడు. వీరోచిత పోరాటాలూ చేశాడు. హీరోగా కనిపించే సిద్ధార్థ్ పాత్ర కేవలం పాటలకు, కొన్ని సన్నివేశాలకే పరిమితమైంది. కళావతిగా హన్సిక ఇంతకుముందు చంద్రకళ చిత్రంలో చేసిన తరహా పాత్రనే చేసింది. ఇందులోనూ అన్యాయానికి గురై జమీందారు కుటుంబంపై పగ పెంచుకుంటుంది. కళావతి ఆవహించిన అనిత పాత్రలో త్రిష అభినయం కాస్త అసహజం అనిపిస్తుంది. ఇలాంటి సినిమాల్లో అప్పటివరకు చలాకీగా కనిపించే క్యారెక్టర్‌లో ఒక్కసారిగా వేష భాషాపరంగా ఎన్ని మార్పులు వచ్చినా, తోటివాళ్లకు ఎక్కడా అనుమానం రాదు. ఈ సినిమాలోనూ అంతే. పూనం బజ్వా గ్లామర్‌గా కనిపించినా -ఆమె ఎందుకు వచ్చిందో, జమీందారు ఇంట్లో ఉండాల్సినంత అవసరమేమిటో అర్థంకాదు. కామెడీని బాగా హైలైట్ చేసే ప్రయత్నం చేసినా -పెద్దగా ఫలించలేదు. సూరి, కోవై సరళ బృందం చేసే కామెడీ కొన్నిచోట్ల ఒకే అనిపించింది. సంభాషణల చాతుర్యం, ఉపమానాలు తప్ప కామెడీలో పెద్దగా పస లేదు. హారర్ కామెడీ సృష్టిద్దామనుకున్న సుందర్‌కి -టెక్నికల్ టీమ్ కొంతవరకు సహకరించింది. సెంథిల్‌కుమార్ ఫొటోగ్రఫీ రిచ్‌గా ఉంది. హిప్ హాప్ తమిళ చేసిన ట్యూన్లు తెలుగులో వర్కవుటయ్యే పరిస్థితి లేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకె. చంద్రకళనే కళావతిగానూ చూస్తున్న ఫీలింగ్ తప్ప, కథ గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు. జమీందారు మంచానపడిన తర్వాత త్రిష రూపంలోని కళావతి అతన్ని చంపేసినా, కుటుంబంలోని ఎవరూ గుర్తించరు. కనిపించకుండా పోయిన పెద్దకొడుకుని పట్టించుకోరు. ఇలాంటి తప్పిదాలు కోకొల్లలు. ఆత్మ భయపెట్టడం, మధ్యలో కామెడీ, ఆత్మను తెలుసుకోవడానికి జరిగే శోథనతో ఫస్ట్ఫా పూర్తవుతుంది. సినిమాని క్లైమాక్స్‌కి తేవడానికి వేరే సన్నివేశాలు అల్లుకోకుండా, కామెడీపైనే ఆధారపడ్డాడు దర్శకుడు. ఆత్మను బయటికి పంపేందుకు రకరకాల మంత్ర తంత్రాలను ఆశ్రయించిన తర్వాత సాదాసీదాగా రొటీన్ క్లైమాక్స్‌తో సినిమా పూర్తవుతుంది. సినిమాకి ప్లస్ కావాల్సిన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను సింపుల్‌గా తేల్చేయడంతో -ఆడియన్స్‌కి కిక్ ఇవ్వలేకపోయింది.

-త్రివేది