తెలంగాణ

సమాజాభివృద్ధిలో ముందుండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్య, వైశ్య యువతకు తమిళనాడు గవర్నర్ రోశయ్య సూచన

మహబూబ్‌నగర్, మార్చి 12: సమాజాబివృద్ధి కోసం ఆర్యవైశ్యులు ముందుండి కృషి చేయాలని తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య పిలుపునిచ్చారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకాపరమేశ్వరీ దేవాలయంలో నిర్వహించిన ఆర్య వైశ్య యువజన సంఘం రజతోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా గవర్నర్ రోశయ్య హజరయ్యారు. ఈ సందర్బంగా తమిళనాడు గవర్నర్ రోశయ్య మాట్లాడుతూ లక్ష్మి పుత్రులుగా జన్మించి ప్రభుత్వ సహయాన్ని అందుకోవడానికి బిడియపడే ఆర్య వైశ్యుల్లోని వెనుకబడిన తోటి వారికి చేయూత ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా ధర్మరక్షణ కోసం ప్రతి ఒక్కరు కంకణబద్దులై ఉండాలని ధర్మాన్ని కాపాడడంలో ముందు వరుసలో ఉండాలని పిలుపునిచ్చారు. ఆర్య వైశ్య సంఘం ఏర్పాటు ముఖ్య ఉద్దేశం కూడా తోటి వారికి సహాయపడటమేనని ఆయన పేర్కొన్నారు. సేవా దృక్పథంతో ముందుకు సాగినప్పుడే సంఘాలకు మనుగడ ఉంటుందని ఆయన అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఆర్యవైశ్యులు ఆదర్శంగా నిలవాలని, విస్తృతంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు. సహయం కోసం ఎదురు చూసే వారికి చేయూత అందించేందుకే ఆర్యవైశ్య సంఘం ఏర్పడిందని ఆయన తెలిపారు. సమాజంలోని అందరిని సమానంగా చూసేందుకు ఆర్యవైశ్య సంఘం ఏర్పడిందని, కులాల మధ్య విభేదాలు సృష్టించేందుకు కాదని ఆయన అన్నారు. సంపన్నులు తమ సంపాదనలో కొంత మొత్తాన్ని నిరుపేదలకు సహయం చేయాలని ఆయన సూచించారు. 1976 సంవత్సరంలో ఆర్యవైశ్య సంఘం ఏర్పాటైనప్పుడు కొంత మంది మాత్రమే సంఘంలో ఉండేవారని, ప్రస్తుతం సంఘం శాఖోపశాఖలుగా విస్తరించి దేశ విదేశాల్లో సేవలు అందిస్తుందని గుర్తు చేశారు. ప్రభుత్వం సమాజంలో వెనుకపడిన వారి కోసం ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నా ఆ నిధులు అందరికీ సరిపోవడంలేదని, అన్ని సంఘాలు తమ వంతుగా ప్రభుత్వానికి చేయూతనిచ్చేలా సహాయసహకారాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం అందించే సహాయం అందుకునే సామర్థ్యం అందరిలో లేదని, కనీసం రేషన్ కార్డులను క్యూలలో నిలబడి అందుకునే స్థితిలో లేని వారికి చేయూతనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. జడ్చర్లతో తన అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఇరవై సంవత్సరాల క్రితం నుండి అనేక మార్లు తాను జడ్చర్ల, బాదేపల్లిలకు వచ్చానని ఇక్కడి వారితో తనకు అత్యంత సాన్నిహిత్యం ఉందని అన్నారు. వ్యయప్రయాసాలకోర్చి తాను మద్రాసు నుండి హైదరాబాద్, అక్కడి నుండి జడ్చర్లకు వచ్చానని, ప్రయాణంలో అలసట అనిపించినా కార్యక్రమం ద్వారా అందర్ని కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మినారాయణ పాల్గొన్నారు.