రివ్యూ

కష్టం 840! ( * మిస్టర్-420)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం: వరుణ్ సందేష్, ప్రియాంకా భరద్వాజ, అజయ్‌ఘోష్, షాయాజీ షిండే, జీవా, పృథ్వీ, రఘుబాబు, సూర్య.
సంగీతం: రియాన్ ముస్త్ఫా,
నిర్మాత: హరికుమార్‌రెడ్డి, గజ్జెల
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.ఎస్.రవికుమార్

‘ఏ నిమిషానికి ఏమి జరుగుతునో ఎవరూహించగలరు’... అన్న పాత ‘లవకుశ’ చిత్రంలోని పాట ఠక్కున ‘మిస్టర్ 420’ చిత్రం చూస్తే గుర్తుకొస్తుంది. అదెలా అంటే ఏ సీను తర్వాత ఏ సీను వస్తుందో, చిత్రంలోని అంశాలు ఎలా ఎలా మళ్లుతాయో అన్నది ఓ పద్ధతి లేకుండా సాగిపోతాయిందులో. (అన్నట్లు కొత్త ‘లవకుశ’లో నాయకుడు ఈ చిత్రం హీరో వరుణ్ సందేష్ కావడం గమనార్హం). వాస్తవానికి కథ అనేది ఇందులో పెద్దేంలేదు. తన తండ్రినీ, తల్లినీ అంతమొందించిన ప్రతి నాయకునిపై నాయకుడు ఏ విధానాలు అవలంభించింది పగ తీర్చుకున్నాడన్నది కేంద్ర కథాంశం. ఇలాంటి కథలతో ఇప్పటికే కుప్పలు తెప్పలుగా సినిమాలు వచ్చాశాయి. పోనీ తెలిసిన కథని తెలియని కథనంతో దర్శకుడు రవికుమార్ ‘మిస్టర్ 420’ నడిపించాడా? అంటే అక్కడా ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. ఎంచుకున్న కథ ప్రకారం శేషాద్రి (షాయాజీషిండే) ప్రభుత్వాలనే గడగడ లాడించే కాంట్రాక్టరు, మంచినీళ్ల ప్రాయంగా మర్డర్స్ చేసేసే వ్యక్తి. అలాంటిది ఛోటామోటా దొంగతనాలు చేసే అవినాష్ (వరుణ్ సందేష్), తన కూతురు ఐశ్వర్య (ప్రియాంకా భరద్వాజ)ను కిడ్నాప్ చేసి పారిపోతే ఏమీ చేయలేని అశక్తుడిగా ఇంకొకరిపై ఆధారపడతాడు. అలాగే నాయకుని తల్లిదండ్రుల్ని చాలా ఈజీగా ఖతమ్ చేసేసిన ఘన చరిత్ర గల్గిన స్థాయిలో మర్రి ఊడల బంగారపు (అజయ్‌ఘోష్)ను ఒక వైపు చూపుతూ, మరోవైపు హీరో ఫ్రెండ్స్ వాళ్లని పైకి ఆకాశంలో చూడమని చెప్తే చూసేవాళ్లుగా చిత్రించడం అత్యంత హాస్యాస్పదం. యుఎస్‌లో చదువుకునే అమ్మాయి అంత సులభంగా కిడ్నాప్ ట్రాప్‌లో పడటం, బేలగా రోజులు తరబడి ఉండటం మరీ విచిత్రం. ఇలాంటి సన్నివేశాలే సినిమా అంతా కనిపించటంతో ప్రేక్షకుడికి బోర్ కొట్టింది. అనుకోని సన్నివేశాన్ని ఎలాగో అలాగ పట్టాలెక్కించి నడిపేసే హడావిడితనమే కనిపించింది. తన కిడ్నాప్‌నకు ముందే తండ్రి వికృత రూపాన్నీ, అక్కడ జరుగుతున్న విషయాన్నీ తెలుసుకున్న హీరోయన్ కనీసం తన జాగ్రత్తలో తను ఉంన్నట్టు చూపించకపోవడం.. అతి ప్రాథమిక స్థాయిలోనే దర్శకుడు సన్నివేశాలు చుట్టేశాడన్న విషయం అర్థమైపోతుంది. అంతకుముందు లవర్‌బోయ్ ఇమేజ్ ఉన్న వరుణ్ సందేష్ తర్వాత మాస్ మేజిక్ బాట పట్టాడు. ఈ సినిమాలో ఆ రెండూ మిళితం చేద్దామని ప్రయత్నించి తెరపై పేలవమైపోయాడు. కథానాయక ప్రియాంకా భరద్వాజ్ విడిగా బానే ఉన్నా నాయకునితో కెమిస్ట్రీ కుదరక ఆమె చేసిన అభినయ ప్రయత్నాలేవీ ఫలించలేదు. అజయ్‌ఘోష్ తన బ్రాండ్ గుండుతో చిత్రంలో బంగారప్ప పాత్రలో కనిపించారు. నాయిక తండ్రి పాత్రలో షాయాజీషిండే, దుబాయ్ దామోదరంగా పృథ్వీ, పోలీస్ అధికారిగా జీవా అలవాటైన రీతుల్లో నటించేశారు. ‘వీడు మంచోడో కాదో తెలియదు కానీ చెడ్డోడు మాత్రం కాదు..’, ‘నువ్వెవరో నీకే తెలియనపుడు నాకెలా తెలుస్తుంది’ వంటి డైలాగ్స్‌తో సంభాషణాకర్త తన ఉనికిని తెలుపుకుందామని ప్రయత్నించారు.
‘సోనా సోనా’ పాటలో కాస్తంత వెరైటీనివ్వడానికి మ్యూజిక్ డైరెక్టర్ ముస్త్ఫా ప్రయత్నం చేశారు. అంతకన్నా ‘లేత లేత ముంజకాయ్... అయ్యో రామా ఏమి చేయను’ అన్నది చక్కటి జానపద రీతిలో ఉండి అలరించింది. ఈ పాటకేర్పరిచిన నృత్య భంగిమలు కూడా ఆకట్టుకున్నాయి. ఏది ఎలాఉన్నా చిత్ర బృందం చేసిన మంచి పనేమిటంటే విషయం లేని కథ, కథనాల్ని ఊరికే పొడిగించేసి ఇంకా ఆడియన్స్‌ని ఇబ్బంది పెట్టకుండా సినిమాను కేవలం గంటా ఏభైరెండు నిమిషాల్లో ముగించేయడం.

-సంకల్ప