రివ్యూ

ఆత్మల కట్టుకథ ( **కాష్మోరా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం:
కార్తీ, నయనతార, శ్రీదివ్య, వివేక్, సిద్ధార్థ విపిన్, జాన్‌గిరి మధుమిత మధుసూదన్‌రావు తదితరులు
సంగీతం: సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్
ఎడిటింగ్: సాబు జోసెఫ్
ఆర్ట్: రాజీవన్
నిర్మాత: ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు
దర్శకత్వం: గోకుల్

తమిళ హీరోలు అప్పటినుండి ఇప్పటివరకు తెలుగు మార్కెట్‌పై పట్టు సాధించడం మనం చూస్తున్నదే. రజనీకాంత్ మొదలుకొని.. నేటి జై వరకు అందరు తెలుగు ప్రేక్షకులనూ మెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక హీరో కార్తీ మాత్రం తెలుగు బాగానేర్చుకుని, తెలుగు సినిమాల్లోనూ నటిస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తాజాగా హారర్ ఎలిమెంట్‌కు రకరకాల అంశాలు మిక్స్‌చేసి ఆడియన్స్ ముందుకొచ్చాడు. గోకుల్ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రమే కాష్మోరా. నేటి పరిస్థితులతోపాటు ఓ ఫాంటసీ అంశాన్ని కలగలిపి భారీ గ్రాఫిక్స్‌తో రూపొందించిన సినిమాలో అసలు కాష్మోరా ఎవరు? అన్న ఆసక్తిని రేకెత్తించడంతోనే అసలు కథ ఆరంభమైంది.
తనకు అతీంద్రియ శక్తులు వున్నాయని, అందుకే తనకు ఆ పేరు పెట్టారని జనాన్ని నమ్మిస్తాడు కాష్మోరా (కార్తీ). ఆత్మలతో మాట్లాడడం, అవి తమ ఇంట్లో వున్నాయని ఎవరైనా చెప్తే వాటిని అక్కడినుంచి తరిమెయ్యడం చేస్తుంటాడు. నిజానికి సమస్యను తనే క్రియేట్ చేసి తనే సాల్వ్ చేస్తుండటం హీరో యాక్టివిటీ. ఆత్మల విద్యలో ఆరితేరిపోయ ప్రజల్లో మంచి పేరుతెచ్చుకుంటాడు కాష్మోరా. టీవీల్లో ప్రోగ్రామ్స్ చెయ్యడం ద్వారా కోట్లాది మందికి అతను సుపరిచితుడు. మరోపక్క యామిని (శ్రీదివ్య) దెయ్యాలపై రీసెర్చ్ చేస్తున్నానంటూ కాష్మోరా అసిస్టెంట్‌గా చేరుతుంది. ప్రజల మూఢ నమ్మకాలపై సొమ్ముచేసుకుంటున్న కాష్మోరా, అతని కుటుంబం గుట్టుబయట పెట్టడానికి అతని దగ్గరకు వస్తుంది. తమ ఊళ్ళోని పాడుబడిన ప్యాలెస్‌లో దెయ్యాలు వున్నాయని, వాటిని వెలుగులోకి పంపించాలని, దానికి ఎంత డబ్బయినా ఇస్తానని ఓ వ్యక్తి కాష్మోరాతో డీల్ కుదుర్చుకుంటాడు. అక్కడికి వెళ్లిన కాష్మోరా ఆ ప్యాలెస్‌లో ఇరుక్కుంటాడు. తర్వాత అతని కుటుంబీకులూ అక్కడికి చేరతారు. వారితో యామిని కూడా వస్తుంది. వీరందరిని బంధించింది ఎవరు? అసలు ఎన్నో ఏళ్ల క్రితం చనిపోయిన రాజనాయక్ (కార్తీ)కి, ఇప్పుడున్న కాష్మోరాకు ఉన్న సంబంధమేమిటి? మధ్యలో ప్యాలెస్‌లోవున్న రత్నమహాదేవి (నయనతార) ఎవరు? ప్యాలెస్‌లో ఇరుక్కున్న కాష్మోరా ఫ్యామిలీని కాపాడుకున్నాడా? అన్న ప్రశ్నలకు సమాధానాలు మిగిలిన సినిమా.
కాష్మోరా, రాజనాయక్‌గా రెండు విభిన్న పాత్రల్లో కార్తీ నటన బావుంది. ముఖ్యంగా రాజనాయక్ ఆత్మగా చిత్రమైన గెటప్‌లో కార్తీ ఆకట్టుకున్నాడు. పెర్‌ఫార్మెన్స్ పరంగా కార్తీకి ఈ సినిమా ది బెస్ట్. శ్రీదివ్య చేసిన క్యారెక్టర్‌కి సినిమాలో అంత ప్రాధాన్యత లేదు. రత్నమహాదేవిగా నయనతార కనిపించేది కాసేపే అయినా తన పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. నయనతార గ్లామర్, రాజసం సినిమాకు కొత్త హంగునిచ్చింది. చాలాకాలం తర్వాత కమెడియన్ వివేక్ మళ్ళీ తన పంచ్ డైలాగ్స్‌తో నవ్వించాడు. మిగతావన్నీ వచ్చిపోయే పాత్రలే.
సాంకేతికంగా ఓంప్రకాష్ ఫొటోగ్రఫీ ఆడియన్స్‌కి విజువల్ ఫీస్ట్ చేసింది. సన్నివేశాలను గ్రాండ్‌గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్‌లోని ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. సిజెలోనే ఎక్కువ సన్నివేశాలు నడవటంతో, కొన్ని సన్నివేశాలు గ్రాఫిక్‌లో చేసినట్టు క్లియర్‌గా తెలిసిపోవడం ఒక లోపం. సినిమాలో పాటలు తక్కువే అయినా, వాటికీ ఆకట్టుకునే బాణీలు ఇవ్వలేకపోయాడు సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో మాత్రం ఫర్వాలేదు అనిపించాడు. మేకింగ్‌పరంగా సినిమా చాలా రిచ్‌గా కనిపిస్తుంది. డైరెక్టర్ గోకుల్ రాసుకున్న కథలో కామన్ ఆడియన్‌కి అర్ధంకాని విషయాలే ఎక్కవ ఉన్నాయ. కొన్ని లాజిక్ లేని ఎపిసోడ్స్ కన్ఫ్యూజ్ చేస్తాయ. వెయ్యి ఆత్మలని ఒకేసారి వెలుగులోకి పంపించే ప్రక్రియతో గిన్నిస్ రికార్డు సృష్టించడానికి కాష్మోరా రెడీ అవడం హాస్యాస్పదం అనిపిస్తుంది. బ్లాక్ మేజిక్, దెయ్యాలు, భూతాలు వంటి సబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని దానికి ఎక్కువ భాగం కామెడీని జోడించి నడిపించాలని చూశారు. అయితే అది ఫస్ట్‌హాఫ్‌లో వర్కవుట్ అయనా, సెకండాఫ్‌కి వచ్చేసరికి సినిమా నిడివి పెరిగి బోర్ కొట్టేసింది. రొటీన్ జానర్లో సాగే సినిమాలకు భిన్నంగా హారర్ కామెడీ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ జానర్లో ఉండే సినిమా కాష్మోరా. ఫస్ట్ఫా ఓపెనింగ్, ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్, సెకండాఫ్ ఫాంటసీ ప్లాష్‌బ్యాక్‌లో సాగే కొన్ని సన్నివేశాలు, హీరో కార్తీ నటన సినిమాకు ప్లస్ పాయింట్లు. సెకండాఫ్‌లో ఎక్కువ రన్‌టైమ్, ఫోంటసీ ఫ్లాష్‌బ్యాక్‌లో బలహీనంగా నడిచే కథ, రిపీటెడ్ సన్నివేశాలు, మధ్యలో వచ్చే పాటలు, హారర్ పూర్తిగా మిస్సవడం.. మైనస్ పాయింట్స్.

-త్రివేది