రంగారెడ్డి

తిరుగులేని శక్తిగా తెరాస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిందని, వందల కోట్లతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నామని మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు సీహెచ్ మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేక్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, శంభీపూర్‌లో ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేక్, ఎమ్మెల్సీ రాజు మాట్లాడారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రూ.రెండు వేల కోట్ల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణ దిశగా బాటలు వేస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు. నియోజకవర్గంలో హడ్కో నిధుల నుండి సుమారు రూ.23 వందల కోట్లతో పనులను చేపట్టామని, మిషన్ కాకతీయలో భాగంగా నియోజకవర్గంలో 370 చెరువులు, కుంటలను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. జీహెచ్‌ఎంసీ 8 డివిజన్‌లలో రూ.194.58 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ, బోర్‌లు, పైపులైన్‌లు, నాలాలు, వాటర్ ట్యాంక్‌లు, కమిటీహాల్స్ నిర్మాణం చేశామని తెలిపారు. రూ.76 క్లోతో నాలుగు విద్యుత్ సబ్‌స్టేషన్‌లు, ట్రాన్స్‌ఫార్మర్‌లు, ఎలక్ట్రికల్ లైన్‌లు వేయించామని అన్నారు. రూ.20 కోట్లతో హెచ్‌ఎండబ్ల్యూఎస్ ద్వారా నియోజకవర్గంలో తాగునీటి పనులను చేపట్టామని చెప్పారు. మండలంలో రూ.5 కోట్లతో అభివృద్ధి పనులను, మిషన్ భగీరథ పథకంలో భాగంగా రూ.220 కోట్లతో అర్భన్ పరిధిలో ఆరు రిజర్వాయర్‌లు, పైపులైన్ పనులు కొనసాగుతున్నాయని, రూ.90 కోట్లతో గ్రామాలలో 20 వాటర్ ట్యాంక్‌లు, పైపులైన్‌ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. సీడీపీ అండ్ ఎస్‌జీఎఫ్ నిధుల ద్వారా రూ.5 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, రూ.17 కోట్ల జిల్లా పరిషత్ నిధులతో పనులను, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు పెన్షన్‌లు, బతుకమ్మ, రంజాన్, బక్రీద్, క్రిస్‌మస్, బోనాల పండుగలకు రూ.4.3 కోట్ల నిధులను ప్రభుత్వం అందజేసిందని అన్నారు.
ఆపద్బంధు పథకం ద్వారా రూ.7 కోట్లు అర్హులైన వారికి అందించామని చెప్పారు. పేదలకు మెరుగైన వైద్య చికిత్స కొరకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి రూ.7.13 కోట్లు మంజూరు అయ్యాయని అన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం నుండి రూ.4.5 కోట్లను పేద మహిళల పెళ్లిళ్లకు అందించామని వివరించారు. ఇళ్లు లేని పేదలకు ఐదు ప్రాంతాలలో 11 ఎకరాలలో రూ.1172 కోట్లతో 13565 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని అన్నారు. క్రీడాకారుల అవసరార్థం గండిమైసమ్మలోని జ్యోతిరావు పూలే స్టేడియం అభివృద్ధికి రూ.130 లక్షలను మంజూరు చేశామని, కొంపల్లి నేషనల్ హైవే అభివృద్ధికి రూ.2140 లక్షలు ప్రభుత్వం కేటాయించిందని, జగద్గిరిగుట్ట బస్టాప్ నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు అయ్యాయని అన్నారు. రూ.588 కోట్ల అంచనా వ్యయంతో నియోజకవర్గంలో అభివృద్ధి, వౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక రూపొందించామని, పలు నాలాలు, పార్కులు, శ్మశానవాటికల అభివృద్ధికి మంజూరయ్యాయని తెలిపారు. దళితులకు మూడెకరాల స్థలాన్ని, 24 గంటల విద్యుత్ సరఫరా, కేజీ టూ పీజీ విద్య, మెరుగైన వైద్యం వంటి అనేక కార్యక్రమాలు నాలుగేళ్లలో ప్రభుత్వం నెరవేర్చిందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.