బిజినెస్

మదుపరులలో జిఎస్‌టి జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుసగా రెండో వారం లాభాల్లో స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 260, నిఫ్టీ 86 పాయింట్లు వృద్ధి
వారాంతపు సమీక్ష
ముంబయి, నవంబర్ 28: ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఆమోదం పొందుతుందన్న ఆశాభావం మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో వారం లాభాల్లో ముగిశాయి. మదుపరుల కొనుగోళ్ళ జోరుతో గడచిన వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెన్సెక్స్ 26వేల స్థాయిని, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 7,900 మార్కును అధిగమించాయి. నిజానికి ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగుస్తుండటం, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నడుమ గడచిన వారం ప్రారంభంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివర్లో మాత్రం స్థిరత్వాన్ని సంతరించుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 259.71 పాయింట్ల లాభంతో 26,128.20 వద్ద ముగియగా, నిఫ్టీ 86.15 పాయింట్లు లాభపడి 7,942.70 వద్ద నిలిచింది. కాగా, గడచిన రెండు వారాల్లో సెన్సెక్స్ 517.67 పాయింట్లు, నిఫ్టీ 180.45 పాయింట్లు పుంజుకున్నాయి. ఇదిలావుంటే గడిచిన వారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ టీ పార్టీకి ఆహ్వానించడం మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచిందని మెజారిటీ నిపుణులు విశే్లషిస్తున్నారు. జిఎస్‌టి బిల్లు ఆమోదానికి సంబంధించి లోక్‌సభలో తగినంత బలం ఉన్నప్పటికీ, రాజ్యసభలో బిజెపి నేతృత్వంలోని మోదీ సర్కారుకు బలం లేదన్నది తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి జిఎస్‌టిని అమల్లోకి తేవాలన్న ప్రభుత్వ లక్ష్యం నేరవేర్చాలన్న ఉద్దేశ్యంతోనే తాజా టీ పార్టీ జరిగిందని మదుపరులు విశ్వాసిస్తున్నారని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇకపోతే రియల్టీ, బ్యాంకింగ్, చమురు, గ్యాస్, పిఎస్‌యు, ఆటో, పవర్, టెక్నాలజీ, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఐటి, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లకు మదుపరుల కొనుగోళ్ళ మద్దతు లభించింది. దీంతో ఆయా రంగాల షేర్ల విలువ 4.37 శాతం నుంచి 0.33 శాతం పెరిగింది. అయితే హెల్త్‌కేర్ షేర్ల విలువ 0.51 శాతం, ఎఫ్‌ఎమ్‌సిజి షేర్ల విలువ 0.33 శాతం చొప్పున పడిపోయింది. బిఎస్‌ఇ మిడ్-క్యాప్ సూచీ 1.16 శాతం, స్మాల్-క్యాప్ సూచీ 1.57 శాతం పెరిగాయి. కాగా, విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) గడచిన వారం 1,326.05 కోట్ల రూపాయల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తెలియజేసింది. ఇక టర్నోవర్ విషయానికొస్తే గడచిన వారం బిఎస్‌ఇ 11,087.94 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ 69,864.40 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు వారం బిఎస్‌ఇ టర్నోవర్ 13,611.90 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 77,391.75 కోట్ల రూపాయలుగా ఉంది.