రాష్ట్రీయం

రౌడీయిజం చేస్తే కోరలు తీస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోపణలపై ఆధారాలివ్వండి నిరూపించకపోతే తప్పుకోండి
మచ్చ లేకుండా బతికా విపక్షానికి పద్ధతే లేదు
అవిశ్వాస చర్చలో బాబు నిప్పులు
హైదరాబాద్, మార్చి 14: అధికార తెలుగుదేశం పార్టీపై వైకాపా అవిశ్వాస తీర్మానం సందర్భంగా సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర పదజాలంపై విరుచుకు పడ్డారు. సౌరవిద్యుత్ ఒప్పందాలకు సంబంధించి చేసిన ఆరోపణలకు ఆధారాలను సభ ముందుంచాలని లేకుంటే విపక్ష నేత పదవికి రాజీనామా చేసి వెళ్లాలని జగన్‌కు సవాలు విసిరారు. ఇరు పక్షాల నుండి ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలకు దిగడంతో ఒక దశలో ఆగ్రహావేశానికి గురైన చంద్రబాబునాయుడు రౌడీయిజం చేస్తే కోరలు తీస్తా అంటూ హెచ్చరించారు. ప్రతిపక్ష సభ్యులు అసలు పద్ధతి లేకుండా ప్రవర్తిస్తున్నారంటూ విరుచుకు పడ్డారు. సోలార్, విటిపిఎస్, కృష్ణపట్నంలో వేల కోట్ల రూపాయిల అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్న జగన్ వాటిని నిరూపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే సభలో ఉండే హక్కు కూడా వారికి లేదని అన్నారు. చేసిన ఆరోపణలు నిజమైతే నిరూపించాలని లేదంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 35 ఏళ్లుగా నీతి నిజాయితీలతో బతికాము కాబట్టే ఎవరూ ఏం చేయలేకపోయారన్నారు. ‘మీ నేత చేసిన ఆరోపణలు రుజువు చేయకపోతే ప్రతిపక్ష నేత పదవి నుంచి తప్పించి మీలో ఎవరైనా ప్రతిపక్షనేత కండి ’’అని వైకాపా ఎమ్మెల్యేలకు చంద్రబాబు హితవుపలికారు. సభలో ఏదో ఆరోపణలు చేసి వెళ్లిపోతామంటే ఊరుకునేది లేదని, వారు ఆరోపణలను రుజువు చేయాల్సి ఉంటుందని, లేకుంటే చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. పచ్చకామెర్లు ఉన్న వారికి అన్నీ పచ్చగానే కనిపిస్తాయని అనడానికి ప్రతిపక్ష నేత పెద్ద ఉదాహరణ అని అన్నారు. అవినీతి జరిగిందని నిరూపిస్తే బాధ్యులైన వారిని డిస్మిస్ చేస్తామని స్పష్టం చేశారు. నిరూపించే ధైర్యం ఏ ఒక్క ఎమ్మెల్యేకైనా ఉంటే తక్షణమే ముందుకు రావాలని అన్నారు. మంత్రులపై చేసిన ఆరోపణలను , నిరూపించాలని అడుగుతుంటే ఆనాడు ప్రతిపక్షం పారిపోయిందని అన్నారు.