రంగారెడ్డి

కేంద్ర మాజీ మంత్రి సర్వేను అరెస్ట్ చేసి శిక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఏప్రిల్ 16: అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డిని దూషించిన కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను అరెస్ట్ చేసి శిక్షించాలని తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ రవిప్రకాశ్ డిమాండ్ చేసారు. సోమవారం ప్రభుత్వ ఉద్యోగులు మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. రవిప్రకాశ్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై రాజకీయ నాయకులు దాడులు పరిపాటై పోయాయని, వాటిని సమర్ధవంతంగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఇలాంటి విషయాల్లో అధికారులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. సర్వే సత్యనారాయణపై చర్యలు తీసుకోవల్సిందిగా హోం మంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరాలంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేసారు. సర్వే సత్యనారాయణపై చర్యలు తీసుకునే వరకు నిరసనలు కొనసాగిస్తూనే ఉంటామని హెచ్చరించారు. తెలంగాణ ఎంప్లారుూస్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు వినయ్ కుమార్, సురేశ్ మోహన్, కైలాసం, ఉపేందర్ రెడ్డి, గౌతంకుమార్, పర్వతాలు, రాజు, ప్రవీణ్, జేమ్స్, పద్మ, హేమలత, శ్రీకాంత్, శ్రీనివాస్, రవి కుమార్, రాజేందర్, కిరణ్, శ్రీదేవి పాల్గొన్నారు.

ఆసుపత్రుల్లో ధనార్జనకు ప్రాధాన్యత ఇవ్వొద్దు
రాజేంద్రనగర్, ఏప్రిల్ 16 : ప్రైవేట్ ఆసుపత్రులు ధనార్జనకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే టీ.ప్రకాష్ గౌడ్ అన్నారు. సోమవారం రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ ప్రేమావతిపేట్‌లో నూతనంగా ప్రారంభించిన క్లీనిక్‌ను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ సుజాత, డాక్టర్ లక్ష్మణ్ ప్రతి బుధవారం ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని ప్రకటించడం సంతోషంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు బీ.వెంకట్ రెడ్డి, రఘు గౌడ్, సూర్యం, రాజు పాల్గొన్నారు.