కృష్ణ

పేద బ్రాహ్మణుల అభ్యున్నతే ధ్యేయం 2.5 - 16.5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 22: పేద బ్రాహ్మణుల ఆర్థికాభ్యున్నతే లక్ష్యంగా బ్రాహ్మణ కార్పొరేషన్ పని చేస్తోందని కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య అన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన సంయుక్త ఆధ్వర్యంలో గురువారం స్థానిక సిరి కల్యాణ మండపంలో బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్పొరేషన్ చైర్మన్ ఆనంద సూర్య మాట్లాడుతూ అగ్రవర్ణాలుగా పిలువబడే బ్రాహ్మణ జాతిలో కూడా పేద బ్రాహ్మణులు ఎంతో మంది ఉన్నారని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వారి కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. ఇప్పటి వరకు రూ.215కోట్లు కార్పొరేషన్‌కు కేటాయింపులు జరిగాయన్నారు. రానున్న బడ్జెట్‌లో కేటాయింపులు మరింత పెంచే విధంగా ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కృషి చేస్తున్నారన్నారు. కొంత మంది బ్రాహ్మణ కార్పొరేషన్‌పై చేస్తున్న విమర్శలను ప్రతి ఒక్కరూ తిప్పి కొట్టాలన్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో పేద బ్రాహ్మణ మహిళలకు కుట్టు మిషన్లు సైతం పంపిణీ చేస్తామన్నారు. మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు మాట్లాడుతూ బ్రాహ్మణులకు తెలుగుదేశం ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్ మాట్లాడుతూ బ్రాహ్మణులంతా ముఖ్యమంత్రికి రుణ పడి ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రిపాటి గోపిచంద్, మున్సిపల్ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాధం (చంటి), ఎఎంసీ చైర్మన్ చిలంకుర్తి తాతయ్య, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర అధ్యక్షుడు వేమూరి రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు మోపర్తి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.