ఆంధ్రప్రదేశ్‌

రోజా సస్పెన్షన్‌పై తీర్పు రేపటికి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వైకాపా ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేయడంపై ఏపి అసెంబ్లీ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం వాదనలు ముగిశాయి. రోజా అసెంబ్లీకి హాజరు కావచ్చని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సవాల్ చేసిన సంగతి తెలిసిందే. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రభుత్వం తరఫున న్యాయవాది పివి రావు తన వాదన వినిపిస్తూ, క్షమాపణ చెబితే రోజాను అసెంబ్లీలోకి అనుమతించేందుకు సిద్ధమేనని చెప్పారు. తప్పు చేయలేదు గనుక రోజా క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ఆమె తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదించారు. ఉభయ పక్షాల వాదనలు విన్న తర్వాత, ఈ కేసులో తీర్పును మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.