రంగారెడ్డి

త్వరితగతిన ప్లాట్ల క్రమబద్ధీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జనవరి 20: లేఅవుట్ రెగ్యులరైజ్ స్కీం పథకం కింద ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని హెచ్‌ఎండీఏ కమిషనర్ టీ.చిరంజీవులు ఆదేశించారు. శనివారం తార్నాకలోని హెచ్‌ఎండీఏ కేంద్ర కార్యాలయంలో ఎల్‌ఆర్‌ఎస్ పథకంపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణలో ఎదురవుతున్న సమస్యలను అధికారులు కమిషనర్ దృష్టికి తీసుకరావడంతో అవసరమైన చర్యలకు ఆదేశించారు. క్రమమద్ధీకరణ పనులలో అలసత్వం ప్రదర్శించిన ఎనిమిది మంది ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు. వారంలో రెండు సార్లు సమావేశాలను నిర్వహిస్తామని చెపుతూనే ఫిబ్రవరి నెల లోగా ప్రక్రియను పూర్తి చేయాలని గడువు విధించారు. దరఖాస్తుదారులెవరైనా నేరుగా అధికారులను కలిసే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. సామాన్యులు మధ్య దళారులతో నష్టపోయే అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ స్వయంగా నొక్కి చెప్పారని గుర్తు చేశారు. నియమ నిబంధనల ప్రకారం అన్ని దస్తావేజులు సమర్పించిన అర్జీదారులకు ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణ డిజిటల్ ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని ఆదేశించారు. క్రమబద్ధీకరణ విషయంలో జాప్యం చేస్తే సహించబోమని హెచ్చరించారు. దరఖాస్తులలో దస్తావేజులు సరిగా లేవన్న విషయాన్ని ఎస్‌ఎంఎస్, లేదా ఇతర పద్ధతుల ద్వారా సమాచారం అందించాలని, అయినప్పటికీ నిర్ణీత సమయంలో సమర్పించకపోతే ఆ దరఖాస్తులను తిరస్కరించనున్నట్లు తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్ ఉత్తర్వులను ఆన్‌లైన్‌లో అందుబాటులో పెట్టాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియను ఫిబ్రవరి 15వ తేదీ లోగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.