జాతీయ వార్తలు

రైల్వే బడ్జెట్‌లో ప్రధానాంశాలు ఇవీ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభు గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సామాన్యుడికి పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించారు. మహిళలకు 30 శాతం బెర్తుల కేటాయింపు, టాయిలెట్ల అభివృద్ధి, రైళ్ల రాకపోకలకు సంబంధించి ఆధునిక సమాచార వ్యవస్థ వంటి అంశాలు బడ్జెట్‌లో ఉన్నాయి. రైల్వే బడ్జెట్‌లో కొన్ని ముఖ్య విషయాలు...
* కొత్త రైళ్లు ప్రకటించని సురేష్‌ ప్రభు
* రైలు చార్జీలు యధాతథం
* ఉద్యోగుల ఆకాంక్షలు పరిగణనలోకి..
* రైల్వేలైన్ల విద్యుద్దీకరణపై దృష్టి
* వచ్చే ఏడాదికి 10 శాతం ఆదాయం పెంపు లక్ష్యం
* క్యాపిటల్‌ ప్లాన్‌ 1.21 లక్షల కోట్లు
* పీపీపీ పద్దతిలో రైల్వే ప్రాజెక్టులు
* పీపీపీ పద్దతికి అంతర్జాతీయ సహకారం
* రైల్వేలో మౌలిక సౌకర్యాలు పెంపు
* వేగం, సమర్థత, పారదర్శకత పెంచడమే లక్ష్యం
* ఐదేళ్లలో రైల్వేలో 1.50 లక్షల కోట్ల ఎల్‌ఐసీ పెట్టుబడులు
* 2500 కి.మీ బ్రాడ్‌ గేజ్‌ లైన్లు
* వచ్చే ఏడాది 2800 కి.మీ రైల్వే లైన్లు
*1600 కి.మీ మేర రైల్వే లైన్ల విద్యుద్దీకరణ
* మొత్తం సివిల్ వర్క్స్‌ పూర్తి చేసే లక్ష్యం
*నాగ్‌పూర్‌- విజయవాడ ట్రేడ్‌ కారిడార్‌ పూర్తి
*పోర్టులకు రైల్వే కనెక్టివిటీ పెంపు
*5 ఏళ్లలో 8.5 లక్షల కోట్లతో రైల్వేల ఆధునీకరణ
*బడ్జెట్‌ ద్వారా రైల్వేలకు రూ.10 వేల కోట్ల ఆదాయం
*రూ.40 వేల కోట్లతో రెండు లోకో ప్రాజెక్టులు
*ప్రయాణికులకు రూ.30 వేల కోట్ల సబ్సిడీ
* ఇకపై ఆన్‌లైన్‌లోనే రైల్వే రిక్రూట్‌మెంట్లు
*ప్రయాణికుల నుంచి ఫీడ్‌బ్యాక్
*ప్రయాణికులకు మెడికల్‌ సర్వీసులు
*ప్రయాణికుల సౌకర్యాలు పెంచాలని 124 మంది ఎంపీలు వినతి
*జనరల్‌ క్లాస్‌లోనూ మొబైల్‌ చార్జింగ్‌ సౌకర్యం
* రైల్వే స్టేషన్లలో 17 వేల బయో టాయిలెట్ల నిర్మాణం
* ఆందోళనల వల్ల రైళ్లు సమయానికి రావడం లేదు
*1078 టికెట్‌ మిషన్లు ఏర్పాటు
* రైల్వేలో ఆన్‌లైన్‌ సేవలు పెంపు
* మహిళలు, వృద్ధులకు లోయర్‌ బెర్త్‌ కోటా 50 శాతం పెంపు
ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే కనెక్టివిటీ విస్తృతం
* 100 రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు
* వచ్చే నాలుగేళ్లలో 400 స్టేషన్లలో వైఫై సేవలు
* పీపీపీ పద్దతిలో 400 రైల్వేస్టేషన్ల అభివృద్ధి
* దశలవారీగా అన్ని రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలు
* సరికొత్త టెక్నాలజీతో ప్రమాదాల నివారణ
* 30 వేల బయో టాయిలెట్లు నిర్మాణం
* 10 అత్యాధునిక వంటశాలలు
* చిన్న పిల్లల కోసం ప్రత్యేక ఆహారం, మహిళల సమస్యలకు 24 గంటల హెల్ప్‌లైన్
* 475 స్టేషన్లలో అదనపు టాయిలెట్లు
* బుకింగ్‌ సమయంలో ప్రయాణికులకు ఇన్సూరెన్స్‌
* టికెట్‌ సమస్యల పరిష్కరానికి మొబైల్‌ యాప్‌లు
* రైళ్ల రాకపోకల సమయం తెలిపేందుకు స్క్రీన్లు
* స్క్రీన్లపై ప్రకటనల ద్వారా ఆదాయం
* రద్దీ మార్గాల్లో డబుల్‌ డెక్కర్‌ రైళ్లు
* తిరుపతి లాంటి యాత్ర స్థలాలకు సర్క్యూట్‌ రైళ్లు
* రైల్వే కూలీలు ఇక నుంచి సహాయకులు
* రైల్వే స్టేషన్లలో ఎఫ్‌ఎం రేడియో సేవలు
* ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ సౌకర్యాలు
* ముంబైలో సబర్బన్‌ కారిడార్
* తెలంగాణ ప్రభుత్వంతో కలిసి హైదరాబాద్‌ సబర్బన్‌ నెట్‌వర్క్‌ విస్తృతి
* రైల్వే కోచ్‌లలో జీపీఎస్‌ సిస్టం
* వికలాంగుల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు
* రాజధాని, శతాబ్ధి రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపు
* ఈ సంవత్సరం ఆదాయం లక్ష్యం 1.87 లక్షల కోట్లు
* రైల్వే ఆధ్వర్యంలో 1000 మెగావాట్ల సౌరవిద్యుదుత్పత్తి