రివ్యూ

సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్ (స్వచ్చమైన సచిన్ కథ ) **

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం: సచిన్ టెండూల్కర్, అర్జున్ టెండూల్కర్, మయూరేష్, మహేంద్రసింగ్ ధోనీ, అంజలి టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సినిమాటోగ్రఫీ: క్రిస్ ఓపెన్‌షా
రచన: శివ అనంత్, జేమ్స్ ఎర్‌స్కినె
నిర్మాత: రవి భగత్‌చంద్కా
దర్శకత్వం: జేమ్స్ ఎర్‌స్కినె

సచిన్ -అంటే క్రికెట్ అభిమానులకు వేద వాక్యం. తారక మంత్రం. క్రికెట్ యుద్ధానికి బయల్దేరాడంటే దేశ ప్రజలకు అదో ధీమా. భారత క్రికెట్ జట్టుకో అండ. అతడొక లెజెండ్. స్పోర్ట్స్ స్టార్ కావటానికి అతడు పడిన కష్టం.. ఎదుర్కొన్న సవాళ్లూ.. అతడి క్రికెట్ లైఫ్‌లో ఎనె్నన్ని మలుపులూ.. విమర్శలూ.. ఇవన్నీ - బిలియన్ డ్రీమ్స్‌ని సాకారం చేయటానికి దోహద పడ్డాయి. అభిమానులు పెట్టుకొన్న ఆశల వెనుక -సచిన్ పరుగులు.. పదహారేళ్ల లేప్రాయంలో ప్రపంచ కామెంటేటర్లని సైతం ఊపిరి బిగబట్టేట్టు చేయటం... ఫీల్డ్‌లో ప్రతి బంతికీ కొట్టే సిక్సర్‌ని ఏ విధంగా వర్ణించాలో తెలీక తికమక పెట్టటం ఒక్క సచిన్‌కే సాధ్యమైంది.
సచిన్‌కి ఉపోద్ఘాతంతో పనిలేదు. క్రికెట్ అంటే ప్రాణమిచ్చే ప్రతి వ్యక్తికీ ‘సచిన్’ కేరాఫ్ అడ్రస్‌తో సహా తెలీని అంశం లేదు. అయినప్పటికీ.. ఈ 2 గంటల 20 నిమిషాల్లో ఆయా సందర్భాలనూ సంఘటనలనూ.. నెమరువేసుకొనేందుకూ.. ‘కల’ని అర్థం చేసుకొనేందుకూ మార్గం సుగమం చేసింది.
ఇది కథ కాదు. సచిన్ ఆత్మకథ. ఫీల్డ్‌లో అతడి పరుగుల వర్షం... అతడి జీవితంతో పెనవేసుకొన్న తల్లిదండ్రుల తీపి జ్ఞాపకాలూ.. కోచ్ తాలూకు ఆర్ద్రతా భావాలూ.. భార్యాపిల్లల మనసులోని మాటలూ.. ఇలా డాక్యుమెంటరీ అతడి మాటల్లోనే సాగుతుంది.
ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో 2011 వరల్డ్ కప్ ఘన విజయం... సచిన్ వాక్ ఇన్ క్రికెట్.. టాక్ ఇన్ క్రికెట్.. స్లీప్ ఇన్ క్రికెట్ అన్నట్టు.. ఉన్నప్పటికీ - ఖాళీ సమయాల్లో పిల్లల్తో ఆడుకోవటం.. జీవిత భాగస్వామికి మరింత టైమ్‌ని కేటాయించటం.. ఇవన్నీ ‘అంజలి’ మాటల్లో చూస్తాం. చిన్నతనంలో తన ‘ఫైనెస్ట్ అవర్’ గురించి సచిన్ చెబుతూంటేనో.. కోచ్ గురించి తాను తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న పట్టుదలని వివరిస్తుంటేనో.. వీక్షకుల కళ్ల వెంట కన్నీళ్లు రాక మానవు. సినిమా మొత్తాన్ని ఈ విధంగా బాలెన్స్ చేసుకుంటూ రావటం వల్ల చూస్తున్నది ఒక డాక్యుమెంటరీనా? లేక సినిమానా? అన్న సందేహం వెంటాడి నప్పటికీ -ఆయా సన్నివేశాలను ఆస్వాదిస్తూ.. కాసేపు క్రికెట్ మైదానంలోనూ.. మరికాసేపు సచిన్ ‘హాల్’లోనూ తారట్లాడతాం.
కథ మొత్తాన్ని ఎంతో బ్యాలెన్స్ చేస్తూ తీసుకురావటం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. బయో పిక్ అనటంతోనే.. కథలో కొంత మెలోడ్రామాని సృష్టించటం.. ఆయా పాత్రల పరిధిని విస్తరించటం.. అర్థంలేని అంశాలను జోడించటం.. చరిత్రని వక్రీకరించటం జరిగితే జరగొచ్చు.. కానీ -‘సచిన్’లో ఆయా అంశాలకు తావులేదు. పర్సనల్ లైఫ్‌నీ.. పబ్లిక్ లైఫ్‌నీ రెండింటి మధ్య తేడాని స్పష్టం చేస్తూనే.. వివాదాస్పద అంశాలను కూడా ఎంతో సున్నితంగా స్పృశించి వదిలిపెట్టాడు సచిన్. ‘గేమ్’ గురించి సచిన్ పేర్కొన్న సంగతులనూ.. మ్యాచ్ ఫిక్సింగ్ స్కాండల్ పట్ల తన వివరణ.. ‘ఫెరారీ’ కారుకి సంబంధించి కస్టమ్స్ ఫీజ్ గురించి.. వివాదం కాకుండా అతడు పేర్కొన్న అంశాలు కన్విన్సింగ్‌గా ఉన్నాయి.
క్రికెట్‌ని కెరీర్‌గా మలచుకోవాలన్న ఆలోచన ఆరంభమైంది మొదలు.. ఇంటర్నేషనల్ క్రికెట్ టు రిటైర్మెంట్ వరకూ.. ప్రతి అంశాన్నీ.. చెబుతూన్నట్టు చెబుతూనే.. వివాదాస్పదం వైపు మళ్లకపోవటం మరో ప్రధానాంశం. సచిన్ క్రికెట్ లైఫ్ గురించి.. అతడి మాటల్లోనూ.. ఫ్రెండ్స్‌తో ఎలా మెలగుతాడన్న సంగతులనూ.. ‘పిల్లల డైపర్స్ మాత్రం మార్చడు’ అంటూ అంజలి చేసిన ఆరోపణలనూ.. చిన్ననాటి స్నేహితుల అనుభూతులనూ.. గుదిగుచ్చి.. వారివారి మాటల్లో చెప్పటం.. సినిమా సారాంశం.
-బిఎనే్క