రివ్యూ

పూరీ మార్క్ మ్యాజిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు ** ఇజం

తారాగణం: కళ్యాణ్‌రామ్, అదితి ఆర్య,జగపతిబాబు, వెనె్నల కిషోర్, పోసాని కృష్ణమురళి, జయ్రపకాష్‌రెడ్డి, అలి, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్ తదితరులు.
సంగీతం: అనూప్ రూబెన్స్
కెమెరా: ముఖేష్ జి
నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్
దర్శకత్వం: పూరి జగన్నాథ్
**
దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాలంటే కాస్త భిన్నంగానే ఉంటాయి. ముఖ్యంగా అతని హీరోలు కొత్తగా కనిపిస్తారు. కాస్త హైపర్‌ను మెయిన్‌టెయిన్ చేస్తూ విలన్లను అటు డైలాగులతో, ఇటు దమ్ముతో దెబ్బకొట్టడం.. ఇదీ పూరీ మార్క్ మ్యాజిక్. ఇక కళ్యాణ్‌రామ్ సినిమా అంటే ఓ సాఫ్ట్ నేచర్ హీరోయజాన్ని చూస్తాం. అలాటి ఇద్దరి వ్యక్తుల విభిన్న వ్యక్తుల కలయికలో వచ్చిన సినిమా -ఇజం. వరుస పరాజయాలతో సతమతమవుతున్న పూరి జగన్నాథ్ హిట్‌కోసం చేసిన మరో ప్రయత్నమిది. పరాయ దేశాల్లో మూలుగుతున్న స్వదేశీ కరెన్సీ అవినీతిపై కళ్యాణ్‌రామ్‌ను ఎక్కుపెట్టి పూరీ చూపించిన నిజాలే -ఇజం.
సత్యమార్తాండ్ (కళ్యాణ్‌రామ్) ఓ బాధ్యతగల జర్నలిసు.్ట చిన్నతనంలోనే అతని కుటుంబం అన్యాయానికి గురవుతుంది. అటువంటి ఇబ్బందుల్లో పెరిగిన మార్తాండ్, ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలు, దోపిడీ, నిరుపేద రైతులు కష్టాలకు చలించిపోతాడు. వాటికి కారణమైన రాజకీయ నేతలు, అక్రమార్కులు పరాయ దేశాలకు తరలిస్తున్న బ్లాక్‌మనీ కారణమని అర్థం చేసుకుంటాడు. బ్లాక్‌మనీని ఇండియాకి తెచ్చి, పేదవాళ్లకు పంచాలని నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ జావేద్ భాయ్ (జగపతిబాబు)ను టార్గెట్ చేస్తాడు. ఈ మిషన్‌తో బయలుదేరి హీరో మార్తాండ్, డాన్ జావేద్ భాయ్‌కి ఎలా దగ్గరయ్యాడు? అతని ద్వారా విదేశాల్లో అక్రమార్కులు దాచుకున్న బ్లాక్ మనీని ఎలా కొల్లగొట్టాడు? దాన్ని పేదలకు పంచాడా? అవినీతిపరుల జాబితాను బహిర్గతం చేసేందుకు ఆరంభించిన వెబ్‌సైట్, దానిద్వారా సమాజంలోని అవినీతిని ఎలా బయటపెట్టాడన్నది మిగతా సినిమా. వికీలీక్స్ బ్యాక్‌డ్రాప్ లైన్ తీసుకుని -హీరో మార్తాండ్ డిజైన్ చేసిన వెబ్‌సైట్ ఎప్పుడు ఎవరి భండారం బయటపెడుతుందోనని అక్రమార్కులు వణుకుతుంటారు. హీరో ఇదంతా చేయడానికి చిన్నతనంలో అతన్ని ప్రభావితం చేసిన బలమైన సంఘటన ఏమిటన్నది సస్పెన్స్.
కళ్యాణ్‌రామ్ గత చిత్రాల్లో కన్నా ఇజంలో కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. డైలాగ్ డెలివరీ, మ్యానరిజం, ఎమోషనల్ సన్నివేశాల్లో అతని పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. న్యూ స్టయల్ మేకోవర్‌తో కళ్యాణ్‌కు పూరీ ఇచ్చిన ఫ్రెష్‌నెస్ బావుంది. సినిమా తొలి సగమంతా హీరో పాత్ర ఎలివేషన్, పెర్ఫార్మెన్స్‌తోనే సాగిపోతుంది. సెకండాఫ్‌లో ప్రీక్లైమాక్స్ ఎపిసోడ్ ఇజానికి హైలెట్. ఆ సన్నివేశానికి పూరీ రాసుకున్న సంభాషణలు ఆడియన్స్‌ను వెంటాడతాయ. ఫస్ట్ఫాలో జగపతిబాబుకి, కళ్యాణ్‌రామ్‌కి బీడీ స్నేహం, హీరోయిన్ అతిథి ఆర్యతో లవ్ సన్నివేశాలు ఓకే. పాటలు సందర్భానుసారంగా వచ్చి, మంచి ఫీల్‌ని ఇచ్చాయ. దర్శకుడు పూరీ పాడిన పాట ఇజానికి అదనపు హైలెట్.
హీరో కళ్యాణ్‌రామ్ నుంచి తనకు కావాల్సిందేదో రాబట్టడంలో దర్శకుడిగా పూరీ సక్సెస్ అయ్యాడు. అతడిని కొత్తగా చూపించడంనుంచే ఆడియన్స్‌కు కనెక్ట్ చేయగలిగాడు. బ్లాక్‌మనీ మీద పూరీ పేల్చిన డైలాగులు, నల్లధనాన్ని వెనక్కి తెప్పించే ప్రక్రియ కోసం డిజైన్ చేసిన సన్నివేశాలు రియలిస్టిక్‌గా ఉన్నాయ. చివర్లో జగపతిబాబు పాత్రకిచ్చిన జడ్జిమెంట్ ఆమోదయోగ్యం కాదు. అనూప్ సంగీతం ఓకే. ముఖేష్ కెమెరా పనితనం కనిపించింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచాయి.
ది గ్రాండ్ లీకేజ్ పేరుతో వెబ్‌సైట్ రన్ చేసే హీరో ఫారిన్‌లో బ్యాంక్ ఆఫ్ ప్యారడైజ్‌లో ఎవరెవరు ఎంతెంత నల్లధనాన్ని కూడబెట్టారనే వివరాలు సేకరించడానికి ఆ బ్యాంక్ నడుపుతున్న జావీద్ కూతురుతో పరిచయం పెంచుకోవడం, తద్వారా బ్యాంక్‌కు సంబంధించిన అకౌంట్స్‌ని హ్యాక్ చేయడం, అందులో ఉన్న లక్షల కోట్ల రూపాయలను భారతదేశంలోని పేదవారి అకౌంట్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయడం ఇవన్నీ హీరోకి అనుకూలంగా జరిగిపోతాయి. హీరో చేస్తున్నది కరెక్టే అయినా విధానం తప్పని భావించిన పోలీసులు ఎప్పటిలాగే అతణ్ణి అరెస్టు చేస్తారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కమిటీ ముందు తాను అలా ఎందుకు చేయవలసి వచ్చిందన్నది వివరిస్తాడు. ఈ సన్నివేశాలను పూరీ తనదైన స్టయల్‌లో డిజైన్ చేసినా, ఆడియన్స్‌కు ఆశించినంత థ్రిల్ దొరకలేదు. కథలోకి వెళ్లడానికే తొలి సగమంతా తీసుకోవడంతో కాస్త బోర్ ఫీలవుతాం. కోర్టు సీన్‌తో సినిమా పూర్తయిందనుకున్నా, మరికాస్త సాగదీశాడు పూరీ. కోర్టు సన్నివేశాల్లో కళ్యాణ్‌రామ్ నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బ్లాక్‌మనీపై జనంలో ఆసక్తి పెంచిన వికీలీక్స్ సారాంశాన్ని సినిమాటిక్ మెలోడ్రామాకు వౌల్డ్ చేసి, ఫార్మాట్ ఫ్రేమ్ దాటిపోకుండా పూరీ చేసిన మ్యాజిక్కే -ఇజం.

- త్రివేది