రంగారెడ్డి

జల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనత్‌నగర్, ఫిబ్రవరి 25: జల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. నీటి సంరక్షణపై నగర ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం ఆదివారం చార్మినార్ వద్ద ‘జలం-జీవం’ పేరుతో నిర్వహించిన 5కే రన్‌ను వాటర్ వర్క్స్ ఎండి దానకిషోర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమిపై జీవిస్తున్న ప్రతి జీవికి నీరు ఎంతో అవసరమని అన్నారు. నానాటికి అంతరించిపోతున్న నీటి వనరులను దృష్టిలో ఉంచుకొని నీటి వృధాను అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ, డీసీపీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ను గద్దె దించడానికి ప్రజలు సిద్ధం

*టీడీపీ విమర్శ
వనస్థలిపురం, ఫిబ్రవరి 25: మాయమాటలతో ప్రభుత్వాన్ని నడిస్తూ ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఈ.పెద్దిరెడ్డి చెప్పారు. ఎల్బీనగర్ నియోజకవర్గం బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఏడు కాలనీలలో ఉన్న రిజిస్ట్రేషన్, జీహెచ్‌ఎంసీ ఇళ్ల అనుమతుల సమస్య పరిష్కారం కోసం డివిజన్ టీడీపీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు రవిశంకర్ నిర్వహించిన ఒక్క రోజు నిరాహారదీక్ష కార్యక్రమానికి పెద్దిరెడ్డితో పాటు, ఇబ్రహీంపట్నం టీడీపీ ఇన్‌చార్జీ రొక్కం భీంరెడ్డి హాజరై తమ సంఘీభావాన్ని ప్రకటించారు.రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్‌లో అధికారంలోకి వచ్చిన పాలకులు మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఈ సమస్య పరిష్కారం కాకుంటే టీడీపీ ఆధ్వర్యంలో ఆమరణనిరాహార దీక్ష చేయడానికైనా వెనకాడేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సామ ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు కటికరెడ్డి అరవింద్ రెడ్డి, డివిజన్ టీడీపీ అధ్యక్షుడు రవి శంకర్ పాల్గొన్నారు.