రంగారెడ్డి

నూతన చర్చి భవనం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, జనవరి 20: నేరేడ్‌మెట్ డివిజన్ పరిధిలోని నిర్మల్‌నగర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటుచేసిన సెయంట్ సెబాస్టియన్ చర్చి భవనాన్ని శనివారం సాయంత్రం ఫాదర్ డాక్టర్ తుమ్మ బాల ప్రారంభించారు. అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఫెన్స్‌కాలనీ సొసైటివారు 1971లో చర్చి కోసం స్థలాన్ని కేటాయించారని తెలిపారు. అప్పటినుండి నేటి వరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కెఎ ఎం మరియదాస్, మైకెల్ సెల్వరాజ్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

రైల్వే వంతెన నిర్మాణంలో స్థలాలు కోల్పోయిన వారికి
నష్టపరిహారం చెల్లింపు

ఘట్‌కేసర్, జనవరి 20: ఘట్‌కేసర్ మండల కేంద్రంలోని కొండాపూర్ రైల్వే వంతెన నిర్మాణంలో ఇళ్లు, స్థలాలు కోల్పోయి నష్టపరిహారం తీసుకోని వారందరికీ నష్టపరిహారాన్ని బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేసినట్లు మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో వంతెన నిర్మాణంలో ఇళ్లు కోల్పోయి డబ్బులు అందని వారితో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తమకు డబ్బులు అందలేదని, వెంటనే యిప్పించాలని, తమ తల్లిదండ్రుల పేరున ఉన్న స్థలాలకు సంబంధించిన డబ్బులు నేటి వరకు అందటం లేదని బాధితులు ఆరోపించారు. గతంలో నష్టపరిహారం తీసుకునేందుకు నిరాకరించిన వారందరికీ కోర్టు ఆదేశాలతో వారి వారి ఖాతాలలో జమ చేసినట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రుల పేరున స్థలాలు ఉండి మృతి చెందినవారి నిజమైన వారసులకు డబ్బులు అందజేస్తామన్నారు. అలాంటివారు స్థానిక తహసీల్దార్‌ను సంప్రదించి వారసత్వ ధ్రువీకరణ పత్రాలను పొందిన వెంటనే అందజేస్తామన్నారు. కొండాపూర్ రైల్వే గేటుపై నిర్మించే వంతెన పూర్తి అయితే ట్రాఫిక్ సమస్య ఉండదన్నారు. దీంతో ఘట్‌కేసర్ గ్రామంలోని బాలాజీనగర్, ఇడబ్ల్యూఎస్ కాలనీ, గుంటిగూడెం ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ బండారి శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి, తహశీల్దార్ రాజేశ్వర్‌రెడ్డి, బాధితులు తదితరులు పాల్గొన్నారు