క్రీడాభూమి

భారత జట్టుకు ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాఫ్ టోర్నీకి స్టార్ స్ట్రైకర్ దూరం
గాయంతో వైదొలిగిన రాబిన్ సింగ్
తిరువనంతపురం, డిసెంబర్ 29: శాఫ్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ సెమీఫైనల్ పోరులో గురువారం మాల్దీవులతో తలపడేందుకు సిద్ధమైన భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయంతో బాధపడుతున్న భారత స్టార్ స్ట్రైకర్ రాబిన్ సింగ్ బుధవారం ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌ల నుంచి వైదొలిగాడు. ఢిల్లీకి చెందిన రాబిన్ సింగ్ ఈ టోర్నీలో ఈ నెల 25వ తేదీన శ్రీలంకతో తొలి మ్యాచ్ ఆడుతుండగా మోకాలికి గాయమైంది. ఆ గాయం నుంచి అతను ఇంకా కోలుకోలేకపోయాడు. ఆ మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించి భారత జట్టును 2-0 తేడాతో విజయపథంలో నడిపిన రాబిన్ సింగ్ రెండో గోల్ సాధించిన తర్వాత గాయం ఇబ్బంది పెట్టడంతో 75వ నిమిషంలో అతడిని స్ట్రెచర్ ద్వారా మైదానం వెలుపలికి తరలించారు. ఆ తర్వాత సోమవారం నేపాల్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో రాబిన్ సింగ్ బరిలోకి దిగలేదు. అయినప్పటికీ ఈ మ్యాచ్‌లో భారత జట్టు 4-1 గోల్స్ తేడాతో విజయభేరి మోగించి సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. అయితే మోకాలి గాయం నుంచి రాబిన్ సింగ్ ఇంకా కోలుకోలేకపోవడంతో ఈ టోర్నీ నుంచి పూర్తిగా వైదొలగాల్సి వచ్చింది. ప్రస్తుతం కీలక దశలో అతను దూరమవడం తీవ్ర విచారకరమని భారత జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ కాన్‌స్టాంటిన్ ఆవేదన వ్యక్తం చేశాడు.