రంగారెడ్డి

భూ సేకరణ వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేవెళ్ల, మార్చి 22: భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ రాఘునందన్ రావు ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని ఆర్‌డీవో కార్యాలయంలో డివిజన్‌లోని అన్ని మండలాల తహశీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను మండలాల వారీగా భూములకు సంబంధించి ఆధార్ సీడింగ్ పక్రియా ఎంత వరకు వచ్చిందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేపడుతున్న జాతీయ రహదారి రోడ్డు విస్తరణ కోసం సేకరిస్తున్న భూములను తొందరగా సేకరించాలని సూచించారు. చేవెళ్ల, మొయినాబాద్ మండలాల్లో భూ సేకరణ మరింత వేగవంతం చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో పాల్గొన్నారు.
ఆసుపత్రి నిర్మాణానికి స్థలపరిశీలన
చేవెళ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న పాలిటివ్ కేర్ సెంటర్‌లో క్యాన్స్‌ర్ రోగులకు పూర్తిస్థాయి భవనం నిర్మించేందుకు గాను ఎంపీడీవో కార్యాలయానికి చెందిన భవనాలు శిథిలావస్థకు చేరిన క్వార్టర్స్ స్థానంలో నూతన భవనం నిర్మించేందుకు ప్రభుత్వం ఇటీవల రూ.48 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఆ భవనానికి కేటాయించిన ఎకరం స్థలాన్ని కలెక్టర్ గురువారం పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహశీల్దార్ పురుషోత్తం, ఉప తహశీల్దార్ అశోక్, ఏడీఏ దేవ్‌కుమార్ పాల్గొన్నారు.
భూ సేకరణ చట్టం ప్రకారం బాధితులకు పరిహారం
బీజాపూర్ రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులకు భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం అందజేస్తామని కలెక్టర్ రఘునందన్ రావు అన్నారు. దీనికి రైతులు సహకరించి భూములిచ్చేందుకు అంగీకారం తెలపాలని కోరారు. గురువారం చేవెళ్ల రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి వచ్చిన కలెక్టర్ డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు, ఉప తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు. రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులు.. కలెక్టర్‌ను కలిసి ప్రభుత్వం ఇచ్చే పరిహారం సరిపోదని, ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం చెల్లించాలని వినతి పత్రం అందజేశారు. ఎకరం ధర ప్రస్తుతం రూ.50 లక్షల రూపాయలు పలుకుతుంటే ప్రభుత్వం మాత్రం రూ.5 లక్షలే ఉందని వారంతా వాపోయారు. ప్రభుత్వ ధర ప్రకారం పరిహారం చెలిస్తే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని కాంగ్రెస్ నాయకులు వెంకటస్వామి, గోపాల్‌రెడ్డి, రమణా రెడ్డి తెలిపారు. కలెక్టర్ స్పందిస్తూ భూసేకరణ చట్టం ప్రకారం మాత్రమే పరిహారం చల్లించేందుకు అవకాశం ఉందని, పెంపు విషయం తమ పరిధిలో లేదని చెప్పారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో నాయకులు ఆగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కవాడి బాగిరెడ్డి, వెంకట్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి ఉన్నారు.