రివ్యూ

రీమేక్ రాక్షసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** పిల్ల రాక్షసి
**
తారాగణం: సారా అర్జున్, సన్నివాయ్‌నే, లియోనా లిషాయ్, జాన్‌కైప్పాల్లి, సిద్ధికీ, అజువర్గీస్, అతిథి పాత్రలో దుల్కర్ సల్మాన్, సంగీతం: షాన్ రెహమాన్
సినిమాటోగ్రఫీ: విష్ణుశర్మ
మాటలు, పాటలు: భాషాశ్రీ
నిర్మాత: చదలవాడ పద్మావతి
దర్శకత్వం: మిథున్ మాన్యుల్ థామస్
**
వైవిధ్యమైన కథా కథనాలతో వస్తున్న పర భాషా చిత్రాల హక్కులను తీసుకుని -తెలుగు స్టార్ హీరోలే రీమేక్‌లు చేసుకుంటున్న సీజనిది. ఇక తమిళ, మలయాళ భాషల్లో వస్తున్న చిన్న చిత్రాల్లో -తెలుగుదనానికి దగ్గరగా అనిపించే కథాచాయలున్న చిత్రాలను ఎంచుకుని తెలుగులోకి అనువదించి అందించే ప్రయత్నాలూ ఇటీవల తెలుగు ఇండస్ట్రీల్లో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అలాంటి ప్రయత్నంలో -బిచ్చగాడు అనువాద చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండించటంతో -మరో మలయాళ చిత్రం ‘ఆన్ మరియు కప్పిలాను’ తీసుకుని ‘పిల్లరాక్షసి’గా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేశారు. గత ఏడాది రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి ‘దాగుడుమూత దండాకోర్’ ఆడిన సారా అర్జున్ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో -ఆమె ప్రధాన పాత్రగా చేసిన చిత్రాన్ని నిర్మాతలు అనువాదంగా తీసుకురావడం గమనార్హం.
**
ఫోర్త్ స్టాండర్డ్ చదువుతున్న అనన్య (సారా అర్జున్)కు తండ్రి అంటే చాలా ఇష్టం. నాన్న అడిగాడు కనుక -స్పోర్ట్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించి అతని ముచ్చట తీర్చాలనుకుంటుంది. ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్‌లో లాంగ్‌లో సత్తా చూపించాలనుకునే సమయంలో -ఉద్దేశపూర్వకంగానే పీటీ మాస్టర్ డేవిడ్ (జాన్ కైప్పాల్లి) ఆమెను ఫౌల్ చేస్తాడు. దాంతో అనన్య పసి మనసులో పీటీ సార్ డేవిడ్ మీద ద్వేషం పెరుగుతుంది. తెలిసీ తెలియని పసి వయసుతో -పీటీ సార్ మీద కక్ష తీర్చుకోవాలనుకుంటుంది. కిరాయిరౌడీలతో డేవిడ్‌ను కొట్టించాలన్న ఆలోచనతో స్నేహితుడి హెల్ప్ తీసుకుని గొంగళి పురుగు గిరీష్ (సన్నివాయ్‌నే), అంబ్రోస్ (అజువర్గీస్)లను కలుస్తుంది. రౌడీలకు డబ్బులివ్వాలి కనుక -తండ్రి ప్రేమగా కొనిచ్చిన ఐఫోన్‌ను సుపారీగా ఇచ్చేస్తుంది. అనన్యతో బేరం కుదుర్చుకున్న గిరీష్, అంబ్రోస్‌లు పిటి సార్ డేవిడ్‌ను ఏం చేశారు? ఆ ప్రయత్నాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? పసి మనసులో అంత కక్ష పెరగడానికిగల అసలు కారణమేంటన్నది మిగతా సినిమా.
***
అల్లరి టైటిల్ ‘పిల్లరాక్షసి’ పాత్రలో సారా అర్జున్ పరిణితికి మించి నటన ప్రదర్శించింది. ఆటల్లో గెలవాలనే తపన ప్రదర్శిస్తూనే, అమ్మానాన్నల గొడవల మధ్య నలిగిపోతూ మానసిక వేదన అనుభవించే అమ్మాయిగా సారాకు మంచిమార్కులే పడ్డాయి. గొంగళి పురుగు గిరీష్‌గా సన్నివాయ్‌నే, అంబ్రోస్ పాత్రలో అజువర్గీస్ శక్తిమేరకు మెప్పించే ప్రయత్నం చేశారు. సాంకేతికంగా విష్ణుశర్మ సినిమాటోగ్రఫీ రిచ్‌నెస్‌ని చూపిస్తే, భాషశ్రీ సంభాషణలు ఓకే అనిపించాయి. పిల్లల మధ్య ఏమోషన్స్ బేస్ పాయింట్‌గా దర్శకుడు మాథ్యూస్ రాసుకున్న కథను అంతేబలంగా స్క్రీన్‌మీదకు తేవడంలో విఫలమయ్యాడు. -అనన్య పాత్ర చిత్రీకరణ శ్రుతిమించిందన్న భావన కలుగుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే కథ రాసుకున్నా -నాలుగో తరగతి చదివే పాప టీచర్‌పై కోపం తీర్చుకోడానికి రౌడీలను ఆశ్రయించిందన్న ఎపిసోడ్ అతికినట్టు అనిపించదు. అనన్య పాత్రతో సందేశం ఇవ్వకున్నా -పిల్లల ఆలోచనలు కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత దర్శకుడికి లేదని చెప్పలేం. సినిమాకు ప్రాణప్రదమైన పాయింట్‌ను బలంగా ప్రజెంట్ చేయడంలో దర్శకుడి వైఫల్యం కనిపించింది. అక్కడక్కడా కామెడీ సన్నివేశాలు కాస్త నవ్వించినా, బలమైన సన్నివేశాలు లేక సాగదీతగా సాగిన సినిమా ఆడియన్స్‌కు కనెక్ట్ కాలేదు. ఓ పాప ఏమోషనల్ బాండింగ్స్‌మీద నడిచే సన్నివేశాలకు తగిన సంగీతాన్ని అందించటంలో షాన్ రెహమాన్ ఒప్పించగలిగాడు. మొత్తంగా ‘పిల్లరాక్షసి’ని ఒకసారి చూడొచ్చు.

-‘వి’