రాష్ట్రీయం

త్వరలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వర్సిటీ’లు ముందుకు రావాలి * ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు

హైదరాబాద్, నవంబర్ 26: తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును త్వరలో తీసుకురానున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను నెలకొల్పడానికి విశ్వవిద్యాలయాలు ముందుకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో గురువారం రాక్‌వెల్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉండటం వల్ల విశ్వవిద్యాలయాల మధ్య పోటీ ఏర్పడి విద్యలో నాణ్యతా పెరగడానికి దోహదపడుతుందన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో విశ్వవిద్యాలయాలను నెలకొల్పడానికి హైదరాబాద్ నగరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. సమాజంలో ప్రస్తుతం విద్యకు ఉన్న విలువను గుర్తించిన తల్లిదండ్రులు తమ సుఖాలను కూడా త్యాగం చేసి తమ పిల్లలకు మంచి చదువులు చదివించడం ఎంతైన అభినందనీయమని ముఖ్యమంత్రి అన్నారు. జూబ్లీహిల్స్‌లో కొద్దికాలం కిందట ఆరుగురు విద్యార్థులతో ప్రారంభమైన రాక్‌వెల్ ఇంటర్నేషనల్ స్కూల్ అతి స్వల్ప వ్యవధిలోనే విద్యార్థుల సంఖ్య ఐదు వందలకు చేరుకొని రెండవ క్యాంపస్ ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదగడం అభినందనీయమని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణలో మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన మహేశ్ బింగాల అనే యువకుడు ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ ప్రైవేట్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి పది వేల మంది పట్ట్భద్రులను తయారు చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక విద్యాలయాలను నెలకొల్పడం అభినందనీయమని, ఇది తెలంగాణకే గర్వకారణమన్నారు. రాక్ వెల్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను స్థాపించిన మహేశ్ బింగాల మిత్ర బృందాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకుంటున్న చర్యల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజి అంతర్జాతీయ స్థాయికి చేరుకుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో అనేక విద్యాలయాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నాయని, వీటికి తమ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని కడియం అన్నారు.