ఆంధ్రప్రదేశ్‌

లోకేష్ సత్తా ఏంటో తెలిసిందే: రోజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: వైకాపా ఎమ్మెల్యే రోజా మళ్లీ వ్యక్తిగత ఆరోపణలపై ప్రత్యర్థులపై దాడికి దిగారు. ఈసారి ఆమె ఎపి సిఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌పై విమర్శలు సంధించారు. ఆమె గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, రాజకీయాల్లో లోకేష్ ఓ పప్పు సుద్ద అన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో తెరాస నేతలపై లోకేష్ తొడగొట్టారని, ఆ తర్వాత తెలంగాణలో టిడిపి బలమెంతో తేలిపోయిందన్నారు. ఇపుడు మళ్లీ బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ లోకేష్ వైకాపాకు సవాల్ చేస్తున్నారని, ఆయన సత్తా ఏంటో ఎపిలో అందరికీ తెలుసునని, ఎమ్మెల్యేగా గెలిచే దమ్ము ఆయనకు లేదని రోజా వ్యాఖ్యానించారు.