రివ్యూ

చల్.. చలాకీ గుఱ్ఱం! ( ** చల్ చల్ గుఱ్ఱం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం:
శైలేష్ బొలిశెట్టి, దీక్షాపంత్, అంగనారాయ్, నాగబాబు, బెనర్జి,
సినిమాటోగ్రఫీ: శ్యాంప్రసాద్.వి.
సంగీతం: వెంగీ
నిర్మాత: ఎం.రాఘవయ్య
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: మోహన ప్రసాద్

రేసర్‌గా తన అభిరుచిని సంతృప్తి పర్చుకుని, సిల్వర్ స్క్రీన్‌మీద ఆర్టిస్ట్‌గా ప్రూవ్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు -శైలేష్ బొలిశెట్టి. రెండేళ్ల క్రితం వచ్చిన ముకుందా చిత్రంలో హీరో వరుణ్‌తేజ్‌కు స్నేహితుడిగా కథను మలుపుతిప్పే పాత్ర పోషించిన అనుభవంతో -ఇప్పుడు హీరోగా ఓ చిత్రం చేశాడు. మంచి ఆలోచనలతో భగీరథ ప్రయత్నం చేసి, సొసైటీలో మంచిని పెంచడానికి ప్రయత్నించిన ఓ చలాకీ కుర్రాడి కథే -చల్ చల్ గుఱ్ఱం!
***
మనోహర్ (శైలేష్ బొలిశెట్టి) ఓ ఉద్యోగి. ఒకే భవంతిలో సాగే రెండు కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తుంటాడు. సన్ కంపెనీలో పగటి ఉద్యోగం. లూనార్ కంపెనీలో రాత్రి ఉద్యోగం. రెండూ సాఫ్ట్‌వేర్ కంపెనీలే. ఒకరికి తెలియకుండా మరొకరి దగ్గర పని చేస్తుండటం -ట్విస్ట్ పాయంట్. పగలు రాత్రీ తేడా లేకుండా నిరంతరం చల్ చల్ గుఱ్ఱంలాగా పరిగెడుతూ -ఎవరికీ అనుమానం రాకుండా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటాడు. మధ్య మధ్యలో కొందరికి అతనిపై అనుమానం కలిగినా, వారికున్న చిన్న చిన్న బలహీనతలపై గేమ్ ప్లే చేస్తూ, నోరెత్తకుండా చేస్తుంటాడు. ఇదీ కథానాయకుడి క్యారెక్టరైజేషన్. ఒకే వ్యక్తి రెండు కంపెనీల్లో ఉద్యోగం చేస్తూ, రెండు జీతాలను అందుకోవడంలో అక్కడక్కడా ఇబ్బందులు ఎదురౌతాయి. వాటన్నింటినీ సమయస్ఫూర్తి, తెలివితేటలతో అధిగమిస్తూ ప్రయాణాన్ని సాఫీగానే సాగిస్తుంటాడు. చివరికి లేబర్ కమిషనర్ ఈ సంగతిని గుర్తించి మనోహర్‌ను ప్రశ్నిస్తాడు. మనోహర్ అలా ఎందుకు చేస్తున్నాడో అర్థం చేసుకున్న రెండు కంపెనీల యజమానులూ, అతను తమ కంపెనీలలో ఉద్యోగి కాదని, అతనూ తమ వ్యాపారంలో భాగస్థుడేనని పత్రాలను చూపుతారు. మనోహర్ తమ ఉద్యోగి కాదని, భాగస్వామి అంటూ రెండు కంపెనీల యజమానులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్పడానికిగల కారణమేమిటి? వారిద్దరినీ ఆకట్టుకున్న కథానాయకుడి గతం ఏమిటి? అన్న ట్విస్టులకు సమాధానంగా మిగతా సినిమా నడుస్తుంది. ఒక కంపెనీలో తాను ప్రేమించిన చిన్నది.. మరో కంపెనీలో తనను ప్రేమిస్తున్న అమ్మాయ. వీరిద్దరిమధ్య సతమతమయ్యే హీరోగా సినిమాలో వచ్చే సన్నివేశాలు ఇప్పటికే చాలా చిత్రాల్లో చూసినా కాస్త వైవిధ్యం అనిపిస్తాయ.
సినిమా మొదటినుండీ -హీరో మనోగతాన్ని ఆవిష్కరించకుండా అతను చేసే అల్లరి వెనుక ఏదో బలమైన కారణం వుందనేలా చిత్రీకరణ సాగడం సినిమాకు ప్లస్ పాయంట్. రెండు కంపెనీలకూ ఒకేసారి వార్షికోత్సవం రావడంతో -వాటిని నిర్వహించే సమయంలో హీరో దొరికిపోతాడనే అనుకుంటాం. ఆ సంగతి బయటపడే సమయంలో -‘బ్రేక్ ఇచ్చి’ సినిమాను కొత్త ట్విస్ట్‌తో ఆసక్తిగా నడిపించారు. సినిమా కథల పిచ్చితో రగిలిపోయే సుడిగాలి సుధీర్, వి.వి.వినాయక్ సినిమాల్లోని ఫైట్ సన్నివేశాలు, డైలాగ్స్ ఎలా వుంటాయో మక్కికి చూపడంలాంటి కామెడీకి మంచి మార్కులే పడ్డాయ. కథలో అసలైన పాయింట్ రాజారామ్ (నాగబాబు), లంకేశ్ (ముఫ్తార్‌ఖాన్)ల కథనం. కార్పొరేట్ కంపెనీలు చూడడానికి అద్దాల మహల్‌లా కనిపిస్తాయి. కానీ దాని వెనుకనున్న చీకటి గుహల మర్మాలను వివరించే ప్రయత్నం సినిమాలో బావుంది.
హీరోయిన్లుగా దీక్షాపంత్, అంగనారాయ్ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. సినిమాకు గ్లామర్ టచ్ ఇవ్వడంలో ఇద్దరూ ఓకే అనిపించుకున్నారు. చిత్రంలో దాదాపు 40 పాత్రలు కనిపించినా, ఒక పాత్రకీ మరో పాత్రకీ ఎలాంటి సంబంధం లేకుండా స్క్రీన్‌ప్లే డిజైన్ చేయడం ఆసక్తికరం. పాత్రలన్నీ వేటికవే స్వతంత్రంగా వ్యవహరించటంతో కథనంలో వైవిధ్యం కనబడింది. నటనపరంగా కథానాయకుడు శైలేష్ మరికొంత శ్రమించాలి.
కెమెరా పనితనం చిత్రానికి ప్లస్. ప్రతి సన్నివేశం మోడరన్ పెయింట్‌లా వెండితెరపై దిద్దే ప్రయత్నం చేసింది. సంగీత దర్శకుడు వెంగీ అందించిన ‘మాయే- అమ్మాయే- హాయే ఇటు రాయే’, ‘అరెరె.. ఈ మాయే బాగుందే, నీవైపే లాగిందే’ బాణీలు బావున్నాయ. నేపథ్య సంగీతం సన్నివేశాలకు బలం చేకూర్చేలా ఉంది. ‘ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్లే.. ప్రయత్నించకుండా మరణిస్తే ఓడిపోయినట్లే’ లాంటి సంభాషణలు కొన్నిచోట్ల ఆకట్టుకుంటాయి. ‘విజయం అంటే సమయం’ అనే కొత్త సూత్రాన్ని దౌడు తీసే గుఱ్ఱం చెప్పింది. దర్శకత్వపరంగా సన్నివేశాలను రిచ్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

................................................................................................................
**** చాలా బాగుంది *** బాగుంది ** ఫర్వాలేదు * బాగోలేదు

-సరయు