కృష్ణ

నదుల అనుసంధానం.. చారిత్రక ఘట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, డిసెంబర్ 6:గోదావరి-కృష్ణానదుల అనుసంధానం ఒక చారిత్రక ఘట్టమని, దీనిని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. ఆదివారం ఆయన నూజివీడులో విలేఖరులతో మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయాన్ని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నదుల అనుసంధాన నిర్ణయాన్ని తీసుకుని, వెంటనే అమలు చేశారని, పట్టిసీమ ద్వారా నదులను అనుసంధానం చేశామని చెప్పారు. ఫలితంగా లక్షలాది ఎకరాలకు సాగునీరు పుష్కలంగా లభిస్తుందని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టులో ప్రస్తుతం అయిదు మోటార్లు పనిచేస్తున్నాయని, ఇంకా 15 మోటార్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి దేవినేని ఉమా తెలిపారు. నదుల అనుసంధానం దేశానికే తలమానికం అయిందని, ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు కూడా గమనిస్తున్నాయని చెప్పారు. పట్టిసీమ ద్వారా 6.8 టిఎంసిల గోదావరి జలాలను తరలించామని తెలిపారు. కృష్ణా,గోదావరి నదుల పరివాహక ప్రాంతంలో విభిన్న పరిస్ధితులు కనిపిస్తున్నాయని గోదావరి జలాల్లో 1500 టిఎంసీలు సముద్రంలో కలుస్తుండగా, కృష్ణానది ప్రవహించే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాబావ పరిస్ధితులు ఏర్పడ్డాయని చెప్పారు. కృష్ణా జలాల పంపిణీలో రాష్ట్రానికి కొంత అన్యాయం జరుగుతోందని అన్నారు. నాగార్జున సాగరు కాలువల పరిధిలోని చెరువును సాగరు జలాలతో నింపుతున్నామని, వచ్చే సీజనుకు సాగరు ఆయకట్టు పరిధిలోని ప్రతి ఎకరానికి నీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నీటి సంఘాలకు ఎన్నికలు జరగటం వల్ల చెరువుల అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు ఆర్ధిక చేయూత ఇస్తుందని అన్నారు. చెరువులను పరిరక్షించాల్సిన బాధ్యత మనందిరిపై ఉందని అన్నారు. జనచైతన్య యాత్రలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని, నివేశన స్ధలాలు, గృహాల కోసం ప్రజలు అర్జీలు ఇస్తున్నారని, వీరి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ నూజివీడు నీయోజకవర్గం నాయకులు కాపా శ్రీనివాసరావు, పట్టణ పార్టీ మాజీ అధ్యక్షులు నూతక్కి వేణుగోపాలరావు, పార్టీ నాయకులు దేవినేని డెలారాం తదితరులు పాల్గొన్నారు.