ఆంధ్రప్రదేశ్‌

రోజాకు నోఎంట్రీ...నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ శాసనసభలోకి వైకాపా ఎమ్మెల్యే రోజాను రానివ్వకపోవడంపై ఆ పార్టీ అధినేత, పార్టీ శాసనసభ్యులు నిరసన తెలిపారు. అసెంబ్లీ ఎదుట బైఠాయించారు. రోజాపై సస్పెన్షన్‌ను హైకోర్టు కొట్టివేసినా శాసనసభలోకి రాన్వికపోవడమేమిటని జగన్ ప్రశ్నించారు. శాసనసభ 3వ గేట్‌నుంచి వచ్చేందుకు రోజా ప్రయత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో వైకాపా బృందానికి, వారికి వాగ్వాదం జరిగింది. స్పీకర్ ఆదేశాలే తమకు శిరోధార్యమని వారు చెప్పడంతో జగన్ నిరసనకు దిగారు. కొద్దిసేపటి తరువాత శాసనసభ ప్రాంగణంలోని పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలోకి మాత్రం రోజాను అనుమతించారు.