తూర్పుగోదావరి

సాగునీటి కోసం రోడ్డెక్కుతున్న డెల్టా రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 2: గోదావరి డెల్టాలో రబీ పంటకు సాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ డెల్టా రైతులు రోడ్డెక్కుతున్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువ ఉందని, డెల్టాలో రబీ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీటిని సరఫరాచేయలేమని జలవనరులశాఖ అధికారులు ఎంతగా చెప్పినా పట్టించుకోని రాష్ట్రప్రభుత్వం రైతులకు చేరువకావాలన్న ఉద్దేశ్యంతో రబీకి పూర్తి అనుమతిని మంజూరుచేసిన సంగతి విదితమే. ఉభయగోదావరి జిల్లాల్లోని ప్రతి ఎకరాకు సాగునీటిని సరఫరాచేస్తామని ప్రకటించి, డెల్టాలో రబీ రైతులకు సాగునీటి భరోసాను కల్పించి రైతులందరితోనూ రాష్ట్రప్రభుత్వం రబీ సాగును మొదలుపెట్టించింది. తీరా చూస్తే ఇపుడు సాగునీటిని అందించలేని పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడ్ని ఎదుర్కొంటోంది. దాంతో ఉభయగోదావరి జిల్లాల్లో రైతులు రకరకాల ఆందోళనలకు దిగుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పటికే చాలా చోట్ల రైతులు ధర్నా కార్యక్రమాలకు దిగుతున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో శనివారం కొత్తపేట సమీపంలోని వాడపాలెంలో లాకులను మూసివేసి రైతులు నిరసన వ్యక్తంచేసారు. ఇదే పరిస్థితి ఉభయగోదావరి జిల్లాల్లోని చాలా చోట్ల ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. గోదావరిలో నీటి లభ్యత తక్కువ ఉన్న నేపథ్యంలో డెల్టా కాలువల్లో పూర్తిస్థాయి నీటిమట్టాన్ని కొనసాగించలేని పరిస్థితి నెలకొంది. దీనివల్ల మెరక ప్రాంతాల్లోని పంట పొలాలకు సాగునీటి సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. దాంతో మెరకప్రాంతాల్లోని రైతులు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నారు. మెరక ప్రాంతాల్లోని పంట పొలాలకు నీటిని సరఫరాచేయటం కష్టమవుతుందని, కనీసం మెరక ప్రాంతాల్లోని పంట పొలాల్లో రబీకి అనుమతిని ఇవ్వవద్దని జలవనరులశాఖ అధికారులు మొదటి నుండి చెబుతూనే ఉన్నా, రాష్ట్రప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా మెరక ప్రాంతాల్లో కూడా రబీని అనుమతించింది. దాంతో నాట్లు వేసుకున్న మెరక ప్రాంతాల రైతులు ఇపుడు సాగునీటి సరఫరా జరగటం లేదంటూ ఆందోళనకు దిగుతున్నారు. పరిస్థితి ఆందోళనకరంగా మారుతుండటంతో బైపాస్ కాలువ ద్వారా ఇస్తున్న 1500క్యూసెక్కులు సీలేరు జలాలను, 2వేల క్యూసెక్కులకు పెంచినప్పటికీ ఇంకా నీటి కొరత అదుపులోకి రాలేదు. మోతుగూడెంలోని జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్‌ను ఉత్పత్తి చేయటం ద్వారా 4వేలు నుండి 4వేల 500క్యూసెక్కులు నీటిని గోదావరి డెల్టాకు సరఫరాచేస్తున్న జెన్‌కో అధికారులు, 2వేల క్యూసెక్కులను బైపాస్ కాలువ ద్వారా విడుదలచేస్తూ ఇప్పటికే గరిష్ఠ స్థాయిలో రబీకి ఊతమిస్తున్నారు. అయినా సరే నీటి కొరత అదుపులోకి వచ్చేలా కనిపించటం లేదు. గోదావరి డెల్టాలో పరిస్థితిని సమీక్షిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు రైతుల తరపున ఉద్యమానికి రంగం సిద్ధంచేస్తున్నాయి. రైతుల్లో అసంతృప్తి పెరిగిన వెంటనే రోడ్డెక్కేందుకు మిగిలిన పార్టీలు కూడా ఆందోళనకు సమాయత్తమవుతున్నాయి.