రంగారెడ్డి

సీసీరోడ్లు 107 కోట్ల రూపాయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఫిబ్రవరి 23: గ్రామీణ ప్రాంతాల్లో బీటీ, సీసీరోడ్లు నిర్మించేందుకు 107 కోట్ల రూపాయలు మం జూరైనట్టు షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ వివరించా రు. శుక్రవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విలేఖరుల తో మాట్లాడుతూ గ్రామ పంచాయతీలతోపాటు అనుబంధ గ్రామాలలో సీసీరోడ్లు, బీటీ రోడ్డు సౌకర్యం కల్పించేందుకు సీఎం కేసీఆర్ భారీ స్థాయి లో నిధులు మంజూరు చేశారని వివరించారు. కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వ గ్రామ పంచాయతీ జహంగీర్ పీర్ దర్గాకు సీఎం కేసీఆర్ వచ్చిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గ్రామ పంచాయతీలకు రూ. 10 లక్షలు, అనుబంధ గ్రామాలకు ఐదు లక్షలు, గిరిజన తండాలకు ఐదు లక్షల చొప్పున 50 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా బీటీ, సీసీరోడ్ల నిర్మాణాలకు రూ.30.36కోట్లు, ప్రత్యేక నిధుల ద్వారా రూ. 26.54 కోట్లు మం జూరైనట్టు వివరించారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, ఫరూఖ్‌నగర్, కేశంపేట, కొం దుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీలతోపాటు అనుబంధ గ్రామాలు, గిరిజన తండాలల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు. సమావేశంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్య, వివిధ మండలాల అధ్యక్షులు ఎంఎస్ నటరాజ్, వెంకట్ రాంరెడ్డి, రాజేష్ పటేల్, నర్సింగ్‌రావు, ఏనుగు జనార్దన్ రెడ్డితోపాటు మాజీ వ్యవసాయ మార్కెట్ వైస్‌చైర్మన్ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి
షాద్‌నగర్ రూరల్, ఫిబ్రవరి 23: మదాసీ కుర్వలకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీచేయడంలో నాన్చుడు ధోరణి అవలంభించడం ప్రభుత్వానికి తగదని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. శుక్రవారం షాద్‌నగర్ ఆర్డీవో కార్యాలయం ఎదుట మదాసీ కుర్వలు నిర్వహిస్తున్న నిరాహార దీక్ష 80వ రోజుకు చేరుకుం ది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ మాదాసీ కుర్వలకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని గత 80 రోజులుగా శాంతియుతంగా పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మదాసీ కుర్వలకు తక్షణమే ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్మె సంతోష్, దర్గా వెంకటేష్, కాంగ్రెస్‌నే తలు అగ్గనూరి విశ్వం, దంగు శ్రీనివాస్ యాదవ్, కొంకళ్ల చెన్నయ్య, బాబునాయక్, బాబర్‌ఖాన్, వై.యా దయ్య, కే.మల్లేష్, రాంచంద్రయ్య, యాదయ్య, రమేష్, శ్రీశైలం, నవీన్, కట్టా వెంకటేష్ గౌడ్, మధు, అందె మోహన్, రాఘవేందర్, మనె్న రవి, మల్లికార్జున్, శ్రీనాథ్, విజయ్‌కుమార్ రెడ్డి, జగదీశ్వర్, రాజేష్, సత్తయ్య పాల్గొన్నారు.