ఆంధ్రప్రదేశ్‌

మహిళలకు సత్వర న్యాయం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: మహిళలకు సత్వర న్యాయం అందాల్సిన అవసరం ఉందని, లేదంటే అది అన్యాయంగా మారే పరిస్థితి ఏర్పడుతుందని వైకాపా ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆమె ఈరోజు ఏపీ అసెంబ్లీలో మహిళల రక్షణకు సంబంధించిన అంశంపై ప్రసంగించారు. హైదరబాద్‌లో దిశ ఘటన జరిగిన తరువాత అసెంబ్లీలో మహిళల రక్షణకు సంబంధించి చర్చ జరుగుతుంటే ఇక్కడ మహిళల రక్షణకు ఎలాంటి చట్టాలు చేస్తారని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు. ఆడపిల్లలు కాలేజీలకు వెళ్లాలన్నా భయపడుతున్నారని అన్నారు. మహిళను అడవిలో వదిలేసినా సురక్షితంగా ఇంటికి వస్తుందనే నమ్మకం ఉందని, కాని ఈ సమాజంలో సురక్షితంగా వస్తుందనే నమ్మకం కలగటం లేదని అన్నారు. కాబట్టి మహిళల రక్షణకు నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆడపిల్లకు అన్యాయం జరిగితే శిక్ష వేస్తారనే నమ్మకాన్ని ఈ చట్టసభ ద్వారా కల్పించాలని ఆమె కోరారు. ఆంధ్రప్రదేశ్ ఆడవాళ్లప్రదేశ్‌గా మారాలని అన్నారు.