రివ్యూ

మంచులో ముంచేశాడు! ( * శివాయ్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం:
అజయ్ దేవ్‌గన్, ఎరికా కార్, అబిగెయిల్ తదితరులు
సంగీతం:
మిథున్
సినిమాటోగ్రఫీ:
అసీం బజాజ్
నిర్మాత, దర్శకత్వం:
అజయ్ దేవ్‌గన్
కథానాయిక క్లైమాక్స్‌లో ఓ మాట అంటుంది. ‘నువ్వేం చెబుతున్నావో నాకు అర్థం కావటంలేదు’ - సరిగ్గా ప్రేక్షకుల మాట కూడా ఇదే. కథ ఆఖరి అంకం చేరినా.. కథేంటో? దాని స్వరూప స్వభావాలేమిటో? ఏళ్ల నాటి చరిత్ర ఏమిటో? ఎక్కడ్నుంచీ వారి పయనం మొదలవుతుందో? ఏ తీరానికి చేరుతుందో? ఆ కార్ల ఛేజింగ్ లేమిటో? ఆ ఫైటింగ్ లేమిటో? ఒక్క ముక్క అర్థం కాకపోయినా.. ఆయా సన్నివేశాలన్నీ ఏదో కృతకంగా.. ఎప్పుడూ చూడని ‘వ్యూ’లోంచి కనిపిస్తూ- ఆయా పాత్రల్లోకి జొరబడనీయకుండా.. మనల్ని గందరగోళ పెడుతూ.. - హిమాలయ పర్వత అంచుల్లోంచి పాతాళంలోకి తోసేస్తున్న ఫీలింగ్. కేవలం 3డి ఎఫెక్ట్స్‌తోనే సినిమాని నడిపించి ‘మంచు సెగ’ పుట్టిద్దామనుకొంటే- కాస్తంత అర్థవంతమైన కథ ఉండాలన్న సూత్రాన్ని ఎక్కడికక్కడ వదిలేసి.. ఎటు నుంచి ఎటు వెళ్తున్నారో అర్థం కాకపోవడంతో ఆ హిమాలయాలపై ప్రేక్షకుణ్ణి త్రిశంకు స్వర్గంలో పడేసిన భావన. ఏరియల్ షాట్స్‌తో శిఖరంపై నుంచీ చూస్తే కళ్లు బైర్లు కమ్మటం ఖాయం. ఇదీ శివాయ్ సినిమా కథ.
-శివాయ్ (అజయ్ దేవ్‌గన్) వౌంటెనీరింగ్ మిషన్‌లో కొంతమంది కాలేజీ స్టూడెంట్స్ చేరతారు. వారిలో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన బల్గేరియన్ అమ్మాయి ఓల్గా (ఎరికా కార్) ఒకరు. వీరిద్దరి మధ్య ఓ మెరపు మెరసి ఓ సాయం సంధ్య వేళ ప్రేమ చిగురిస్తుంది. ఓ సందర్భంలో ‘శివాయ్’ లేదా (ఇంగ్లీష్‌లో చివరికి ‘వై’ అని వస్తుంది) ‘శివయ్య’ అంటే ఆ పరమేశ్వరుడికి నువ్వు ప్రతిరూపమా? అని ప్రశ్నిస్తుంది. ఆమె అడిగే ప్రశ్నలన్నిటికీ ‘్ఫలిక్’ సింబల్స్ ద్వారానే సంకేతాలను అందిస్తూంటాడు. అంటే- ఏమిటో ఆఖరికి హీరోయిన్‌కి అర్థమయినా కాకపోయినా -శివ ప్రేమలో పడుతుంది. వారి ప్రేమకు సాక్షీభూతంగా ఓ పాప పుట్టింత్తర్వాత -అతణ్ణి విడిచిపెట్టి బల్గేరియా వెళ్లిపోతుంది ఓల్గా. కుటుంబ వ్యవస్థ పట్ల ఆమెకి అంతగా ఆసక్తి ఉన్నట్టు కనిపించకపోవటమే కారణం. కొన్నాళ్ల తర్వాత తండ్రీ కూతుళ్లు బల్గేరియాలోని ఓల్గాని కలుసుకొనేందుకు బయల్దేరతారు. అసలు ఓల్గా ఎవరు? ఆమె ఇండియా రావటం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? ఆ అనే్వషణలో ‘శివ’ ఎదుర్కొన్న సమస్యలేమిటి? కూతుర్ని దక్కించుకొంటూ ఓల్గాని పరిశోధించే ప్రయత్నంలో ఎదురైన సవాళ్లేమిటి? అన్నది క్లైమాక్స్.
అజయ్ దేవ్‌గన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ అందామా? అంటే -అన్ని ఫైటింగ్స్ ఏదో ఆర్ట్ఫిషియల్‌గా.. మెలోడ్రామాలా అనిపిస్తూ.. వైర్ వర్క్‌తో ఫైట్స్ గట్రా చేసినట్టు.. గ్రాఫిక్స్‌తో కథని మసిపూసి మారేడు కాయ చేసినట్టు.. స్పష్టాతిస్పష్టంగా తెలిసిపోతూనే ఉంటుంది. ఇన్ని ఫైటింగ్ సినిమాలు చూసింత్తర్వాత ఈ సినిమాలో కొత్తదనం కోసం అనే్వషించటం వృధా అనిపిస్తుంది. కాకపోతే- కెమెరా పనితనం వల్ల కథలోని లోపాలన్నీ తెగ్గొట్టేసినట్టే. ఇక- ఫాంటసీ థ్రిల్లర్ అందామా? అంటే -కథలో మరీ అంత ‘డెప్త్’కి వెళ్తే అర్థం కావటం కష్టం.
ఓ మంచు శిఖరాగ్రాన వొంటి మీద -ప్యాంట్‌తో.. వీపుపై ఆ పరమేశ్వరుని తాలూకు చిహ్నాలతో పడుకొని ఉన్న ‘శివ’ని చక్కగానే ఆవిష్కరించి కథలోకి వెళ్లటం వరకూ ఓకే. కానీ అక్కడ్నుంచీ కథ అనేకానేక మలుపులు తిరిగి ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్లి.. ఆనక -క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఏ అంశం గురించి చెప్పాడన్నది ప్రశ్నార్థకం. హిమాలయ అందాలను తన కెమెరా వర్క్‌తో మరింత అందంగా చూపించిన అసీం బజాజ్ ఎక్కువ మార్కులు కొట్టేస్తాడు. అజయ్ దేవ్‌గన్ అన్నీ తానై.. ప్రయత్నపూర్వకంగా సినిమాని చాలావరకూ నడిపించాడు. ప్రేక్షకుణ్ణి ఎక్కడా ఆలోచించుకునే అవకాశాన్ని ఇవ్వలేదు. సన్నివేశాలన్నీ వేగంగా వచ్చి వెళ్లిపోతూంటాయి. మిథున్ చక్కటి సంగీతాన్ని అందించాడు. కథాపరంగా -మరీ లెంగ్త్ అయిపోవటంతో.. సెకండ్ హాఫ్ నుంచీ బోర్ మొదలవుతుంది. ఎప్పటికి సినిమా ముగుస్తుందా? అని.
నటనాపరంగా- ఆయా పాత్రల పరిధి మేరకు ప్రతి ఒక్కరూ నటించారు. యాక్షన్.. ఫైటింగ్స్ గట్రా అభిమానులను అలరిస్తాయి కానీ.. అదీ కొద్దిసేపే. సాగతీత కారణంగా అవీ బోర్ కొట్టేస్తాయి.

................................................................................................................
**** చాలా బాగుంది *** బాగుంది ** ఫర్వాలేదు * బాగోలేదు

-బిఎన్కే