రివ్యూ

ఓవర్.. శంకర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు *శంకర

తారాగణం: నారా రోహిత్, రెజీనా, జాన్ విజయ్, ఆహుతి ప్రసాద్, ఎం.ఎస్.నారాయణ,
చిన్నా, సత్యకృష్ణన్, నీల్యా, హాజిల్‌క్రేనరీ, రాఘవ, రాజీవ్ కనకాల, ధన్‌రాజ్, తదితరులు.
సంగీతం: సాయికార్తీక్
నిర్మాత: ఆర్‌వి చంద్రవౌళి ప్రసాద్ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
తాతినేని సత్యప్రకాష్
**
నాయకుడు నారా రోహిత్ చిత్రాల జయాపజయాలు పక్కకు పెట్టి చూస్తే దాదాపు ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక కొత్తదనం లేదా భిన్నత్వం కోసం ప్రయత్నించే తపన ఇంతవరకూ కనపడేది. కానీ రోహిత్ తాజా చిత్రం ‘శంకర’ అటు కథలో కానీ ఇటు కథనంలో కానీ లేశమైనా కొత్తతనం లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది. అసలు చిత్ర లక్ష్యం దాదాపు సినిమా విరామ సమయం వరకూ వీక్షకునికి అర్థంకాదు. మిగిలిన సగం -లక్ష్యసిద్ధికోసం ఆదరాబాదరా చేసిన ప్రయత్నాలు ప్రేక్షకునికి పట్టలేదు.
***
మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన శంకర్ (నారా రోహిత్) మనస్తత్వానికి ఉన్న ఊరు అంతగా పడకపోవడంతో, సోదరుడు చిన్నా (చిన్నా) ఉన్న టౌనుకు వచ్చి అక్కడే ఉన్న హాస్టల్‌లో ఉంటూ డిగ్రీ చదువుతుంటాడు. అక్కడ ఓ పోలీసు అధికారుల బృందం.. విధి నిర్వహణలో జరిపిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నంలో -హాస్టల్‌లో ఉన్న శంకర్‌ను ఇరికిస్తారు. అలా అన్యాయంగా పోలీస్ ఉచ్చులో ఇరుక్కున్న శంకర్ తిరిగి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోడంతో కథ ముగుస్తుంది. చేయని నేరానికి ఇరుక్కుని, తరువాత హీరోయజంతో నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్న లైన్‌తో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయ. అందుకోసం మరో పరభాషా చిత్రం (2011లో ‘వౌనగురు’ పేరిట తమిళంలో, 2012లో ‘గురు’ పేరుతో కన్నడంలో, అనంతరం హిందీలో కావాల్సిన మార్పులతో ‘అకీరా’గా బాలీవుడ్‌లోనూ వచ్చాయ. వీటన్నిటికంటే ముందుగా వచ్చిన తమిళ చిత్రానికి ఓ కొరియర్ చిత్రం స్ఫూర్తి) ఊతంగా తీసుకుని నవ్యతను చూపేందుకు చేసిన ప్రయత్నం ప్రేక్షకుడికి పట్టలేదు. (ఈ చిత్రం 2013లోనే ప్రారంభమైంది. మూడేళ్ల జాప్యంతో విడుదలవడంవల్ల దాని బాపతు తేడాలు స్పష్టంగా కన్పడ్డాయి). పోనీ కథనంలోనైనా ఈ కాలపు స్పీడు అందుకుందా అంటే అదీ లేదు. సమీక్ష కోసం కథను ఓ క్రమంలో చెప్పుకున్నాం తప్ప, నిజానికి శంకర చిత్ర కథ ఆడియన్స్‌కి అంత క్లారిటీ ఇవ్వలేకపోయంది.
హీరో ఉన్న ఊరుని వదిలి అన్నయ్య ఉన్న ప్రాంతానికి వెళ్లడానికి కారణం తరచు అతను ఇతరులతో (నాయకులతో) గొడవపడటం అని చెప్పారు కానీ, దాన్ని పూర్తిగా కన్విన్సింగ్ స్థాయిలో చూపడంలో విఫలమయ్యారు. అలాగే ఈ చిత్రంలో ఏసీపీ ఇష్టంవచ్చినట్లు నచ్చని వాళ్లందరినీ లోపల వేయడం, మరీ అడ్డం వచ్చిన వాళ్లను ఎదురుకాల్పులు పేరిట అంతం చేసేయడం అన్నది సహజత్వానికి భిన్నంగా అనిపిస్తుంది. అదీ సంఘటనలు జరిగిన ప్రదేశం హైదరాబాద్ అని చెప్పడం -మరీ ఓవర్ అనిపిస్తుంది. అంతటి మహానగరంలో ఓ స్థాయి పోలీసు అధికారి చేసే పనుల సవ్యాపసవ్యాలు చూడడానికి పైస్థాయి పర్యవేక్షక అధికారులూ ఉంటారు. అదే విధంగా పోలీసుల ద్వారా వచ్చిన ఓ మానసిక వ్యాధి పీడితుడికి అలా మోతాదు మించిన మందులు తమ స్వప్రయోజనాలకోసం ఓ డాక్టరు ఇవ్వడం వంటివి ఇంతటి విచ్చలవిడి స్థాయిలో జరగవు. ఇలాంటి వ్యవస్థల విషయాన్ని ప్రస్తావించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గాలికి వదిలేసినట్టే అనిపిస్తుంది. ఇక నాయక పాత్ర అనన్య (రెజీనా)ను మెడిసిన్ చదువుతున్న విద్యార్థినిగా చూపారు. కనీసం ఆమె అయనా జరుగుతున్న వైద్యపర అనర్థాన్ని బలంగా అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం, కేవలం సంబంధిత డాక్టరు కసురు కసరడంతో చేష్టలుడిగిన వ్యక్తిలా చూపడం పూర్తిగా అసంబద్ధంగా అనిపించింది. పాత్రధారుల పెర్ఫార్మెన్సు విషయానికొస్తే నాయక పాత్రధారి నారా రోహిత్ పాత్రకు కావల్సిన షేడ్స్‌ను పలికించడానికి తన స్థాయిలో బానే చేశారు. అయితే ‘‘ఏపు’’గా పెరిగిన ఆయన శరీరం (చిత్రంలోనూ హీరో తల్లి ‘ఏపుగా పెరిగావు కానీ’... అన్న డైలాగునూ వాడుతుంది) పాత్రకు ఆడియన్స్‌ని కనెక్ట్ కాకుండా చేసింది. విద్యార్థి పాత్రలో రోహిత్‌ను చూడటానికి ప్రేక్షకుడు ఇబ్బంది పడక తప్పలేదు. రెజీనా పాత్ర పరిధి స్వల్పం. ఉన్నంతలో ఆమె అందులో ఒదిగిపోయారు. ఏసిపి పాత్రధారి జాన్ విజయ్ సినిమాలో లోపించిన కామెడీని పాత్ర ప్రధాన స్వభావమైన విలనిజంలో మేళవించి నటించిన ప్రయత్నం దాదాపు ఫలించింది. వీరి నటనలో గతంలో మనకు పరిచయమైన నటుడు కళాభవన్ మణి ఛాయలు కొన్ని కన్పించాయి. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజీవ్ పాత్రలో రాజీవ్ కనకాల తొలుత నిజాయితీ అధికారిగా, అనంతరం పరిస్థితుల ప్రేరణతో అవినీతికి పాల్పడే నైజానికి మారిపోవడం వంటి బేధాలు తన నటనలో చూపారు. హీరో తల్లి పాత్రధారిణి, పోలీసు అధికారిణి రాజేశ్వరి ప్రశంసనీయ నటనని ప్రదర్శించారు. సంభాషణల్లో ‘సమస్యల్ని చూసి పిరికివాడు భయపడతాడు. ధైర్యవంతుణ్ణి చూసి సమస్యలే భయపడతాయి’, ‘తెలుసుకోవాలనే తపనుంటే సాధ్యం కానిది ఏదీలేదు’ అన్నవి స్ఫూర్తివంతంగా ఉన్నాయి. అయితే ‘మందు’కోసం నీళ్లుతెస్తే మరెందుకో వాడాడు వంటి తృతీయశ్రేణి డైలాగ్స్ అభిరుచి లేమిని తెలియచేశాయి. సాయికార్తీక్ స్వరాల్లో ‘హరహర శివోం శంకరా...’ ఉత్తేజకరంగా సాగింది. ఈ పాటలో ‘పోరాడే నైజం పొందలేనిదేదీ? తలపులో కాగడా సత్యమై మండగా, కబళించే కల్మషాలు కాలిపోవా’ వంటి పదాలు బావున్నాయి. అయితే పాట చిత్రీకరణలో ఇదంతా ప్రతిఫలించలేదు. దాంతో పాటసారం ప్రేక్షకుల్లోకి వెళ్లలేదు. మొత్తానికి దర్శకుడు ఎంచుకున్న స్టోరీ థ్రెడ్‌లో కొత్తదనం లేకపోవడంతోపాటు, దాన్ని చూపిన తీరులోనైనా ఆసక్తికర విధానాన్ని అవలంభించక పోవడంతో ‘శంకర’తత్వం ఆడియన్స్‌కు అందలేదు.

- అనే్వషి